అమరావతి (ప్రజా అమరావతి);
*జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భేటీ*
*అనంతరం ఇరువురు నేతల ఉమ్మడి మీడియా సమావేశం:-*
*నారా చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత:-*
• హైదరాబాద్ నుంచి వస్తూ పవన్ కళ్యాన్ వద్దకు వచ్చాను.
• విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానం సరిగా లేదు.
• అందువల్లే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేందుకు వచ్చాను.
• హోటల్ లో ఉన్నారని తెలిసి నేరుగా నేను విమానాశ్రయం నుంచి వచ్చాను.
• ప్రజాస్వామ్యం దేశంలో విశాఖలో జరిగిన ఘటనలు చూస్తే బాధేస్తుంది.
• ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖలో కార్యక్రమం పెట్టుకున్నారు.
• ఒక రాజకీయ పార్టీ నేత వచ్చినప్పుడు పోలీసులు సాధారణంగా ఏర్పాట్లు చేస్తారు.
• విశాఖలో పవన్ పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.
• జనసేన వారిపై దాడులు చేసి తిరిగి వారిపైనే కేసులు పెట్టారు.
• హోటల్ కు వెళ్లే వరకు పవన్ ను ఇబ్బంది పెట్టారు. పోలీసులు పవన్ ను బయటకు రావద్దు అని చెప్పడం ఏంటి.?
• ఇదే ప్రజాస్వామ్యమా....పవన్ వెళుతుంటే వీధి లైట్లు కూడా ఆపేశారు.
• పోలీసులు పవన్ వద్దకు వెళ్లి టూర్ లో అభ్యంతరాలు చెప్పారు.
• పవన్ హోటల్ లో ఉంటే అక్కడికి వెళ్లి కూడా దారుణంగా వ్యవహరించారు. గదులు సోదా చేశారు.
• పవన్ కు నోటీసు ఇచ్చి విశాఖనుంచి పంపించారు...పవన్ వల్ల ఏం సమస్య వచ్చింది...ఎక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది?
• ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఇది. మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో ఇదే పద్దతి.
• ప్రజా స్వామ్యం లేకపోతే రాజకీయ పార్టీలకు మనుగడ లేదు. రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజల సమస్యలపై ఎవరు మాట్లాడుతారు?
• రాజకీయ పార్టీల నేతలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎక్కడ ఉంటుంది?
• దాడులు, అక్రమ కేసులు, నిందలు అనేవి రాష్ట్రంలో సాధారణం అయ్యాయి.
• నేతలను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు....మనం తిరిగి అడిగితే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు.
• రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఆలోచించాలి
• మీడియాకు స్వేచ్ఛ లేదు....ప్రజలకు స్వేచ్ఛ లేదు.
• ప్రభుత్వ హింసకు ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
• విశాఖ ఘటనపై నా మనుసు బాధపడి పవన్ కు సంఘీభావం తెలపాలి అని వచ్చాను.
• వైసిపి అంత నీచమైన పార్టీని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు.
• టీడీపీ కార్యాలయంపై మీద దాడి చేసిన ఘటనలో కనీసం కేసు నమోదులేదు.
• అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నా....ముందు రాజకీయ పార్టీల మనుగడను మనం కాపాడాలి. అప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చు...ప్రజల సమస్యలపై పోరాడవచ్చు.
• ప్రభుత్వం చేస్తున్న తప్పును రాజకీయ పార్టీలు తప్పని చెప్పకూడదా.?
• సిఎం జగన్ ప్రతిపక్ష నేతలను తిట్టించి పైశాచిక ఆనందం పడుతున్నాడు...ఇది శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోవాలి.
• ప్రభుత్వ విధానాలు, ప్రజా స్వామ్య పరిరక్షణపై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతాం.
• ప్రతిపక్ష నేతలు బయటకు వెళితే ఆంక్షలు విధిస్తున్నారు. పార్టీలు,సిద్దాంతాలు వేరుగా ఉన్నా ..ప్రజాస్వామ్యం కోసం అంతా పోరాడాలి
• అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు ఆలోచించాలి...ప్రజా స్వామ్యాన్ని కాపాడుకోవాలి.
• అందరూ ప్రజా స్వామ్య పరిరక్షణకు పని చెయ్యాలి
• రాష్ట్రంలో అందరినీ బెదిరిస్తున్నారు. విజయవాడలో అంకబాబు అనే సీనియర్ జర్నలిస్ట్ ఓ పోస్టు ఫార్వార్డ్ చేశారని అరెస్టు చేస్తారా?
• ఇక్కడ ఎన్నికలు, పోత్తులు అనేది చర్చ కాదు....ప్రజాస్వామ్యం ముఖ్యం
• ఒక ఎమ్మెల్యేను ప్రజా సమస్యపై నిలదీసే పరిస్థితి రాష్ట్రంలో ఉందా.? ప్రభుత్వ అరాచకాలు రాసే ధైర్యం మీడియాకు ఉందా.
• ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నం చెయ్యాలి
• ప్రజా సమస్యలపై నిలదీస్తాం...పోరాటం చేస్తాం...మెడలు వంచుతా.? ప్రతిపక్షాలు అడిగే వాటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
• కౌలు రైతులకు అన్యాయం జరిగితే సాయం చేసే ప్రయత్నం పవన్ చెయ్యడమే తప్పా.?
• ప్రభుత్వం చెయ్యదు....ఇతరులు చేస్తే అడ్డుకుంటున్నారు
• పవన్ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు...నన్ను కూడా గతంలో వైజాగ్, తిరుపతిలో అడ్డుకున్నారు.
• ఈ రోజు పవన్ కు జరిగింది అని ఇంట్లో పడుకుంటే...రేపు మాట్లాడే వారు ఉండరు
• ఒక రాజకీయ పార్టీకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నా అసెంబ్లీలో సమాధానం చెప్పే వారు. ఒకప్పుడు అంత గౌరవం ప్రతిపక్షాలకు ఉండేది.
• ఇప్పుడు ప్రతిపక్షం లేదు....ఇంకో పార్టీ అని లేదు....ఎవరినీ లెక్కపెట్టడం లేదు. దాడులు చేస్తున్నారు.
• ప్రభుత్వ తప్పులను ఎండగడితే విమర్శించి పబ్బం గడుపుతున్నారు.
• పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా ఉన్నారు..కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఈ తిట్లు పడాల్సి వస్తుంది.
• ప్రజాస్వామ్యాన్ని ముందు కాపాడుదాం...ఏ గ్రామానికి అయినా వెళ్లి మీటింగ్ పెట్టే పరిస్థితి తీసుకువస్తాం.
• రఘురామకృష్ణరాజుపై ఇలాగే అటాక్ చేస్తే నేనే లేఖ రాశాను..నేనే ముందు స్పందించాను.
• లేకపోతే ఆరోజే రఘురామను చంపేసేవారు.
• ప్రభుత్వంపై రాజకీయ పోరాటం ఉమ్మడిగా జరగాలి. న్యాయ పరంగానూ పోరాటం జరగాలి.
addComments
Post a Comment