పత్రికా ప్రకటన *రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత* పార్వతీపురం, నవంబరు 26 : రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎం.వి.ఎస్ నాగిరెడ్డి అన్నారు. జిల్లా పర్యటనకు శని వారం విచ్చేసిన వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 20 జిల్లాల్లో పర్యటించామని, పార్వతీపురం మన్యం జిల్లా 21వ జిల్లా అన్నారు. వ్యవసాయ మిషన్ ఉన్నత స్థాయి సలహాలను ప్రభుత్వానికి అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక బాధ్యతతో ముఖ్య మంత్రి వ్యవసాయ మిషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో జరగని కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతుందని ఆయన వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతమని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వివిధ పథకాల క్రింద రైతులకు గత మూడు సంవత్సరాలలో రూ.25,975 కోట్లు చెల్లించడం జరిగిందని, వ్యవసాయ అనుబంధ శాఖల క్రింద రూ.85,096 కోట్లు చెల్లించడం జరిగిందని ఆయన వివరించారు. రైతులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అత్యంత సాన్నిహిత్యం ఉండాలని తద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. ధాన్యంలో నాణ్యత ఉంటే సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విధానం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉందని ఆయన తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల గత బకాయిల వలన బిందు సేద్యం పరికరాలను అందించడంలో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ఏడాదికి దాదాపు 70 వేల హెక్టార్లు ఉద్యాన పంటలకు మారుతోందని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఆయిల్ పామ్, మామిడి, జీడి తదితర పంటలు ముందు వరుసలో ఉన్నాయని ఆయన వివరించారు. అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి పంటలను వేయాలని సూచించారు. చిరు ధాన్యాలను గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారని చెప్పారు. మార్కెట్ కల్పనకు ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. విలువ ఆధారితకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పసుపు, టమాట, అరటికి కూడా మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. పామాయిల్, వెదురుకి మంచి మార్కెట్ ఉందని నాగిరెడ్డి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో 50 గిడ్డంగుల మంజూరుకు ప్రతిపాదన ఉందని ఆయన తెలిపారు. రైతులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు పాడిపంట కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఇంటికి ఒక దేశీయ ఆవు ఉండాలని ఆయన అన్నారు. వ్యవసాయం సమస్యలలో లేదని ఆయన చెప్పారు. పిల్లల్లో భూమిపై ఆపేక్షను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 90 శాతం మందికి నవరత్నాలు అందుతున్నాయని నాగిరెడ్డి చెప్పారు. సమసమాజం స్థాపన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా ఇళ్ళు మంజూరు జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇ క్రాప్ విధానం, గ్రామ - వార్డు సచివాలయ వ్యవస్థను దేశంలో అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జిల్లాలో సమస్యలు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. అరకు పార్లమెంటు సభ్యులు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ స్థానిక రైతులకు ఆయిల్ పామ్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయమన్నారు. వలసలు ఎక్కువగా వెళ్లే జిల్లాల్లో ఒకటని, ఇకెవైసి విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చెరకు సాగుకు ప్రభుత్వం కొంత ప్రోత్సాహకం అందించాలని కోరారు. తద్వారా వరి పంట నుండి ఇతర పంటలకు మారగలరని చెప్పారు. పాలకొండ శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ పాలకొండ ప్రాంతంలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మైదాన ప్రాంత గిరిజనులకు కూడా 90 శాతం రాయితీతో విత్తనాలు అందించాలని సూచించారు. భామినిలో పత్తికి గిడ్డంగి సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పార్వతీపురం శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ధాన్యం విక్రయంలో రైతులు ఏ మాత్రం అధైర్యపడవద్దని సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాకు కావలసిన వనరులు సమకూర్చాలని అన్నారు. జిల్లాలో శత శాతం ఇ క్రాప్ చేయడం జరిగిందని తెలిపారు. దళారీలను రైతులు ఆశ్రయించ వద్దని కోరారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా వరి పండించే జిల్లాల్లో ముందు వరుసలో ఉందన్నారు. వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఈ ఏడాది 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా ఉందని అందులో 66 శాతం సేకరించుటకు లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు శుక్ర వారం ప్రారంభించామని, రాబోయే రెండు, మూడు నెలల్లో కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో ఏనుగుల వలన పంట నష్టం జరుగుతుందని, ముఖ్య మంత్రి దృష్టిలో పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. డా. డి.రామమోహరావు మాట్లాడుతూ వ్యవసాయాన్ని వదల కూడదని డా.ఎం.ఎస్.స్వామినాథన్ చెప్పారని తెలిపారు. వ్యవసాయ రంగం లేకపోతే నిరుద్యోగం పెరుగుతుందని చెప్పారు. వరి తగ్గించి, మెట్టు పంటలు పండించాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా ఆయిల్ పామ్ ఉత్తమమైన ప్రాంతమని అన్నారు. తోటపల్లి ప్రాంతం అనుకూలమని ఆయన చెప్పారు. వివిధ మండలాల నుండి పాల్గొన్న వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, సభ్యులు, రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు మిల్లర్ల ప్రమేయం లేకుండా చేపట్టాలని, మిల్లర్లు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని వివరించారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, రైతులకు చిన్న యంత్ర పరికరాలు అందించాలని, గిరిజనులకు అల్లం, పసుపు విత్తనాలు అందించాలని కోరారు. కొమరాడ మండలంలో జంఝావతి ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ కు నీటి సరఫరా చేయక పంటలు నష్టపోవడం జరుగుతుందని వివరించారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. నాలుగు నియోజక వర్గాలలో చెరకు రైతులకు ఆదుకోవలసిన అవసరం ఉందని సూచించారు. జిల్లా అధికారులు శాఖా పరంగా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ సమావేశంలో డిసిఎంఎస్ అధ్యక్షులు డా.అవనాపు భావన, వ్యవసాయ మిషన్ సభ్యులు రామారావు, గొండు రఘురాం, శాశ్వత కార్యనిర్వాహణ సభ్యులు డా. చంద్ర శేఖర రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, ఏపిఎంఐపి పిడి ఎల్. శ్రీనివాస రావు, జిల్లా సహకార అధికారి సన్యాసి నాయుడు, జిల్లా మత్స్య అధికారి వేమూరి తిరుపతయ్య, శాస్త్రవేత్తలు డా.సీతారాం, డా. శ్రీనివాస రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు.



*రా


ష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత*


పార్వతీపురం, నవంబరు 26 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎం.వి.ఎస్ నాగిరెడ్డి అన్నారు. జిల్లా పర్యటనకు శని వారం విచ్చేసిన వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 20 జిల్లాల్లో పర్యటించామని, పార్వతీపురం మన్యం జిల్లా 21వ జిల్లా అన్నారు. వ్యవసాయ మిషన్ ఉన్నత స్థాయి సలహాలను ప్రభుత్వానికి అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక బాధ్యతతో ముఖ్య మంత్రి వ్యవసాయ మిషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో జరగని కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతుందని ఆయన వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతమని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వివిధ పథకాల క్రింద రైతులకు గత మూడు సంవత్సరాలలో రూ.25,975 కోట్లు చెల్లించడం జరిగిందని, వ్యవసాయ అనుబంధ శాఖల క్రింద రూ.85,096 కోట్లు చెల్లించడం జరిగిందని ఆయన వివరించారు. రైతులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అత్యంత సాన్నిహిత్యం ఉండాలని తద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. ధాన్యంలో నాణ్యత ఉంటే సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విధానం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉందని ఆయన తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల గత బకాయిల వలన బిందు సేద్యం పరికరాలను అందించడంలో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ఏడాదికి దాదాపు 70 వేల హెక్టార్లు ఉద్యాన పంటలకు మారుతోందని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఆయిల్ పామ్, మామిడి, జీడి తదితర పంటలు ముందు వరుసలో ఉన్నాయని ఆయన వివరించారు. అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి పంటలను వేయాలని సూచించారు. చిరు ధాన్యాలను గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారని చెప్పారు. మార్కెట్ కల్పనకు ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. విలువ ఆధారితకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పసుపు, టమాట, అరటికి కూడా మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. పామాయిల్, వెదురుకి మంచి మార్కెట్ ఉందని నాగిరెడ్డి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో 50 గిడ్డంగుల మంజూరుకు ప్రతిపాదన ఉందని ఆయన తెలిపారు. రైతులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు పాడిపంట కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఇంటికి ఒక దేశీయ ఆవు ఉండాలని ఆయన అన్నారు. వ్యవసాయం సమస్యలలో లేదని ఆయన చెప్పారు. పిల్లల్లో భూమిపై ఆపేక్షను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 90 శాతం మందికి నవరత్నాలు అందుతున్నాయని నాగిరెడ్డి చెప్పారు. సమసమాజం స్థాపన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా ఇళ్ళు మంజూరు జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇ క్రాప్ విధానం, గ్రామ - వార్డు సచివాలయ వ్యవస్థను దేశంలో అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జిల్లాలో సమస్యలు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు. 


అరకు పార్లమెంటు సభ్యులు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ స్థానిక రైతులకు ఆయిల్ పామ్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. 


శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయమన్నారు. వలసలు ఎక్కువగా వెళ్లే జిల్లాల్లో ఒకటని, ఇకెవైసి విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చెరకు సాగుకు ప్రభుత్వం కొంత ప్రోత్సాహకం అందించాలని కోరారు. తద్వారా వరి పంట నుండి ఇతర పంటలకు మారగలరని చెప్పారు. 


పాలకొండ శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ పాలకొండ ప్రాంతంలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మైదాన ప్రాంత గిరిజనులకు కూడా 90 శాతం రాయితీతో విత్తనాలు అందించాలని సూచించారు. భామినిలో పత్తికి గిడ్డంగి సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 


పార్వతీపురం శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ధాన్యం విక్రయంలో రైతులు ఏ మాత్రం అధైర్యపడవద్దని సూచించారు. 


జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాకు కావలసిన వనరులు సమకూర్చాలని అన్నారు. జిల్లాలో శత శాతం ఇ క్రాప్ చేయడం జరిగిందని తెలిపారు. దళారీలను రైతులు ఆశ్రయించ వద్దని కోరారు. 


జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా వరి పండించే జిల్లాల్లో ముందు వరుసలో ఉందన్నారు. వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఈ ఏడాది 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా ఉందని అందులో 66 శాతం సేకరించుటకు లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు శుక్ర వారం ప్రారంభించామని, రాబోయే రెండు, మూడు నెలల్లో కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో ఏనుగుల వలన పంట నష్టం జరుగుతుందని, ముఖ్య మంత్రి దృష్టిలో పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. 


డా. డి.రామమోహరావు మాట్లాడుతూ వ్యవసాయాన్ని వదల కూడదని డా.ఎం.ఎస్.స్వామినాథన్ చెప్పారని తెలిపారు. వ్యవసాయ రంగం లేకపోతే నిరుద్యోగం పెరుగుతుందని చెప్పారు. వరి తగ్గించి, మెట్టు పంటలు పండించాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా ఆయిల్ పామ్ ఉత్తమమైన ప్రాంతమని అన్నారు. తోటపల్లి ప్రాంతం అనుకూలమని ఆయన చెప్పారు. 


వివిధ మండలాల నుండి పాల్గొన్న వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, సభ్యులు, రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు మిల్లర్ల ప్రమేయం లేకుండా చేపట్టాలని, మిల్లర్లు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని వివరించారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని సూచించారు.  ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, రైతులకు చిన్న యంత్ర పరికరాలు అందించాలని, గిరిజనులకు అల్లం, పసుపు విత్తనాలు అందించాలని కోరారు. కొమరాడ మండలంలో జంఝావతి ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ కు నీటి సరఫరా చేయక పంటలు నష్టపోవడం జరుగుతుందని వివరించారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. నాలుగు నియోజక వర్గాలలో చెరకు రైతులకు ఆదుకోవలసిన అవసరం ఉందని సూచించారు. 


జిల్లా అధికారులు శాఖా పరంగా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. 


ఈ సమావేశంలో డిసిఎంఎస్ అధ్యక్షులు డా.అవనాపు భావన, వ్యవసాయ మిషన్ సభ్యులు రామారావు, గొండు రఘురాం, శాశ్వత కార్యనిర్వాహణ సభ్యులు డా. చంద్ర శేఖర రెడ్డి,  జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, ఏపిఎంఐపి పిడి ఎల్. శ్రీనివాస రావు, జిల్లా సహకార అధికారి సన్యాసి నాయుడు, జిల్లా మత్స్య అధికారి వేమూరి తిరుపతయ్య, శాస్త్రవేత్తలు డా.సీతారాం, డా. శ్రీనివాస రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
టూల్స్ మరియు కిట్‌ల పంపిణీతో ఆంధ్రప్రదేశ్‌లోని చేతివృత్తుల వారికి అధికారం కల్పించిన KVIC చైర్మన్.
Image
Harshavardhan selected for Chennai Super Kings team
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ.
Image
India is on high-growth trajectory to achieve its development goals by 2047: Minister Hardeep S Puri.