నవంబర్-11నుండి నుండి జరిగే రాష్ట్ర రెవిన్యూ క్రీడలను జయప్రదం చేయండి...బొప్పరాజు & చేబ్రోలు కృష్ణమూర్తి.

 ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, అమరావతి (ప్రజా అమరావతి);.




నవంబర్-11నుండి నుండి జరిగే రాష్ట్ర రెవిన్యూ క్రీడలను జయప్రదం చేయండి...బొప్పరాజు & చేబ్రోలు కృష్ణమూర్తి.


                

రెవెన్యూ శాఖలోని గ్రామ రెవిన్యూ సహాయకుని స్థాయి నుండి డిప్యూటీ కలెక్టరు స్థాయి వరకు నవంబర్-11 వ తేది నుండి 13 వ తేది వరకు (మూడు రోజులు) ఆచార్య నాగార్జున యునివర్సిటీ, గుంటూరు నందు ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆద్వర్యములో 6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు - 2022 లను నిర్వహించుచున్నారు.


క్రీడా పోటీలు 11వ తేదీ మొదలై 13వ తేదీన పూర్తి అవుతాయి. ప్రతి రోజు సాయింత్రం 6 గంటలకు అనగా 10వ తేదీ సాయింత్రం, 11వ తేదీ సాయింత్రం మరియు 12వ తేదీ సాయింత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహించబడతాయి.  ఇప్పటికే ప్రభుత్వం క్రీడల్లో పాల్గొనే VRA to Dy Collector స్థాయి ఉద్యోగులందరికీ నవంబర్ 10, 11 మరియు 14వ తేదీలలో మూడు రోజులు ప్రత్యేక సెలవు దినాలు గానూ, అలాగే 12, 13 (రెండవ శనివారం & ఆదివారం) సెలవు దినాల్లో పర్మిషన్ మంజూరు చేస్తూ ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక GO విడుదల చేసింది.


13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికిన మరియు సిటీ సెంటర్ (CCLA) నుండి 1200 మంది క్రీడాకారులు 10 వ తేది ఉదయం 10. గII లకే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి చేరుకుంటారు, 11.11.2022 నుంచి క్రీడా మరియు సాంస్కృతిక సంబరాలలో పాల్గొంటారు.


6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు – 2022 ప్ర్రారంభ ఉత్సవములు   తేదీ 11.11.2022 (శుక్రవారం) న ఉదయం 9 గంటలకు గౌ II ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాII సమీర్ శర్మ I.A.S గారు, గౌ II ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ & రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ జి.సాయి ప్రసాద్ I.A.S గార్లు ప్రారంభిస్తారు. సదరు ప్రారంభ కార్యక్రమములో *ప్రత్యేక అతిథిగా అంతర్జాతీయ బాడ్మెంట్టెన్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్ మరియుగౌరవ డిప్యూటీ కలెక్టరు అయిన కుమారి PV సింధు గారు* , గౌII ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.ఎస్.రావత్ I.A.S గారు, గౌ II ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడలు మరియు యూత్ సర్వీసెస్ ప్రిన్సిపాల్ సెక్రటరీ డాII జి.వాణి మోహన్ I.A.S గారు, గౌ II ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాల శాఖ కార్యదర్శి శ్రీ పోలా భాస్కర్ I.A.S గారు , గుంటూరు జిల్లా కలెక్టరు శ్రీ ఏం.వేణుగోపాల్ రెడ్డి I.A.S గారు, బాపట్ల జిల్లా కలెక్టరు శ్రీమతి విజయ కృష్ణన్ I.A.S  గారు, పల్నాడు జిల్లా కలెక్టరు శ్రీ ఎల్.శివ శంకర్ I.A.S గారు, ఇంకా అనేకమంది గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లా ఉన్నతాధకారులు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు.


