*సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
*: నల్లమాడ మండలంలోని కురుమాలలో, ఓడి చెరువులో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్*
నల్లమాడ, ఓడి చెరువు (శ్రీ సత్యసాయి జిల్లా), అక్టోబర్ 12 ( ప్రజా అమరావతి) :
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం నల్లమాడ మండలంలోని కురుమాల పంచాయతీ పరిధిలో, ఓడి చెరువు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ముందుగా జిల్లా కలెక్టర్ నల్లమాడ మండలంలోని కురుమాల పంచాయతీ పరిధిలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలను పరిశీలించారు. ఆయా భవన నిర్మాణాలు నిదానంగా జరుగుతున్నాయన్నారు. నిర్మాణాలను వెంటనే వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా ఆయా భవన నిర్మాణాలను పూర్తిచేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఆయా భవన నిర్మాణాలను నిత్యం పర్యవేక్షించాలని, ఇంకా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
తదనంతరం జిల్లా కలెక్టర్ ఓడి చెరువు మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 1, 2 సచివాలయాలను, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలను పరిశీలన చేశారు. ఆయా భవన నిర్మాణాలు నెమ్మదిగా సాగడానికి వీలు లేదన్నారు. సకాలంలో పూర్తి చేసేందుకు సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడాలని, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీధర్, ఎంపీడీవో పోలప్ప, ఏపీవో రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
addComments
Post a Comment