నెల్లూరు నవంబర్ 7 (ప్రజా అమరావతి);
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ జి. కిషన్ రెడ్డి నెల్లూరు నగరంలోని జయభారత్ హాస్పిటల్ లో శ్రీ భగవాన్ మహావీర్ జైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన అత్యవసర విభాగాన్ని ప్రారంభించారు.
అంతకుమునుపు కేంద్ర మంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, భరతమాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన గావించారు.
నెల్లూరు నగరంలోని మూలాపేటకు చెందిన శ్రీ గీత వైభవం ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ నజీర్ భాష ఆధ్వర్యంలో బాల బాలికలు భగవద్గీత శ్లోకాలను ఆలపించారు. ఈ సందర్భంగా వారు భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జయభారత్ ఆసుపత్రి చైర్మన్ శ్రీ సీతారామిరెడ్డి, శ్రీ భగవాన్ మహావీర్ జైన్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ మోహన్లాల్ జైన్, డి సి హెచ్ ఎస్ డాక్టర్ రమేష్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment