*గిరిజన గ్రామాల్లో ముమ్మరంగా గడప గడపకు
*
పార్వతీపురం/పాచిపెంట, అక్టోబర్ 18 (ప్రజా అమరావతి): గిరిజన గ్రామాల్లో ముమ్మరంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్నదొర నిర్వహిస్తున్నారు. సోమ, మంగళ వారాలు ఏకధాటిగా గిరిజన గ్రామాల్లో గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. మంగళ వారం పాచిపెంట మండలం రాయిగుడ్డి వలస పంచాయతీ కొత్తవలస గిరిజన గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించుటకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం దోహదపడుతుందని ఆయన చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని ఉప ముఖ్యమంత్రి అన్నారు. గిరిజనులు అంటే ఎనలేని ప్రేమ అభిమానాలు ఉన్నాయని చెప్పారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. గడప గడపకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వం నుండి కలిగిన లబ్ధిని వివరిస్తూ కర పత్రాలను ప్రజలకు ఉప ముఖ్యమంత్రి అందజేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు ఆదుకుంటుందని, పేదలందరికీ ఇల్లు అందించాలనే సంకల్పంతో రాష్ట్రంలో లక్షల ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన వివరించారు. పేదలు విద్యకు దూరం కాకూడదు అని అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఎంత మంది పిల్లలు ఉన్న వారందరికీ ఈ కార్యక్రమాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఉన్నత చదువులు చదివే వారికి విద్యా దీవెన క్రింద పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా జగన్ పరిపాలనను కొనసాగిస్తున్నారని చెప్పారు. వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం, వై.ఎస్ ఆర్ చేయూత తదితర పథకాల క్రింద ఆర్థిక సహాయం జమ చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సచివాలయం పరిధిలో మౌళిక సదుపాయాలు కల్పనకు రూ.20 లక్షలు చొప్పున మంజూరు జరిగిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. స్థానిక పాఠశాలను సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జ్వరం రాగానే ఇంటికి వెళ్ళరాదని, ఉపాధ్యాయులకు తెలియజేయాలని తద్వారా వైద్యం అందించుటకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. విద్యతోనే కుటుంబాలు అభివృద్ది చెందుతాయని ఆయన ఉద్బోధించారు.
ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment