30 లక్షల ఇళ్ల నిర్మాణం కొరకు పేదలకు పెద్ద ఎత్తున పట్టాలు అందించడం ఒక చరిత్ర

 

*30 లక్షల ఇళ్ల నిర్మాణం కొరకు పేదలకు పెద్ద ఎత్తున  పట్టాలు అందించడం ఒక చరిత్ర


*


*భూముల రీ సర్వే ద్వారా పారదర్శకంగా తకరారు లేని యాజమాన్యపు భూ హక్కు*


*జగనన్న భూ రక్షా - భూ హక్కు  ఒక గొప్ప చారిత్రాత్మక కార్యక్రమం  :  రెవెన్యూ మంత్రి ధర్మాన*


తిరుపతి, నవంబర్ 16 (ప్రజా అమరావతి): సుమారు 30 లక్షల ఇళ్లు నిర్మాణం కొరకు స్థలాన్ని కొనుగోలు చేసి పేదలకు ఇళ్ళు కట్టుకొనడానికి పట్టాలు అందివ్వడం ఒక చరిత్ర అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి  ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో రాయలసీమ జిల్లాలకు సంబందించి ప్రాంతీయ రెవెన్యూ సదస్సును ఎనిమిది జిల్లాల కలెక్టర్ లు, సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ లు, డి.ఆర్.ఓలు, సర్వేయర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రోజు తిరుపతిలో మొదటిసారిగా రాయలసీమ జిల్లాలకు సంబందించిన రెవిన్యూ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉందని, 17 వ శతాబ్దంలో కోల్ కత్తా కేంద్రంగా ఈ శాఖ ఏర్పడిందని, తర్వాత కాలానుగునంగా ఎన్నో మార్పులకు నోచుకుందని దేశంలోనే అత్యంత ప్రాదాన్యమున్న విభాగం ఇదని అన్నారు. భూ పరిపాలనలో రెవిన్యూ శాఖ అన్ని శాఖలలో ముఖ్యమైనదని అన్ని శాఖల విజయాల వెనుక రెవిన్యూ శాఖ ఉందని, రాష్ట్రంలోని ప్రతి పౌరునికి తాను నివసి౦చెందుకు ఇళ్ళు కట్టుకోవడం దగ్గరనుండి ఆకరికి చనిపోయే వరకు రెవెన్యూ శాఖ సేవలు అవసరం ఉంటందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాఖకు సంబందించి ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చిందని వాటిని అమలు చేసి ముఖ్యమంత్రి లక్ష్యాల మేరకు పని చేసి ప్రజలకు సేవలు అందించాల్సిన బాద్యత మనపై ఉన్నదని ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఇది ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. గ్రామాలలో అశాంతికి భూ తగాదాలు కారణంగా నిలుస్తున్న తరుణంలో బ్రిటిష్ కాలంలో చేసిన భూ సర్వే తర్వాత మళ్ళీ భూముల రీసర్వేని అత్యాధునిక పరిజ్ఞానంతో ప్రభుత్వం తీసుకుని వచ్చిందని ఈ సర్వే నిర్వహించడం ద్వారా గ్రామాలలో నెలకొన్న భూతగాదాలు తొలగిపోతాయని, టైటిల్ ఫ్రీ ప్రాపర్టీస్ బయటకు వచ్చి వాటిపై ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఏర్పడటం వల్ల ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కలిగి పెట్టుబడులు వచ్చి రాష్ట్రం జి.డి.పి. రేటు అభివృద్ధి  చెందుతుందని దీనిని ముఖ్యమంత్రి గారు ప్రాధాన్యత గల అంశంగా తీసుకున్నారని మనం సహకరించి పూర్తి చేయాలని కోరారు.  ఈ సర్వేల ఆధారంగా ప్రభుత్వం మరికొన్ని కార్యక్రమాలు రూపకల్పన చేసిందని ప్రజల నుంచి ఎక్కువ శాతం అవినీతి ఉందని ఆరోపణలు ఉన్న చోట అవినీతి రహిత ప్రాంతాలుగా చేయడమే ముఖ్యమంత్రిగారి ఆలోచన అని అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నగదు లబ్దిదారులకు అందక దుర్వినియోగం అయ్యేవని ఆరోపణలు ఉండేవని, కాని ఈ ప్రభుత్వం పాలనలో డైరెక్ట్ బెనిఫీట్ ట్రాన్స్ఫెర్ ను మన రాష్ట్రంలోనే మొదటిగా అమలు చేసి దీని ద్వారా 1 లక్షా 65 వేల కోట్ల రూపాయలను లబ్దిదారులకు చెల్లించడం జరిగిందని, ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని  స్పూర్తిగా తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో పేదలకు ఇళ్ళ పట్టాలు పంపిణీ పెద్ద ఎత్తున జరగలేదని, ఇళ్ళ నిర్మాణాలకోసం ప్రభుత్వం 12వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని, ఈ విషయం పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. నిబద్దతతో పని చేసే అధికారులకు అండగా ఉంటామని తెలిపారు. షరతులు మీద పట్టాలు, చుక్కలు భూములు, 22-A వివాదాలు లేని భూములను ప్రజలకు అందించాలనేది ముఖ్యమంత్రి ఉదేశ్యం అని, దీని కోసం కృషి చేయాలని అన్నారు.  మొన్ననే కృష్ణా జిల్లా అవనిగడ్డ లో పెద్ద ఎత్తున  35వేల ఎకరాలు అర్హులకు భూ పంపిణీ చేసామని అన్నారు. ఆటో మ్యుటేషన్, వెబ్ ల్యాండ్ ఎంట్రి , కొత్త జిల్లాలు, డివిజన్ లు ఏర్పడిన తర్వాత వచ్చిన ఇబ్బందులు, రెవెన్యూ సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రజలకు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి అధికారులు సమష్టి కృషి చేసి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. మొట్టమొదటిగా ఈ ప్రాంతీయ రెవెన్యూ సమావేశం తిరుపతి లో చేస్తున్నామని, త్వరలో విశాఖ, విజయవాడ లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.


