నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాలను నిర్వహిస్తున్నాం

 


విజయవాడ (ప్రజా అమరావతి);



*నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాలను నిర్వహిస్తున్నాం


*. 

*ఉర్దూ భాష పరిక్ష రక్షణకు విశిష్ట సేవలందించిన వారికి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానం*.. 

*గుంటూరులో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహణ.. ముఖ్యఅతిథిగా పాల్గొనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి*.. 

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ వెల్లడి*.. 


స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ నెల 11న నిర్వహించే రాష్ట్ర స్థాయి మైనారిటీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉర్దూ భాష పరిరక్షణకు సేవలందించిన ప్రతిభావంతులకు అవార్డులను అందజేస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్ తెలిపారు. ప్రతి ఏటా నవంబర్ 11వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ విద్యాదినోత్సవాన్ని మరియు రాష్ట్రవ్యాప్తంగా విద్యాదినోత్సవంతో పాటు మైనారిటీల సంక్షేమ దినోత్సవంగా కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. విజయవాడ భవానీపురంలోని ఏపీ ఉర్దూ అకాడమీ కార్యాలయంలో బుధవారం మీడియా ప్రతినిధులతో చైర్మన్ మాట్లాడారు.   

ఈ సందర్భంగా చైర్మన్ నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ... మైనారిటీ ముస్లిం వర్గాలకు విద్య, వైద్యం అందించడంలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి ఎంతో చొరవ తీసుకోవడం జరిగిందన్నారు. ఉర్దూ భాషకు ఎంతో ప్రాముఖ్యత, ప్రాధాన్యతలను కల్పించి అధికార భాషగా గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు.  నేడు మైనారిటీలలో మహా వృక్షాలుగా ఎదిగిన విద్యావేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు స్థాయిలో స్థిరపడడానికి కారణం వై.ఎస్. కుటుంబమేనని కొనియాడారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మైనారిటీలకు 4 శాతం  రిజర్వేషన్లు కల్పించడం నేడు ఈ ప్రగతికి తార్కాణమని ఆయన తెలిపారు. మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని, జాతీయ విద్యాదినోత్సవాన్ని గతంలో విజయవాడ, గుంటూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లాల్లో నిర్వహించామని, ఈ ఏడాది గుంటూరులో నిర్వహించనున్నామన్నారు.  ఈ సందర్భంగా ఉర్దూ రంగంలో ప్రముఖులను సన్మానించడంతో పాటు వారి సేవలకు గుర్తింపుగా అవార్డులను అందిస్తామన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ అవార్డు క్రింద లక్షా 25 వేల రూపాయల నగదు బహుమానంతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. డాక్టర్ అబ్దుల్ హక్ రాష్ట్ర అవార్డు క్రింద లక్ష రూపాయల నగదు బహుమానంతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రం అందజేస్తామన్నారు. ఉర్దూభాష పరిరక్షణ, ప్రచారం కోసం పనిచేసిన ఏడుగురికి లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద ఒక్కొక్కరికి 25 వేల రూపాయల నగదు బహుమానం, మెమెంటో, ప్రశంసాపత్రం అందించనున్నారని తెలిపారు. ‘ఉత్తమ ఉర్దూ ఉపాధ్యాయుల అవార్డు’ల క్రింద ప్రతి జిల్లా నుండి ముగ్గురు చొప్పున మొత్తం 78 మందిని ఉర్దూ మీడియం పాఠశాలల్లో బోధనలో గణనీయమైన కృషి చేసిన ఎంపిక చేశామన్నారు. ఈ అవార్డు క్రింద 10 వేల రూపాయల నగదు బహుమానం, మొమెంటో, ప్రసంసాపత్రం అందజేస్తామన్నారు. బెస్ట్ ఉర్దూ స్టూడెంట్స్ అవార్డు క్రింద 78 మంది విద్యార్థులను ఎంపికచేశామని, వీరికి 5 వేల రూపాయల నగదు బహుమానం, మొమెంటో, ప్రసంసాపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమంతో పాటు రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాల్లో  మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు వివిధ పథకాల క్రింద అవార్డులను అందజేయనున్నామని చైర్మన్ నదీమ్ అహ్మద్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు షేక్ అబీదా బేగమ్, షేక్ అబ్ధుల్ షుకూర్, షేక్ ఎం. బాజీ వలీ, సయ్యద్ నూరుల్లా ఖాద్రీ, సెక్రటరీ డా. ఎన్. అయుబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.  

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image