ప్రైవేటు ఆసుపత్రుల కంటే మెరుగైన సేవలు రోగులకు అందాలి:


ప్రైవేటు ఆసుపత్రుల కంటే మెరుగైన సేవలు రోగులకు అందాలి: 

ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు

జిల్లా ఆసుపత్రి తనిఖీ, వైద్యులతో సమావేశం 

ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణాల పరిశీలన

విజయనగరం, అక్టోబర్ 15 (ప్రజా అమరావతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులు తమకు అత్యుత్తమ వైద్య సేవలు అందాయనే సంతృప్తితో ఆసుపత్రి నుంచి తిరిగి వెళ్ళాలన్నదే ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని ఆ మేరకు వైద్యసేవలు మెరుగుపరిచే దిశగా వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ప్రభుత్వ వైద్యులకు సూచించారు. ఆసుపత్రుల్లో నాడు – నేడు పేరుతో వసతులు మెరుగు పరచడంలో ముఖ్య ఉద్దేశ్యం ఇదేనని చెప్పారు.   ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తమకు మంచి వైద్య సేవలు అందుతాయనే అభిప్రాయాన్ని కలుగజేసే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు పని చేయాలన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శనివారం జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూర్యకుమారి తో కలసి జిల్లా ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి రోగుఅలకు అందుతున్న సేవలపై ఆరా తీసారు. ముందుగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు చేపట్టిన అదనపు నిర్మాణాలు, కల్పిస్తున్న అదనపు వసతులపై వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు సత్యప్రభాకర్, ఎస్.ఇ. శివకుమార్ తదితరులు చిత్రపటాల ద్వారా వివరించారు. 

ఓ.పి. నమోదు విభాగాన్ని తనిఖీ చేసి రోజుకు ఎంతమంది ఓ.పి. నమోదు అవుతోందని ముఖ్య కార్యదర్శి తెలుసుకున్నారు. రోజుకు 600 మంది వరకు రోగులు నమోదు అవుతున్నట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. ఓ.పి. నమోదు ఎంతమంది సిబ్బందితో నిర్వహిస్తున్నదీ తెలుసుకున్నారు. కొత్తగా ఓ.పి.బ్లాక్ నిర్మిస్తున్నామని అక్కడ 11 కౌంటర్ లు ఏర్పాటు చేయనున్నట్టు ఇంజనీరింగ్ అధికారులు వివరించారు. అనంతరం ఆరోగ్యశ్రీ విభాగాన్ని పరిశీలించి ఇక్కడికి వచ్చే రోగులకు ఆరోగ్యమిత్రాల ద్వారా అందిస్తున్న సేవలపై తెలుసుకున్నారు. రోగులకు సంబంధించిన డయాగ్నొస్టిక్ సమాచారాన్ని, ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్ లను, కేసు రికార్డులను, వారికి ఇస్తున్న మెడిసిన్ ను ఒక కోడ్ నెంబర్ ఇచ్చి ఆన్ లైన్ లో వుంచినట్లయితే వాటిని ఇతర వైద్యులు ఎక్కడ వారికి చికిత్స అందించినా వారికి కేస్ హిస్టరీ అందుబాటులో వుంటూ చికిత్స సులభతరం అవుతుందన్నారు. 

అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారితో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో సమావేశమయ్యారు.  ఈసందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది ఖాళీల భర్తీ ప్రక్రియపై సమీక్షించారు. ఖాళీల భర్తీలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.కే.పద్మలీల వివరించారు. ముఖ్యంగా వికలాంగులకు కేటాయించిన ఖాళీల భర్తీ సమస్యగా ఉంటుందని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వెంటనే రాష్ట్ర స్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ముఖ్య కార్యదర్శి ఫోన్ లో మాట్లాడి పోస్టుల భర్తీపై స్పష్టత ఇచ్చారు. 

ఆసుపత్రిలో డయాగ్నొస్టిక్ పరికరాల అవసరం లభ్యత పై ముఖ్య కార్యదర్శి ఆరా తీసారు. శస్త్ర చికిత్సలకు అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో తగినంతగా అందుబాటులో ఉన్నదీ లేనిదీ ఆరా తీసారు. మందుల లభ్యతపై కుడా తెలుసు కున్నారు.  ఇక్కడి సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో 575 రకాల మందులు అందుబాటులో వున్నట్టు డ్రగ్ స్టోర్ అధికారులు వివరించారు. మందులకు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఇండెంట్ ఇచ్చిన వెంటనే మందులు సరఫరా చేస్తున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. 

ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రులకు ఇస్తున్న నిధుల్లో ౩౦శాతం రోగుల సౌకర్యాల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్య ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు చెప్పారు. ఈ మొత్తాన్ని సిబ్బంది జీతాల కోసం ఖర్చు చేయడం సరికాదన్నారు. రోగులకు అవసరమైన ప్రత్యెక మందులు, చికిత్స పరికరాలు ఈ నిధులతోనే కొనుగోలు చేయవచ్చన్నారు. 

నగరంలో తల్లిబిడ్డలకు వైద్య సేవలందించే ఘోషా ఆసుపత్రిని కొత్తగా ఏర్పాటు చేసే వైద్య కళాశాలలో కలపకుండా దీనిని ప్రత్యెక తల్లీపిల్లల ఆసుపత్రిగా కొనసాగించినట్లయితే ప్రజలకు మంచి సేవలు అందుతాయని ఆసుపత్రి వైద్యులతో పాటు జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ముఖ్య కార్యదర్శికి వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వ స్థాయిలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని భోగాపురం వద్ద రోడ్డు ప్రమాద బాధితుల అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్య కార్యదర్శి చెప్పారు. ఈ పర్యటనలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సీతారామ రాజు, డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణ రావు, డి.ఎం.హెచ్.ఓ. డా.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image