క్షేత్రస్థాయిలలో  పోలింగ్ స్టేషన్లను సందర్శించడం జరుగుతుంది


జిల్లా ఈ రోల్ అబ్జర్వర్ డి మురళీధర్ రెడ్డి


నూతన ఓటర్ల నమోదు కార్యక్రమం పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం

జిల్లా కలెక్టర్  పి బసంత్ కుమార్



పుట్టపర్తి, నవంబర్ 25 (ప్రజా అమరావతి):  త్వర6లో క్షేత్రస్థాయిలో  వివిధ పోలింగ్ స్టేషన్లో  తనిఖీ చేయడం జరుగుతుందని జిల్లా ఈ రోల్ అబ్జర్వర్ డి మురళీధర్ రెడ్డి  తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని  మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు  జిల్లా  ఓటర్ల జాబితా సవరణ-2023  అంశంపై  వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో మరియు ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ కార్తీక్, ఇన్చార్జి డిఆర్ఓ మరియు పుట్టపర్తి ఆర్డిఓ శ్రీమతి భాగ్య రేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగాజిల్లా ఈ రోల్ అబ్జర్వర్ డి మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాకు రోల్డ్ అబ్జర్వర్గా ఎన్నికల కమిషన్  నియమించిందని తెలిపారు. జిల్లాలో మూడుసార్లు నా పర్యటన ఉంటుందని తెలిపారు ఈరోజు  వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో  ఓటర్ల జాబితా సవరణపై  సమీక్ష సమావేశం నిర్వహించి వారి సూచనలు సలహాలు తీసుకొని వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని పోయి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఏ మండలంలో అత్యధికంగా  ఓటర్ లిస్ట్ తొలగించారు.  ఏ మండలంలో అత్యధికంగా  ఓటర్లు  నమోదయినారు వాటిని పరిశీలించడానికి త్వరలో క్షేత్రస్థాయిలో నా పర్యటన ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటర్ ను  సవరణ కార్యక్రమంలో నమోదు చేయాలని  ఈ ఆర్ ఓ లను ఆదేశించారు.   ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి  ఓటర్ జాబితా తయారీ, సవరణ కోసం   ఈ ఆర్ ఓ ఉంటారని తెలిపారు.1959   ముసాయిదా  ఎన్నికల జాబితాలో కొత్తగా పేర్లు చేర్చడానికి , ఇప్పటికే చేర్చిన పేర్లలో అభ్యంతరాలు ఉంటే వాటిని క్లైమేలను  పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో   అన ర్హత కలిగిన కొత్త ఓటర్లు శాశ్వతంగా బదిలీ అయిన ఓటర్లు డూప్లికేట్ ఓటర్లను ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం తొలగించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి బి ఎల్ ఓ, సంబంధిత తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు  ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం  పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.   జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తప్పులు లేకుండా  ఓటర్ల జాబితా సవరణపై  సిద్ధం చేయుచున్నామని తెలిపారు. నూతన ఓటర్లు నమోదు ప్రక్రియకు వివిధ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి  వేగవంతం చేయుచున్నామని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 13,36,178  మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. పురుషులు  ఓటర్లు 6,70,560 ఉన్నారు. మహిళా ఓటర్లు 6,65,555 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో  బిజెపి ప్రతినిధి భాస్కర్ నాయక్, సిపిఐ ప్రతినిధి వేమయ్య, సి పి ఎం ఇంతియాజ్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి తిప్పన్న, జనసేన ప్రతినిధి శ్రీనివాసులు, టిడిపి ప్రతినిధి విజయ్ కుమార్, కదిరి ఆర్డిఓ రాఘవేంద్ర, ధర్మవరం ఆర్డీవో తిప్పే నాయక్,  మడకశిర చిన్నన్న, సంబంధిత తాసిల్దార్ లో తదితరులు పాల్గొన్నారు.

Comments