సమీక్ష అంశాలు:

 సి సి ఎల్ ఎ పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష, ఇంటి పట్టాల పంపిణీ, డాటేడ్ ల్యాండ్స్, 22 ఏ కేసులు, సదా బైనామా, మ్యుటేషన్ , ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు,   ఆక్రమణల  క్రమబద్ధీకరణలు, ఈ పంట నమోదు, వ్యవసాయ భూముల కన్వర్షన్ వంటి తదితర భూసంబంద అంశాలపై చర్చిచడం జరిగింది.


సి సి ఎల్ ఏ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ రీ సర్వేలో తప్పనిసరి రైతుల భాగస్వామ్యం ఉండాలని, అందుబాటులో లేని రైతులను గ్రామస్తుల సమక్షంలో మాట్లాడి రీ సర్వే చేపట్టాలని, రైతులు అందుబాటులో లేరని రీ సర్వే జరగలేదని సమస్య రాకూడదు, రైతులు అందించే ప్రతి అర్జీని స్వీకరించి పరిష్కారం తప్పనిసరి చూపాలని తెలిపారు. జిల్లాస్థాయిలో రిటైర్డ్ జడ్జి అధ్యక్షతన 7 మెంబర్స్ కమిటీ ఏర్పాటు చేసి పెండింగ్ లేకుండా రైతుల భూములకు పరిష్కారం చూపాలని అన్నారు.


సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్ మాట్లాడుతూ జగనన్న భూ రక్ష. భూహక్కు పథకానికి అర్థాన్ని వివరిస్తూ భూ రక్షా  అంటే ఖచ్చితమైన సర్వేతో రైతుల భూములను నిర్ధారించడమని, భూ హక్కు అన్నది రైతులకు మనం అందించే పత్రాలు అని  తెలిపారు. రైతుల భాగస్వామ్యంతోనె రీసర్వే చేపట్టాలని, రీ సర్వే పూర్తిగా ప్రభుత్వం ద్వారా రైతులకు ఖర్చులు లేకుండా ఉచితంగా చేపడుతున్నదని, ఈ సర్వే విధానంతో రైతులకు కనపడే విధంగా హద్దురాళ్ళు ఉంటాయని, రీ సర్వే అనంతరం పత్రాలను రైతులకు అందిస్తామని, రైతుల భూమి వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. 


అడిషనల్ సి సి ఎల్ ఏ సెక్రటరీ ఇంతియాజ్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 30 లక్షల ఇంటి పట్టాలు అందించామని, పెండింగ్ లో ఉన్న ఈ కేవైసీ పూర్తి చేయాలని, ఇంటి పట్టాలకు సంబంధించిన కోర్టు కేసుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.

మద్యాహ్నం : క్షేత్ర స్థాయి లో అమలు పై ఇబ్బందులు , సలహాలు, సూచనలు స్వీకరణ, వాటికి పరిష్కారం పై చర్చ : 

రీ సర్వే లో ఇబ్బందులు ఎదుర్కోవడానికి కావలసిన రోవర్లు ,  లాప్ టప్ లు అందించనున్నామని వివరించారు.


సదస్సు ముగింపు సదర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి అధికారులనుద్దేసించి మాట్లాడుతూ నేడు ప్రయోజనకర సమావేశం జరిగిందని, అనేక విషయాలపై చర్చించడం, అధికారులకు సాదారణ విధులతో పాటు  రీ సర్వే అదనపు వర్క్ , ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలను పూర్తిచేయాలనే లక్ష్యంగా పనిచేద్దాం అన్నారు. 


తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి  రెవెన్యూ శాఖ మంత్రి  ధర్మాన ప్రసాదరావు, సి సి ఎల్ ఏ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్, సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్థ జైన్, అడిషనల్ సి సి ఎల్ ఏ సెక్రటరీ ఇంతియాజ్ లతో పాటు సిసి ఎల్ ఎ ఉన్నతాధికారులను సన్మానించారు. 


 ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్, అన౦తపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, పుట్ట పర్తి సత్య సాయి జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, కర్నూల్ జిల్లా కలెక్టర్ కోటేశ్వర్ రావు, సి.సి.ఎల్.ఎ. జాయింట్ సెక్రటరీ అపరాజిత , సెక్రటరీ గణేష్, పి.సి.,సి ఎం ఆర్ ఓ రచన,  జాయింట్ కలెక్టర్ లు అన్నమయ్య- తమీం అన్సారియ, తిరుపతి -డి.కె.బాలాజీ,  చిత్తూరు -వెంకటేశ్వర్, కర్నూలు - రామసుందర్ రెడ్డి, సత్యసాయి - చేతన్ , అనతపురం - కేతన్ గార్గ్ , వై ఎస్ ఆర్ కడప - సాయికాంత్ వర్మ  , ఎనిమిది జిల్లాల డి.ఆర్.ఓ లు, ఆర్.డి.ఓ లు, సర్వే అధికారులు, తహసిల్దార్లు అధికారులు పాల్గొన్నారు.                


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image