వికేంద్రీకరణే మన లక్ష్యం..

 వికేంద్రీకరణే మన లక్ష్యం..

అన్ని ప్రాంతాలూ బాగుండాలి

అందులో అమరావతి ఒక భాగంగా ఉండాలి


అందరికీ విజయదశమి శుభాకాంక్షలు...

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన వికేంద్రీకరణే ఏకైక మంత్రం. పార్టీ రాజకీయ లక్ష్యం అధికార వికేంద్రీకరణే. అమ్మవారి ఆశీస్సులతో సీఎం జగన్‌  పాలనలో రాష్ట్రం బాగుండాలి. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నా.


మన రాజకీయ లక్ష్యం అధికార వికేంద్రీకరణే. 

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు బాగుండాలనేదే సీఎం జగన్‌ ఉద్దేశం. అందులో అమరావతి ఒక భాగంగా ఉండాలి. మూడు రాజధానులకు ప్రజల మద్దతు ఉంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అదే ఏకైక మంత్రం. వికేంద్రీకరణే నినాదంగా ప్రజల్లోకి వెళ్లాలి. రాజధాని ఒకటే ఉండాలంటూ చంద్రబాబు, దోపిడీకి అలవాటుపడిన ఆయన ముఠా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. భవిష్యత్తులో మళ్లీ వేర్పాటువాదం తలెత్తకుండా ఉండేందుకే మూడు రాజధానులు. ప్రజలకు వికేంద్రీకరణపై మరింత సమగ్రంగా తెలియజేయాలి.


రెచ్చగొట్టేందుకే అరసవెల్లి యాత్ర..

చంద్రబాబు ప్రకటించిన అమరావతి ఎండమావి లాంటిది. ఎప్పటికీ ఆచరణలోనికి రానిది. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు టీడీపీ ఆధ్వర్యంలో తిరుపతికి పాదయాత్ర చేశారు. ఈరోజు అరసవెల్లికి పాదయాత్ర చేస్తున్నారు. అలజడులు సృష్టించటమే వారి లక్ష్యం. రాష్ట్ర ప్రజల కష్టాన్ని 29 గ్రామాల గోతుల్లో పోయాలంటున్నారు. మరి రాష్ట్రంలో 5 కోట్ల మంది పరిస్థితి ఏమిటి? పాదయాత్ర పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న దండయాత్ర తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఇక్కడ్నుంచి విశాఖ మీదుగా అరసవల్లి వరకు వెళ్తుంది. ఈలోపు ప్రతిచోటా ఈ దండయాత్ర తప్పు అని ప్రజలకు తెలిసేలా చేయాలి. టీడీపీ ధోరణి వివిధ వర్గాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.


దుర్మార్గ పోకడలను తిప్పికొడదాం..

వికేంద్రీకరణ సామాజిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. దీనికి మద్దతు ఇచ్చే వారితో చేయి కలిపి ప్రజల్లో చర్చ జరిగేటట్లు చేయాలి. టీడీపీ దుర్మార్గ పోకడలను తిప్పికొట్టేలా కార్యాచరణ తయారు చేసుకోవాలని ఇటీవల సమావేశాల్లో సీఎం జగన్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ సీనియర్‌ నేతలతో చర్చించి ఈ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించాం.


దశమి రోజు దేవాలయాల్లో పూజలు చేద్దాం..

ఈ నెల ఐదో తేదీన విజయదశమి రోజు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో పెద్ద ఎత్తున పూజలు జరగాలి. కొబ్బరి కాయలు కొట్టి వికేంద్రీకరణకు అమ్మవారి ఆశీస్సులు కావాలని కోరుకోవాలి. సీఎం జగన్‌ రాష్ట్రంపైన, ప్రజలపైన మమకారంతో తెచ్చిన వికేంద్రీకరణ అజెండాకు అమ్మవారి ఆశీస్సులు కోరాలి. రాష్ట్రం అంతటికీ ప్రయోజనం చేకూరే ఆలోచనకు అమ్మవారి ఆశీస్సులు పొందాలి. దుర్మార్గమైన ఆలోచనలు చేసే చంద్రబాబు, టీడీపీ నేతల మనసు మారాలని ప్రార్ధన చేయాలి. వికేంద్రీకరణవైపు వారి మనసు మళ్లేలా చేయాలని అమ్మవారిని వేడుకోవాలి. ఈ పూజలు విజయదశమి రోజు రాష్ట్రం అంతటా ప్రతిధ్వనించేలా చేయాలి.

 


Comments