6 వ రాష్ట్ర స్థాయి రెవిన్యూ క్రీడలు మరియు సాంస్కృతిక ఉత్సవములు – 2022 ముగింపు ఉత్సవములు తేదీ 13.11.2022 న (ఆదివారం) సాయింత్రం 4 గంటల  కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా గౌ II రెవిన్యూ, రిజిస్ట్రెషన్ మరియు స్టాంపుల శాఖామాత్యులు శ్రీ ధర్మాన ప్రసాద రావు గారు, గౌ II ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి గార్లు హాజరవుతారని, వారిచే క్రీడలు మరియు సాంస్కృతిక పోటీలలో విజేతలకు బహుమతి ప్రధానోత్సవము  జరుగుతుంది. ఈ ముగింపు పండుగలో *ప్రత్యేక ఆతిదిగా  అంతర్జాతియ్య బాట్మెంట్టెన్ క్రీడాకారులు మరియు గౌIIడెప్యూటీ కలెక్టర్ శ్రీ కిదాంబి శ్రీకాంత్ గారు,* గౌ II విద్యా శాఖామాత్యులు శ్రీ బొత్చ సత్యనారాయణ గారు, గౌ II పర్యాటక, క్రీడలు శాఖామాత్యులు శ్రీమతి ఆర్.కె.రోజా గారు, గౌ II పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖామాత్యులు శ్రీ ఆదిమూలపు సురేష్ గారు మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా నుండి ప్రాతినిధ్యంవహిస్తున్న గౌ II నీటిపారుదల శాఖామాత్యులు శ్రీ అంబటి రాంబాబు గారు, గౌ II సాంఘిక సంక్షేమ  శాఖామాత్యులు శ్రీ మేరుగ నాగార్జున గారు , గౌ II కుటుంబ సంక్షేమము మరియు వైద్య విద్యా శాఖామాత్యులు శ్రీమతి విడదల రజనీ గారు, ఇంకా అనేక మంది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గౌ|| ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు, అనేక మంది పెద్దలు అతిధులుగా హాజరవుతారు.


ఆలాగే 13 వ తేది ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు జరిగే క్రీడల ముగింపు సభకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పచ్చిమ గోదావరి జిల్లాల లో నుండి గ్రామ రెవిన్యూ సహాయకుని నుండి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు గల రెవిన్యూ ఉద్యోగులందరూ ముగింపు కార్యక్రమములో పాల్గొని 6 వ రాష్ట్ర రెవిన్యూ   క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవములు-2022

 జయప్రదం చేయాలని ప్రతి ఒక్క రెవిన్యూ ఉద్యోగిని కోరుకోనుచున్నాము.


6 వ రాష్ట్ర రెవిన్యూ   క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవములు-2022 నిర్వహణకు అనుమతించి పూర్తి సహాయ , సహకారములు అందించిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌII ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యెస్.జగన్మోహన్ రెడ్డి గార్కి, 

ప్రధాన ఆర్ధిక చేయుతనిచ్చిన

గౌII రాజ్యసభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గార్కి, అదేవిధంగా  ఆర్ధిక సహాయ సహకారాలు అందించిన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్కి, తులసీ సీడ్స్ అధినేత శ్రీ తులసీ రామచంద్ర ప్రభు గార్కి,  ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ క్రీడల నిర్వహణకు ఆర్థికంగా మరియు వస్తురూపెన సహాయ సహకారాలు అందించిన వివిధ సంస్థలు మరియు వ్యక్తులకు APRSA పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము.


ఈ సమావేశంలో వివిధ కమిటీల చైర్మన్/సభ్యులు, ఏ.పి.డెప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీM.విశ్వేశ్వరనాయుడు, గారు, APRSA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చేబ్రోలు కృష్ణమూర్తి గారు, రాష్ట్ర కోశాధికారి శ్రీ V V గిరి కుమారు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ R V రాజేష్ గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి M మధురి గారు, A పెంచల రెడ్డి గారు, AP VROs Association రాష్ట్ర అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులు శ్రీ కోనా ఆంజనేయ కుమార్ (చంటి)/ శ్రీ సాంబశివ రావు, AP డైరెక్ట్ రిక్రూట్మెంట్ VROs Association రాష్ట్ర అధ్యక్ష/ప్రధాన కార్యదర్శులు శ్రీ పేరిపోగు ప్రసన్న, AP  Grade-II VROs Association రాష్ట్ర అధ్యక్ష/కార్యదర్శులు శ్రీ సుధాకర్ చౌదరి/శ్రీమతి అనుపమ గారు, AP VRA Associationకోశాధికారి శ్రీ సత్యనారాయణ గారు పాల్గొన్నారు.


 

Comments