వినియోగదారులకు నాణ్య మైన చేపలను తక్కువ ధరకే అందించాలనే సంకల్పం

 కొవ్వూరు (ప్రజా అమరావతి);



* మత్స్య కారులు ఆర్థికం గా అభివృద్ధి చెందేదుకు  సొంతం గా వ్యాపారం చేసుకోవడానికి మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటు.


* వినియోగదారులకు నాణ్య మైన చేపలను తక్కువ ధరకే అందించాలనే సంకల్పం 



ఫిష్  మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పా టుకు రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది.


* రాష్ట్ర హోం శాఖ మంత్రి

   డా. తానేటి వనిత.



వినియోగదారులకు నాణ్య మైన చేపలను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ఫిష్ ఆంధ్ర మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పా టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి డా.తానేటి వనిత అన్నారు. 


శనివారం పంగిడి గ్రామం లో మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ ను మంత్రి ప్రారంభించారు.  ఈ సందర్బం గా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ దళారులు, మధ్యవర్తుల బారిన పడకుండా మత్స్యకారులు నుండి నేరుగా కొనుగోలుదారులకు  చేపల అమ్మకాలు చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యం తో ఇది అమలు చేస్తున్నట్లు అన్నారు.  కొత్తగా రైతులు ఫిష్ ఆంధ్ర మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటు చేసుకుంటే  ఒక యూనిట్ ఖరీదు 3 లక్ష ల 25 వేలు రూపాయలు అవుతుందన్నారు.  ఈయూనిట్ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం బి. సి. లకు 40 శాతం, ఎస్. సి., ఎస్. టి. లకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత మత్స్యకారులు కుటుంబాలు ఆర్థికం గా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతొందన్నారు. ఈ అవుట్ లేట్ లు ద్వారా లైవ్ చేప లను ప్రజలకు తక్కువ ధరకు ఇస్తున్నామన్నారు.  లైవ్ చేపలను లబ్ధిదారులకు ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారన్నారు.   నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కొత్తగా మినీ ఫిష్ రిటైల్ అవుట్ లెట్ల తీసుకువచ్చిందన్నారు.


ఈ కార్యక్రమం లో మత్స్య శాఖ ఎ. డి, బి. సైదా నాయక్, ముదునూరి నాగరాజు, బండి పట్టాభి రామారావు, నాయకు లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



Comments