ఆజాద్‌ గారు అపర మేధావి, రాబోయే వందేళ్ళలో విద్యా అవసరాలను గుర్తించి 1951లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ లో ఏర్పాటు


గుంటూరు (ప్రజా అమరావతి);


*గుంటూరు నగరంలోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటుచేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం ఏమన్నారంటే...ఆయన మాటల్లోనే*


*ఎస్‌.బి.అంజాద్‌ బాషా, డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, ఈ రోజు భారతరత్న మౌలనా అబుల్‌కలామ్‌ ఆజాద్‌ గారి 135 వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆయన గురించి మాట్లాడుకోవాలి, ఆజాద్‌ గారు అపర మేధావి, రాబోయే వందేళ్ళలో విద్యా అవసరాలను గుర్తించి 1951లో ఐఐటీ ఖరగ్‌పూర్‌ లో ఏర్పాటు


చేయడమే కాక, యూజీసీని ఏర్పాటు చేశారు. అనేక సంస్ధలు కూడా ఏర్పాటుచేశారు, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ఏపీలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారు సీఎంగారు, ఈ ప్రభుత్వంలో నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 2019 నుంచి మైనార్టీలకు సువర్ణ అధ్యాయం, గత టీడీపీ పాలనలో మైనార్టీ సంక్షేమం కోసం కేవలం ఖర్చుచేసింది రూ. 2,665 కోట్లు మాత్రమే, కానీ ఈ ప్రభుత్వం మూడున్నరేళ్ళలో మైనార్టీ సంక్షేమం కోసం ఖర్చు చేసింది రూ. 20,330.43 కోట్లు, దీని ద్వారా 60,54,839 మైనార్టీలకు వివిధ పథకాల ద్వారా లబ్ది జరిగింది. రాష్ట్రంలో ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఇచ్చే గౌరవ భృతిని గత ప్రభుత్వం పక్కనపెడితే మా ప్రభుత్వం ఆ బకాయిలు చెల్లించడమేకాక పెంచిన గౌరవ భృతిని చెల్లిస్తుంది. మైనార్టీ వర్గాల రాజకీయ సాధికారత కల్పించిన ప్రభుత్వం ఇది. తన మంత్రివర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటే అందులో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, అందులో ఒక ముస్లిం మహిళ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఇచ్చారు, మైనార్టీ వర్గాలకు విశేష ప్రాధాన్యతనిచ్చారు. రాష్ట్ర చరిత్రలో మైనార్టీలకు సాధికారత కల్పించిన ప్రభుత్వం ఇది. ఉర్దు భాషను రెండో అధికార బాషగా చట్టబద్దత కల్పించిన ప్రభుత్వం ఇది. అంతేకాదు దాని అమలుకు చర్యలు చేపట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీలకు సంబంధించిన సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించింది, దేశంలో మరే రాష్ట్రంలో ఈ చట్టం లేదు. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం క్రింద ప్రభుత్వం సమగ్ర విధివిధానాలతో అమలుచేస్తుంది, వైఎస్సార్‌ షాదీ తోఫా కూడా అమలుచేస్తున్నాం, కుల, మత, వర్గ బేధాలు లేకుండా సమసమాజ స్ధాపనకు కృషిచేస్తున్న మన సీఎంగారు నాలుగు దశాబ్ధాల పాటు సీఎంగా రాష్ట్రాన్ని పాలించే శక్తిని ప్రసాదించాలని అల్లాని ప్రార్ధిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

Comments