రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాలి



అక్టోబర్ 5 (ప్రజా అమరావతి);


రాష్ట్రం అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందాల


ని, అన్ని సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగించేందుకు ముఖ్యమంత్రికి అమ్మ ఆశీస్సులు ఉండాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి  కొట్టు సత్యనారాయణ కోరారు.


బుధవారం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి  కొట్టు సత్యనారాయణ ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ అమ్మ దయతో ముఖ్యమంత్రికి మరింత బలం చేకూరి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగింపుకు తోడ్పడాలన్నారు.  పది రోజులు పాటు శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించుకున్నామని, ఇందుకు తోడ్పాటును అందించిన రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, దేవాదాయ శాఖలు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రతిపక్ష నాయకులు అమ్మ దర్శనానికి వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు.  ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజల విస్తృత అభివృద్ధిని కాంక్షించి మూడు రాజధానుల ఏర్పాటుకు ఆలోచన చేయడం జరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదును అభివృద్ధి చేసి లక్షల కోట్ల రూపాయలతో ఒకే ప్రదేశాన్ని అభివృద్ధి చేయడంతో రాష్ట్ర విభజన ద్వారా గుణపాఠంగా నేర్చుకున్నాం అన్నారు.  ఇప్పుడు స్వార్థం, స్వలాభం కోసం వేల కోట్ల రూపాయలు సంపాదించాలనే  దురుద్దేశంతో మూడు రాజధానులు వద్దు అని మాట్లాడుతున్నారన్నారు.  గత పాలకులు స్వార్థం వదిలి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కోరుకునే విధంగా మంచి ఆలోచన వారికి కలిగేలా అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు.  వ్యవసాయం దండగ అన్న ఇదే వ్యక్తి తర్వాత తప్పైందని ఒప్పుకోవడం జరిగిందని, అలాగే రాజధాని విషయంలో కూడా తప్పును గ్రహించి ఒప్పుకోవాలన్నారు. 150 కోట్ల రూపాయలతో ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేసానని అమ్మవారి సమక్షంలో అబద్ధం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉన్న భవనాలను పడగొట్టి, ఏడంతస్తుల మహా మండపం ఒకటి మాత్రమే నిర్మించే 150 కోట్ల రూపాయలు ఖర్చయిందని చెప్తున్నారన్నారు.  ముఖ్యమంత్రి అమరావతి రాజధాని కాదని చెప్పలేదని, అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని చెప్పారని అన్నారు.  ప్రతిపక్ష నాయకుడు హైదరాబాదు ముద్దు, ఆంధ్రా వద్దు అనే విధంగా ఏదో ఒక పని మీద వచ్చి పోవడం తప్ప రాజధానిలో ఉన్నది  లేదన్నారు.  అమరావతి లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడితే కోర్టులో కేసు వేయించి ధనిక, పేద తారతమ్యాలకు కారణంగా నిలిచారన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ముఖ్యమంత్రికి బలం చేకూరి అద్భుతమైన పరిపాలనను ఆటంకం లేని విధంగా కొనసాగించేందుకు చల్లని చూపు చూడాలన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతవానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.


Comments