ఈ నెల 30న 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 4వ త్రైమాసికం విద్యా దీవెన పథకంను లాంచనంగా ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి

 ఈ నెల 30న 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 4వ త్రైమాసికం విద్యా దీవెన పథకంను లాంచనంగా ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి


*జిల్లాలో జగనన్న విద్యా దీవెన పథకం క్రింద 38099 మంది తల్లుల ఖాతాలకు జమ కానున్న రూ.24,66,18,443


పుట్టపర్తి, నవంబర్ 29 (ప్రజా అమరావతి): 


2021-22 విద్యా సంవత్సరానికి గానూ 4వ త్రైమాసికం విద్యా దీవెన పథకంను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30న అన్నమయ్య జిల్లా మదనపల్లె నుండి లాంచనంగా ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్  బసంత కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 


ఐ టి ఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఫార్మసీ మరియు అన్ని డిగ్రీ లెవెల్ కోర్స్ లు అభ్యసిస్తున్న అర్హులైన ఎస్.సి, ఎస్.టి, బి.సి, ఈ బి సి, కాపు, మైనారిటీ మరియు క్రిష్టియన్ మైనారిటీ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం క్రింద పూర్తి ఫీజ్ రీయింబర్స్మెంట్ క్రింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ కానున్నదని,


 శ్రీ సత్య సాయి జిల్లాకు సంబంధించి జగనన్న విద్యాదీవేన క్రింద 42411 మంది విద్యార్థులకు చెందిన 38099 మంది తల్లుల ఖాతాలకు రూ.24,66,18,443జమ కానున్నదని తెలిపారు. 


ఈ కార్యక్రమంనకు  స్థానిక కలెక్టరేట్లోని  స్పందన వీడియో సమావేశపు మందిరం నుండి 30.11.22  తేదీన  ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానం లో జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని  పై ప్రకటనలో తెలిపారు..

 

Comments