చిన్నం శ్రీలేఖ కి 3.30 సెంట్స్ ఇంటి స్థలం కలెక్టర్ ద్వారా స్పందనలో పట్టా అందచేతరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 


చిన్నం శ్రీలేఖ కి 3.30 సెంట్స్ ఇంటి స్థలం


కలెక్టర్ ద్వారా స్పందనలో పట్టా అందచేత కృతజ్ఞతలు తెలిపిన వ్యవసాయ శాఖ అధికారులు 


వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు 30 .12 .2016 న, ప్రమాదవశాత్తు చనిపోయిన  కె వేణుగోపాల్ కుటుంబానికి పరిహారం మరియు ఇతర ప్రయోజనాలు గతంలోనే ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు 


సోమవారం స్పందన కార్యక్రమంలో  స్వర్గీయ కె. వేంకటేశ్వర రావు భార్య చిన్నెం శ్రీలేఖ చకు ఇంటి స్థలం పట్టాను కలెక్టర్ అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నవంబర్ 7 వ తేదీన వ్యవసాయ శాఖ అధికారులు  కలిసి

గతంలో ఇంటి స్థలం ఇచ్చుటకు ప్రభుత్వం అంగీకరించి విషయం తన దృష్టికి తీసుకుని రావడం జరిగిందన్నారు. ఇందు నిమిత్తమై కుటుంబ సభ్యులకు రాజమండ్రి లో ఇంటి స్థలం ఇప్పించవలసిందిగా కోరుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ సంఘం జనరల్ సెక్రెటరీ  డి. ప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు తదితరులు అర్జి ఇవ్వడం జరిగిందన్నారు.ఇంటి స్థలం మంజూరు చేస్తూ మధురపూడి జగనన్న కాలనీ లే అవుట్ లో 3.3 సెంట్ల ఇంటి స్థలాన్ని చిన్నం శ్రీలేఖ కి  ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ సంఘ సభ్యులు,  జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు,  చిన్నెం శ్రీలేఖ  తదితరులు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్వో జీ. నరసింహులు,  ఆర్డీఓ ఎ. చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.Comments