స్వచ్ఛ నగరాల కోసం అధికారులు అంకితభావం తో పనిచేయాలి.

 


 *స్వ‌చ్ఛాంధ్ర‌ప్ర‌దేశే మ‌న లక్ష్యం*


 *రాష్ట్రంలోని అందరు మున్సిపల్ కమిషనర్ లతో సమీక్షా సమావేశం.* 


 *స్వచ్ఛ నగరాల కోసం అధికారులు అంకితభావం తో పనిచేయాలి.*


 


 *రాష్ట్రపుర‌పాల‌క‌, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూల‌పు సురేష్‌.* 


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను స్వచ్ఛాంధ్ర‌ప్ర‌దేశ్ గా తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా మ‌నంద‌రం ప‌నిచేయాల‌ని రాష్ట్ర పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధిశాఖా మాత్యులు డాక్టర్ ఆదిమూల‌పు సురేష్ ఉద్ఘాటించారు. స్వ‌చ్ఛ‌న‌గ‌రాల అభ్యున్న‌తిలో మ‌న రాష్ట్రం మ‌రింత ఖ్యాతి గ‌డించేలా అధికార యంత్రాంగం ముందుకుసాగాల‌ని పిలుపునిచ్చారు. పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ ఆధ్వ‌ర్యంలో బుధ‌వారం విజ‌య‌వాడ తుమ్మ‌లప‌ల్లి క‌ళాక్షేత్రంలో వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ - జాతీయ హ‌రిత ట్రిబ్యున‌ల్ దిశ‌లపై రాష్ట్రంలోని అన్ని న‌గ‌ర పాల‌క సంస్థ‌ల క‌మిష‌న‌ర్లు మ‌రియు ఉన్న‌తాధికారుల‌తో క్షేత్ర‌స్థాయి స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది.


ఈ స‌మావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి సురేష్ స్వ‌చ్ఛ నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌కు దిశా నిర్ధేశం చేశారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చేతుల మీదుగా క్లీన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్(క్లాప్‌) కార్య‌క్ర‌మం ప్రారంభించినప్పటి నుంచి పుర‌పాల‌క‌శాఖ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో కొత్త సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చింద‌న్నారు. ప్ర‌ధానంగా రాష్ట్రవ్యాప్తంగా లోక‌ల్ బాడీల‌ను ఏర్పాటు చేసి 2,253 చెత్త సేక‌ర‌ణ వాహ‌నాల‌తో త‌డి, పొడి చెత్తను నిత్యం సేక‌రించటం జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌తి ఇంటికీ త‌డి, పొడి చెత్త‌ను నిపేందుకు బుట్ట‌ల‌ను పంపిణీ చేసి వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ఒక క్ర‌మాన్ని తీసుకురాగ‌లిగామ‌ని అన్నారు. డోర్ టు డోర్ చెత్త సేక‌ర‌ణ‌లో నూరుశాతం ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌టం జ‌రిగింద‌న్నారు. త‌డి, పొడి చెత్త‌ను వేరుచేయ‌టంలో స‌ఫ‌లీకృతం కాగ‌లిగామ‌న్నారు. వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో జాతీయ‌స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చిన ఘ‌న‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాల‌క‌శాఖ ద‌క్కించుకుంద‌న్నారు. న‌గ‌రాలు మ‌రియు ప‌ట్ట‌ణాల‌లో పార‌శుద్ధ్య నిర్వ‌హ‌ణ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు దృశ్య‌మాద్య‌మాల ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ జ‌రుగుతొంద‌న్నారు. వాహ‌నం చెత్త సేక‌రించిన త‌దుప‌రి అది డంపింయార్డ్‌కు చేరుకు వ‌ర‌కు జీపీఎస్ ద్వారా క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌వేక్ష‌ణ ద్వారా స్వ‌చ్ఛ ల‌క్ష్యాన్ని సాధించగ‌లుగుతున్నామ‌న్నారు. ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో రాష్ట్రంలోని పలు పట్టణాలు దక్కించుకోవటం ఆనందదాయకం అన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయి లో రాష్ట్రానికి గుర్తింపు దక్కేలా అధికారులు మరింత కృషి చేయాలన్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి  చేసే ఆలోచ‌న‌లో భాగంగా విశాఖ‌ప‌ట్నం, రాజమండ్రి, గుంటూరు న‌గ‌రాల‌లో ప్లాంట్ల నిర్మాణ ప్ర‌తిపాద‌న‌ల‌ను పుర‌పాల‌క‌శాఖ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై.శ్రీ‌ల‌క్ష్మి మంత్రికి నివేదించారు. జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని అదేవిధంగా మ‌ధ్య త‌ర‌గ‌తి ఆదాయా స‌మూహాలు సొంతింటి క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్షిప్ల‌ను నెల‌కొల్పాల‌ని గౌర‌వ ముఖ్య‌మంత్రివ‌ర్యులు ల‌క్షించార‌ని ఇందులకుగాను న‌గ‌రాలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో గుర్తించిన లే ఔట్ లలో పనుల పురోగతి సాధించేలా అధికారులు చర్యలు చేపట్టాల‌న్నారు. భూ సేకరణ జరగని చోట తక్షణమే భూమి గుర్తించి సేకరించాలని మంత్రి ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాలతో టిడ్కో ఇళ్లను కూడా లబ్దిదారులకు అందజేస్తున్నామని నిర్దేశించిన గడువులోగా తప్పనిసరిగా ఇల్లు కేటాయింపు, రిజస్ట్రేషన్ ప్రక్రియ కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ స‌మావేశంలో రాష్ట్ర పుర‌పాల‌క‌శాఖ క‌మిష‌న‌ర్ శ్రీ ప్రవీణ్‌కుమార్‌, స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ పి.సంప‌త్‌కుమార్‌, ఏపీయూఎఫ్ఐడీసీ శ్రీ జి.ల‌క్ష్మీషా, విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిక‌ల్ దిన‌క్  పుండ్క‌ర్‌,  ప్ర‌జారోగ్య‌శాఖ ఇంజినీరింగ్ ఇన్ ఛీఫ్ పి.ఆనంద‌రావు, రాష్ట్రంలోని అన్ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్లు, ఉన్న‌తాధికారులు, అధికారులు హాజ‌ర‌య్యారు.



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image