ఆంధ్రప్రదేశ్ లో విప్లవంలా "ఆరోగ్య సంరక్షణ

 *ఆంధ్రప్రదేశ్ లో విప్లవంలా "ఆరోగ్య సంరక్షణ" 


*ఢిల్లీ వేదికగా  "గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్"*


*ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో ఏపీ కీలక అడుగు*


*లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత పునాదులుగా భవిష్యత్ నిర్మాణం* 


*2 రోజుల కీలక సదస్సులో ఏపీ వాణిని వినిపించే అవకాశం పొందిన మంత్రి విడదల రజిని*


*ప్రజంటేషన్ అనంతరం 'మహిళల డిజిటల్ హెల్త్' లోగో ఆవిష్కరణ*


అమరావతి, అక్టోబర్, 27 (ప్రజా అమరావతి); రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఢిల్లీకి పయనమవనున్నారు. అక్టోబర్ 28, 29 తేదీలలో ఢిల్లీ వేదికగా జరగుతున్న "గ్లోబల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్" లో మంత్రి పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతృత్వంలో  'ఆరోగ్య సంరక్షణ' విప్లవంలా ముందుకెళుతున్న విషయాన్ని ప్రపంచస్థాయి కీలక సదస్సులో 29వ తేదీ (శనివారం) సాయంత్రం 5గం.లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాణిని  మంత్రి రజిని వినిపించనున్నారు. "మహిళల కోసం డిజిటల్ హెల్త్" నేపథ్యంతో తీర్చిదిద్దిన లోగోను మంత్రి ఆవిష్కరిస్తారు. లభ్యత, సౌలభ్యత, ఆమోదయోగ్యత, స్థోమత పునాదులుగా భవిష్యత్ నిర్మాణం (4As) విధానంలో మరో మలుపు తీసుకుంటున్న విషయాన్ని ప్రధానంగా వివరించనున్నారు. ఇప్పటికే డిజిటల్ హెల్త్ దిశగా ఏపీ తీసుకున్న సంస్కరణలు, దార్శినిక నిర్ణయాలను చాటి చెప్పనున్నారు. ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటులో ఏపీ కీలకంగా అడుగులు వేస్తున్న అంశంపై  ఆమె చర్చించనున్నారు.  ఆంధ్రప్రదేశ్ లో వైద్య సేవల డిజిటలైజేషన్, పీపీపీ పద్ధతిలో ఏపీలో మెడికల్ టీచింగ్ యూనివర్శిటీ, రీసెర్చ్ వర్సిటీ  ఏర్పాటు, సమగ్ర సదుపాయాలతో కాన్సర్ కేర్ సెంటర్ స్థాపన, రాష్ట్రవ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో  16 చోట్ల ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి గల అవకాశాలను మంత్రి విడదల రజిని ప్రపంచ ఆరోగ్య సదస్సులో ప్రస్తావించనున్నారు. 


ఈ సదస్సుకు నీతి ఆయోగ్ సభ్యులు, ఆయూష్ సెక్రటరీ, గ్లోబల్ డిజిటల్ హెల్త్ సీనియర్ డైరెక్టర్, ఎయిమ్స్ ఢిల్లీ చీఫ్, ఇన్వెస్ట్ ఇండియా ఎండీ, విష్ సీఈవో, వైద్యరంగంలోని వివిధ విభాగాల అధిపతులు, శాస్త్రవేత్తలు, వైద్యులు, సలహాదారులు, వైద్యాధికారులు హాజరవుతారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image