నెల్లూరు, అక్టోబర్ 4 (ప్రజా అమరావతి): జిల్లాలోని ఓటర్లందరూ తమ ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకునేలా అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటర్లకు అవగాహన కల్పించాల
ని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓటరు జాబితా తయారీపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 45 శాతం ఓటుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన ఓటర్లు కూడా ఆధార్ అనుసంధాన ప్రక్రియకు సహకరించాలని కోరారు. ఓటర్లకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఆధార్ నెంబర్ కు ఓటు అనుసంధానించుకునేలా స్థానిక ప్రజా ప్రతినిధులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి నెలా రెండో శనివారం, ఆదివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరారు. బి ఎల్ వో లు ఫారం-6 బి ప్రకారం ఓటరు వివరాలు సేకరించి, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ పై సంతకం తీసుకొని, అనుసంధానం చేస్తారన్నారు. ఆధార్ కార్డు సేకరించడం పట్ల ఓటర్లు ఎటువంటి అపోహలకు గురికాకుండా, ఓటరు ఆధార్ వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయని, ఈవీఎం గోడౌన్లలో ఈ జాబితాలను భద్రపరుస్తామని రాజకీయ పార్టీల నాయకులకు కలెక్టర్ వివరించారు. జిల్లాలో నాడు నేడు కింద మెరుగైన వసతులతో నిర్మించిన భవనాల్లోకి కొన్ని పోలింగ్ కేంద్రాలను మార్పు చేయడం జరిగిందని, మిగిలినవన్నీ యధావిధిగా ఉంటాయని కలెక్టర్ చెప్పారు. పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి తాజాగా ఓటరు జాబితాను తయారు చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.
అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులు కలెక్టర్ సూచించిన అంశాలకు తమ అంగీకారం తెలిపారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, వైసిపి, బిజెపి, టిడిపి, సిపిఐ పార్టీల ప్రతినిధులు శ్రీ మురళీ మోహన్ రెడ్డి, శ్రీ కాళేశ్వర రావు, శ్రీ చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, శ్రీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment