రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన

  రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన


 ప్రశాంత కాకినాడలో కబ్జాలు 

 టిడిపితోనే రాష్ట్ర భవిష్యత్తు 

  కాకినాడ, అక్టోబర్ 14 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలనను కొనసాగిస్తున్నారని దానివల్ల రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలుగుదేశం పార్టీ కాకినాడ  జిల్లా ఇంచార్జ్ బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. అలాగే కాకినాడ సిటీ ఎమ్మెల్యే అరాచకాలు, అక్రమాలు పెరిగిపోయాయంటూ చెప్పారు. శుక్రవారం నగరంలోని సూర్య కళామందిరంలో కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ( కొండబాబు) అధ్యక్షతన జరిగింది.  ఈ సభకు టిడిపి శ్రేణులు అశేషంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు దివంగత సీఎం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హాజరైన కాకినాడ జిల్లా ఇన్చార్జ్ బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సీఎం జగన్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులను బెదిరింపులు గురిచేసి పోలీసులతో వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ఇసుక, మద్యం, దొంగ బియ్యం ఒక మాఫియాగా నడుస్తోందని దానికి సీఎం పూర్తిగా సహకరిస్తున్నాడన్నారు. కాకినాడ నగరంలో సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భూకబ్జాలు అక్రమాలు చేస్తున్నారన్నారని దానికి తోడుగా దొంగ బియ్యం విదేశాలకు ఓడల మీదుగా రవాణా చేస్తూ ఆ బియ్యంలో మాదకద్రవ్యాలను పంపుతున్నారని చెప్పారు. ఇవన్నీ సీఎం జగన్కు తెలిసినా అతనికి 75శాతం వాటాను, మిగిలిన 25% ద్వారంపూడి తీసుకుంటున్నారన్నారు. తల్లికి, చెల్లికి అన్యాయం చేసిన జగన్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు 75 శాతం పూర్తి చేస్తే మిగిలిన 25 శాతం చేయలేకపోయారన్నారు. అలాగే రాజ్యాన్ని అమరావతిని నాశనం చేశారని చెప్పారు. తమ టిడిపి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో ఇళ్లను నిర్మాణం చేస్తే వాటిని లబ్ధిదారులుగా ఇవ్వక పోవడం వల్ల బూత్ బంగ్లాలుగా మారాయన్నారు. రాష్ట్రంలో మంచి పాలనకు చంద్రబాబు ముఖ్యమంత్రి గాను కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబును గెలిపించుకోవాలని బండారు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి భక్తితో కాకినాడ నుండి సింహాచలంనకు పాదయాత్ర చేశాడని అనుకున్నానని కానీ అతను విజయనగరంలో ఉన్న రాజావారి భూములను దోచుకునేందుకు చేస్తున్నట్లు తర్వాత తాను గ్రహించినట్లు బండారు తెలిపారు.   

   కాకినాడ టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే భూ అక్రమాలు చేస్తున్నాడని వీటికి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. ఒక హోటల్ను సెటిల్మెంట్లో కాజేశారని, అలాగే కాకినాడలో ఖాళీ స్థలం ఉంటే దానిని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని చెప్పారు. కాకినాడ ఓడరేవు ద్వారా దొంగ బియ్యంతో పాటు వాటిలో మాదక ద్రవ్యాలు ఎగుమతి చేస్తున్నారన్నారు. తమ పార్టీ అధినేత సుదీర్ఘ అనుభవం గల చంద్రబాబును ఎమ్మెల్యే ద్వారంపూడి దారుణంగా విమర్శించారని దానికి ప్రజలు బుద్ధి చెప్తారని జ్యోతుల అన్నారు.

   పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో తాను అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని రాబోయే ఎన్నికల్లో టిడిపి కచ్చితంగా గెలిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటి నుంచే కార్యకర్తలు ప్రజల తరఫున పార్టీకి అండగా నిలవాలన్నారు. నూతన కార్యకర్తలను తయారు చేసుకోవాలని వనమాడికి రాజప్ప సూచించారు.

  ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, టిడిపి నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పిల్లి అనంతలక్ష్మి, బండారు సత్యానందరావు,  పేరాబత్తుల రాజశేఖర్, యనమల కృష్ణుడు, అయితాబత్తుల ఆనందరావు, వివై దాసు, కలగా శివరాణి, పిల్లి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు..

Comments