రబీలో మడ్డువలస ద్వారా 10వేల ఆయకట్టుకు సాగునీరు మొక్కజొన్న సాగుకు నీటి సరఫరా



రబీలో మడ్డువలస ద్వారా 10వేల ఆయకట్టుకు సాగునీరు

మొక్కజొన్న సాగుకు నీటి సరఫరా 


విజయనగరం, నవంబర్ 08 (ప్రజా అమరావతి):

వచ్చే రబీ సీజన్లో జి.ఎస్.ఎన్.ఎస్.  మడ్డువలస ప్రాజెక్టు ద్వారా పదివేల ఎకరాల్లో పంటలు వేసేందుకు సాగునీటిని సరఫరా చేయనున్నట్టు ప్రాజెక్ట్ కార్యనిర్వాహణ ఇంజనీర్ హెచ్. మన్మధ రావు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నాలుగు మండలాల పరిధిలో రబీలో మొక్కజొన్న సాగుకు నీటిని అందిస్తామని పేర్కొన్నారు. విజయనగరం పరిధిలో వంగరలో 996, రేగిడి ఆమదాలవలసలో 4074, సంతకవిటిలో 3016 ఎకరాలకు, శ్రీకాకుళం జిల్లాలో జి.సిగడాం మండల పరిధిలోని 1,914 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే చర్యలు చేపడుతున్నట్టు ఇ.ఇ. వెల్లడించారు. దీనికోసం 1.16 టి.ఎం.సి.ల నీరు ఆయకట్టు కు అందిస్తామని పేర్కొన్నారు. 



Comments