శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి)


      ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ  మీడియా మిత్రులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశమునకు దసరా మహోత్సవములు 2022 ఆదాయ, వ్యయ వివరములు తెలిపి, దసరా మహోత్సవములు విజయవంతంగా పూర్తి అవడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మహాలక్ష్మి యాగం, దీపావళి, గ్రహణం మరియు కార్తీక మాసం సందర్భంగా కార్యక్రమ వివరములు తెలియజేశారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివ ప్రసాద్ శర్మ  మహాలక్ష్మి యాగం, దీపావళి, గ్రహణం మరియు కార్తీక మాసం సందర్భంగా కార్యక్రమముల గురించి వివరించారు. 

ఈ కార్యక్రమము నందు ఆలయ వైదిక కమిటీ సభ్యులు శ్రీ ఆర్ శ్రీనివాస శాస్త్రి , కార్యనిర్వాహక ఇంజనీర్లు కె వి ఎస్ కోటేశ్వర రావు , శ్రీమతి లింగం రమాదేవి , సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీమతి పి.సుధారాణి  పాల్గొన్నారు.

Comments