మధ్యాహ్న భోజన పధకంలో పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లపై చర్యలు



            ఏలూరు, అక్టోబర్, 22 (ప్రజా అమరావతి):  జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పధకంలో  పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ లపై చర్యలు


తీసుకుంటానని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.  స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి శనివారం సాయన్తరం మనబడి - నాడు-నేడు, మధ్యాహ్న భోజన పధకం అంశాలపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పధకంలో   మరింత పౌష్టికాహారాన్ని అందించేందుకు మెనూలో మార్పులు చేసిందన్నారు.  ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా పాటిస్తూ, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలన్నారు.   మండల విద్యాశాఖాధికారులు ప్రతీ రోజు రెండు పాఠశాలలు, ఒక అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ  చేసి మధ్యాహ్న భోజన పధకం, విద్య బోధనా స్థాయిలను పరిశీలించాలన్నారు.  రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో సంబంధిత అధికారులు కూడా పాఠశాలలను సందర్శించి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, పౌష్టిక.

Comments