కొత్తపేట అక్టోబర్ 5 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుంద
ని అదేవిధంగా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువవుతాయని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నూతనంగా ఏడు మండ లాలతో మంజూరైన డివిజనల్ రెవెన్యూ కార్యాలయాన్ని స్థానికంగా ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నుంచి రాజధాని వరకు రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీ కరణ కొరకు పక్కాగా చర్యలు చేపడుతుందని తద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించి ముందుకు సాగుతుందన్నారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను, తదుపరి జిల్లాల పునర్విభజన ప్రస్తుతం పరిపాలన సౌలభ్యం కోసం నూతన రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతూ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపన దిశగా ముందడుగు వేస్తోందన్నారు. పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు చేరువై ప్రభుత్వ సేవలను సత్వరమే అందించేందుకు పాటుపడుతో oదన్నారు. ఇప్పటికే జిల్లాలు గ్రామ సచివాలయాలు ఏర్పాటు ద్వారా పాలన మరింత సులభతరంగా మారిందని అన్ని ప్రాంతాల అభివృద్ధిని రాష్ట్ర ప్రభు త్వం కాంక్షించి ముందుకు సాగుతుం దన్నారు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, శాంతిభద్రతలు వంటి ప్రభుత్వ పరమైన సేవలు ప్రజలకు అందుబా టులోకి వచ్చాయన్నారు. శ్రీ బాగ్ ఒడంబడిక, తదుపరి ఏర్పాటు చేసిన నాలుగు కమిటీలు కూడా పాలన వికేంద్రీకరణ అవసరమని మూడు ప్రాంతాల అభివృద్ధి ద్వారా రాష్ట్రం ప్రగతి పథంలో పయనించ గలదని సూచించడం జరిగింద న్నారు. ఆదిశగానే శాసన రాజధాని అమరావతి, పరిపాలన రాజధాని విశాఖపట్నం, జ్యుడీషియల్ రాజధాని కర్నూలును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం మూడు పంటలు పంటే ప్రాంతమని సాయల్ బేరింగ్ కెపాసిటీ కూడా చాలా తక్కు వ అని భవన నిర్మాణాలకు అంతగా అనువైనది కాదని కమిటీలు సూచిం చడం జరిగిందన్నారు. విజయదశ మి రోజున నూతన కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు కొత్తపేట ప్రాంతవాసు ల చిరకాల వాంఛ నేడు నెరవేరింద న్నారు. కొత్తపేట పరిధిలో 114 గ్రామాలు, ఉండగా వాటిలో 99 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని ప్రభుత్వ శాఖలు కూడా కొత్తపేటలో చాలా వరకు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎన్నిక ల ముందు ఇచ్చిన పాలన వికేంద్రీ కరణ హామీలను భాగంగానే కొత్త పేట రెవెన్యూ డివిజన్ ఆవిర్భవిం చిందన్నారు. అన్ని శాఖలకు తల్లి లాంటిది రెవెన్యూ శాఖని ఈ శాఖతో వ్యవసాయ శాఖకు చాలా సంబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. బ్రిటిష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులు చాలావరకు శిధిలమై అవకతవకలు కూడా జరిగాయని వాటిని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో సచ్చికరణ చేసేందుకు వంద సంవత్సరాల తర్వాత వైయస్సార్ జగనన్న శాశ్వత హక్కు భూ రక్ష రీ సర్వే పేరిట రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన స్వచ్చీకరణ సివిల్ తగాదాల నివారణ కొరకు ఈ రీ సర్వేను మూడు దశలలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిందని ఈ సర్వే పూర్తయిన పిదప జగనన్న శాశ్వత భూహక్కు పత్రాలు రైతు పేరు మీద ఇవ్వడంతోపాటు భూ రికార్డులలో అవకతవకలు పాల్పడ డానికి ఆస్కారం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం ఉన్నతాధికారుల వద్ద శాశ్వతమైన భూ రికార్డులను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయడం జరుగుతుందని అభద్రతకు తావు ఏమాత్రం ఉండద న్నారు.ఈ సర్వే పూర్తయితే కోర్టుల లో 90 శాతం సివిల్ తగాదాలు ఉత్పన్నం కావని ఆయన స్పష్టం చేశారు పరిపాలన వికేంద్రీకరణ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరమని ఆయన పునరుద్ఘా టించారు. అప్పట్లో నియమించిన కమిటీలు 1500 ఎకరాలు తక్షణం రాజధాని ఏర్పాటుకు, మూడు వేల ఎకరాలు వివిధ ప్రభుత్వ కార్యాల యాలు ఏర్పాటుకు అవసరమని సూచించాయని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కమిటీలు రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు ఆదాయ వనరులు దృష్టిలో ఉంచుకొని మూడు ప్రాంతాలను ఎంపిక చేశాయన్నారు. ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ కొత్తపేట ప్రాంతవా సుల చిరకాల వాంఛ పితృ సమానులైన పిళ్లి సుభాష్ చంద్రబో సు వారు మరియు రాష్ట్ర ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి కృషివల్లే సాధ్యమైందని తెలిపారు. గతంలో చిర్ల జగ్గిరెడ్డి తాతయ్య ,తండ్రి ఈ ప్రాంతంలో రాజకీయ ప్రతినిధులుగా కొనసా గడం జరిగిందని ఆయన సందర్భం గా గుర్తు చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని సమదృష్టితో చూస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించా లనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమం త్రి పాలన వికేంద్రీకరణకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. ప్రస్తు తం స్థానికంగా ఉన్న శెట్టిబలిజి కళ్యాణ మండపంలో ఆర్డిఓ కార్యా లయం ఏర్పాటుకు శెట్టిబలిజి సంఘ ప్రతినిధులను ఒప్పించడం జరిగిందని ఆయన తెలిపారు. విజ యదశమి సందర్భంగా రావుల పాలెం- జొన్నాడ గోదావరిపై వంతెన మరమ్మత్తుల అనంతరం ప్రారంభిం చడం జరిగిందని ఆయన తెలిపా రు. సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ విభాగం వారు తనిఖీలో జాప్యం జరిగినం దున జొన్నాడ -రావులపాలెం వారదిని నిర్దేశిత సమయంలో పున:ప్రారంభించడం జరగలేద న్నారు ఈ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు మూలంగా కొత్తపేట పరిధిలోని గ్రామాలలో గ్రామ కంఠం భూములు సమస్యలు పరిష్కారం కాగలవని ఆయన ఆకాంక్షించారు. పి గన్నవరం, అంబాజీపేట, అయినవిల్లి, ఆత్రేయపురం రావులపాలెం, ఆలమూరు మండలాలకు కొత్తపేట కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఆవిరిభవించిం దన్నారు. ఇవే కాకుండా నియోజక వర్గం పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజల రుణం తీర్చుకోవడం జరిగిం దని ఆయన సందర్భంగా తెలిపారు అనంతరం వారు ర్యాలీగా వెళ్లి దుర్గాదేవి ఆలయంలో వికేంద్రీకరణ కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిం చారు ఈ ర్యాలీలో అన్ని ప్రాంతాలు బాగుండాలి అందులో అమరావతి ఒక భాగమై ఉండాలన్నారు, భవిష్యత్తులో వేర్పాటు వాదం తలెత్తకుండా మూడు రాజధానులు ఉండాలని ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అని నినాదాలతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ వి వేణుగోపాలరావు పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు ఆర్డీవోలు వసంతరాయుడు, ఎం ముక్కంటి, తాసిల్దార్లు కిషోర్ బాబు అనిల్ కుమార్ వివి సత్యనారాయణ జడ్పిటిసి కె రమాదేవి ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment