ప్రతి 3 నెలలకోసారి ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం


విజయవాడ (ప్రజా అమరావతి);

ప్రతి 3 నెలలకోసారి ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తాం


.

వాణిజ్య వేత్తలతో చర్చల ద్వారా పారదర్శకత, సరళ విధానాలు అందుబాటులోకి తెస్తాం. 

సులభతర వాణిజ్యం, సరళమైన విధానాలే ప్రభుత్వ లక్ష్యం 

విజయవాడలో నిర్వహించిన వాణిజ్య సలహా మండలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 

సులభతర వాణిజ్యం, సరళమైన విధానాలే ప్రభుత్వ లక్ష్యం,  పన్నుల వసూళ్లలో వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ విధానమని ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య, పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజయవాడలోని వివంత హోటల్ లో శుక్రవారం నిర్వహించిన ట్రేడ్ అడ్వైజరీ కమిటీ (వాణిజ్య సలహా మండలి) సమావేశానికి మంత్రి రాజేంద్రనాధ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.   

ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. వాణిజ్యవేత్తల సూచనలు, సలహాలు తీసుకునేందుకు ప్రతి 3 నెలలకోసారి ట్రేడ్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. అనాదిగా, రాజుల కాలంలో కూడా అభివృద్ధి, పరిపాలనలో పన్నులు కీలక పాత్ర పోషించాయన్నారు. జై జవాన్, జై కిసాన్... జై బిజినెస్ మెన్ మా నినాదమన్నారు. మన భవిష్యత్ కోసం మనం కట్టేదే వాణిజ్య పన్నుఅని, వాణిజ్యవేత్తలకు భరోసా అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పువ్వుకు ఇబ్బందిలేని పద్ధతిలో మకరందం తీసుకుని తేనెగా తయారుచేసే తేనెటీగ మాదిరిగా.. పన్ను వసూళ్లలో వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా చేయాలన్నది ప్రభుత్వ విధానమని తెలిపారు. డీలర్ ఫ్రెండ్లీ ప్రభుత్వ విధానంలో భవిష్యత్తులో మంచి ఫలితాలు వస్తాయన్నారు. వాణిజ్యవేత్తలపై దాడులను తగ్గిస్తామని తెలిపారు. డేటా ఎనలిటిక్స్ సెల్ ద్వారా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తనిఖీలు నిర్వహిస్తామన్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత అన్ని నిర్ణయాలు కౌన్సిల్ ద్వారా తీసుకుంటున్నామని, వాణిజ్యవేత్తలు ఇచ్చిన సలహాలు, సూచనలు అన్నీ కౌన్సిల్ లో ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిల్ ద్వారా అత్యధికంగా జీఎస్టీ సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయని ఆయన తెలిపారు. శాఖలు, డీలర్ల, వాణిజ్యవేత్తల సమన్వయంతో సమావేశాలు నిర్వహించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడలలో ట్రేడ్ అడ్వైజరీ కమిటీ  సమావేశాల ద్వారా విధానపరమైన అంశాలు, ఇబ్బందులను వాణిజ్యవేత్తల నుంచి ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. సులభతర వాణిజ్యం, సరళమైన విధానాలే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బంగారు తయారీ, తరుగుపై ధరల విషయంలో ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ మల్లాది విష్ణు చెప్పిన అంశంపై దృష్టి పెడతామని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. వ్యాపారుల సౌకర్యార్థం జీఎస్టీ నిబంధనలను తెలుగులో అందుబాటులోకి తెస్తామన్నారు. చిన్న డీలర్లు, చిరు వ్యాపారుల దృష్టికి వెళ్లకుండా వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు ఆదేశాలిస్తామన్నారు. జీఎస్టీ పోర్టల్ వల్ల వ్యాపారులకు కలిగిన ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. పన్నుల ధరల సమయం, మార్పుల అధికారం జీఎస్టీ మండలిదేనని స్పష్టం చేశారు. వాణిజ్యవేత్తల చొరవతో, చర్చలతో మరింత పారదర్శకత, సరళ  విధానాలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. 

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యాపారుల వద్దకే వచ్చిందని, ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ఈ ప్రభుత్వం ఎలాంటి టార్గెట్లు పెట్టలేదని అధికారురు స్పష్టం చేస్తున్నారని తెలిపారు. వాణిజ్యవేత్తలు, అధికారులు ఇద్దరూ మాట్లాడుకుంటే సమస్యలు ఉండవన్నారు. నగరంలో పెద్ద పెద్ద షాపులు, షోరూంలు వినియోగదారులను  దోపీడీ చేస్తున్నాయని సభాముఖంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానని తెలిపారు. బంగారం దుకాణాల్లో  తరుగు పేరుతో 20 శాతం నుండి 30 శాతం కూడా వసూలు చేస్తున్నారని, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కి మల్లాది విష్ణు విజ్ఞప్తి చేశారు.

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండాలనే  ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని, ఈ ప్రభుత్వం ప్రెండ్లీ ప్రభుత్వమని తెలిపారు. వర్తకుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇలాంటి సమావేశాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. చట్టాలకు అనుగుణంగా నిబద్దతతో వ్యాపారం చేసే వారిపై పన్నుల విషయంలో అధికారుల దాడులు సరికాదన్నారు. వ్యాపారులు తప్పుచేస్తే చర్యలు తీసుకోవాలని, అకారణంగా చర్యలు వద్దన్నారు.  

విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ది కోసం ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లించాలని, కరోనా వంటి ఆపత్కాలంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారన్నారు.  

ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. గుల్జార్ మాట్లాడుతూ.. ట్రేడ్ అడ్వజరీ కౌన్సిల్ నుంచి సూచనలు, సలహాలు తీసుకునే పద్దతికి శ్రీకారం చుట్టామన్నారు. దీని ద్వారా వాణిజ్యవేత్తలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ విధానాన్ని అమలు చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో పన్నులు చెల్లించే వారి సౌలభ్యకోసం 2 లార్జ్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ట్యాక్స్ పేయర్స్ కి మేలుకలిగిలే పన్నుల విధానాన్ని అమలు చేస్తున్నదన్నారు.    

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కొనకళ్ల విద్యాధర్ రావు, కృష్ణా జిల్లాకి సంబంధించిన వర్తక, వాణిజ్య ప్రముఖులు, టాక్స్ ప్రాక్టీషనర్స్, ఛార్టర్డ్ అకౌంటెంట్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నత అధికారులు, విజయవాడ - I, II & III డివిజన్ అధికారులు,  సిబ్బంది పాల్గొన్నారు.  


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image