రామోజీ ఆ వార్త నిజమని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా..లేకపోతే ఈనాడు చైర్మన్‌కు రాజీనామా చేస్తావా.?

 *రామోజీ ఆ వార్త నిజమని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా..లేకపోతే ఈనాడు చైర్మన్‌కు రాజీనామా చేస్తావా.?*



*: - మంత్రి జోగి రమేష్ సవాల్*


వైసీపీ కేంద్ర కార్యాలయం, 

తాడేపల్లి,

2 అక్టోబర్  (ప్రజా అమరావతి);


ఇళ్ల నిర్మాణాలపై ఈనాడులో తప్పుడు వార్తలు రాశారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రామోజీరావుకి దమ్ముంటే ఆ వార్త నిజమని నిరూపించాలని డిమాండ్‌ చేశారు. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. నిరూపించకపోతే నీ ఈనాడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తావా..? అని సవాల్‌ విసిరారు.


ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాజ్యాంగం టీడీపీ వారికి వర్తించదా?. ఎలాగైనా వ్యవహరించవచ్చని రాసుందా?. చింతకాయల విజయ్ అరాచకవాది. ఐటీడీపీ అనే దాన్ని అతను పర్యవేక్షిస్తున్నాడు. మహిళల మాన, ప్రాణాల గురించి వెబ్ సైట్‌లో దారుణంగా పోస్టులు పెట్టాడు. అతని దగ్గరకు సీఐడీ పోలీసులు వెళ్తే దాడి చేసినట్టు తప్పుడు కథనాలు రాశారు. దొంగ ఇంటికి పోలీసులు వెళ్తారని తెలీదా?. విజయ్ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడు?' అని ప్రశ్నించారు. 


'రామోజీరావు, రాధాకృష్ణలకు కూడా ఫ్యామిలీ ఉంది. మేము వారందరినీ గౌరవిస్తున్నాం. మా నాయకుడు జగన్ అలా నేర్పాడు. కానీ ఇతరుల కుటుంబాలపై తప్పుడు పోస్టులు పెడితే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు?. మీవారు చేసిన పనే ఇంకెవరైనా చేస్తే మీకు ఎలా ఉంటుంది?. ఒక దొంగని ఎల్లోమీడియా సపోర్టు చేస్తోంది. విజయ్ తప్పు చేయకపోతే ధైర్యంగా వచ్చి ఆ మాట సీఐడీ పోలీసులకు చెప్పాలి. ప్రభుత్వ స్థలాన్ని తండ్రి ఆక్రమించాడు. ప్రొక్లెయిన్ తీసుకుని వెళ్తే తండ్రి పారిపోయాడు. కొడుకు తప్పుడు పని చేసి గోడదూకి పారిపోయాడు.


అయ్యన్నపాత్రుడు నోరు తెరిస్తే పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడులకి కొడుకుల మీద నమ్మకం పోయినట్లుంది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక బూతులు మాట్లాడుతున్నారు. మహిళలకు జగన్ 50% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తుంటే మీరేమో దుర్మార్గాలు చేస్తున్నారు. రాక్షసుల్లాగ వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు అరెస్టు చేయకూడదా?. వారిని సమర్థిస్తే రేపు మీ కుటుంబ సభ్యుల మీద కూడా పోస్టులు పెడతారు. మా లీడర్ మాకు సంస్కారం, బాధ్యతలు నేర్పాడు. మీరేమో అరాచకవాదులను తయారు చేస్తున్నారు. మీరు సమర్థిస్తే రేపు మీ మీడియాలో అరాచశక్తులకు అండగా ఉంటామని రాయండి' అని మంత్రి జోగి రమేష్‌ సూచించారు.

Comments