రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో 21.30 లక్షల ఇళ్ళ నిర్మాణాలు



*రాష్ట్రంలో రూ.35 వేల కోట్లతో 21.30 లక్షల ఇళ్ళ నిర్మాణాలు*


*2023 డిసెంబర్  నాటికి ఇళ్ళ నిర్మాణాలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం*


*ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్*


కర్నూలు, నవంబర్, 03 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం లో  భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.35 వేల కోట్లతో 21.30 లక్షల ఇళ్ళ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు .


గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గృహ నిర్మాణ పురోగతి పై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్,జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్ష 30 వేల ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా, ఇందులో  హౌసింగ్ శాఖ ద్వారా   18 లక్షల 63 వేల వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం  పట్టాలు ఇచ్చిన స్థలంలోనే నిర్మించడం జరుగుతోందన్నారు..మిగిలిన 2.6లక్షల ఇళ్లు టిడ్కోకు సంబంధించినవి అని తెలిపారు. ఇందులో  ఇప్పటి వరకు   17 లక్షల 30 వేల ఇళ్లు గ్రౌండింగ్ చేయడం జరిగిందన్నారు. మిగిలిన ఇళ్లను కూడా గ్రౌండింగ్ చేస్తున్నామని, నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.  ఇప్పటికి 3లక్షల ఇళ్లు పూర్తి కాగా, వాటిల్లో 1.4 లక్షలు టిడ్కో ఇళ్లు 1.6 లక్షలు వ్యక్తిగత ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. రూఫ్ కాస్ట్ వరకు ఇప్పటి వరకు 1లక్ష 10 వేల ఇళ్లు వచ్చాయని, రూఫ్ లెవెల్ లో 75 వేల ఇళ్లు ఉన్నాయి, బేస్మెంట్ లెవెల్ లో 2లక్షల 80 వేల ఇళ్లు ఉన్నాయన్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలు  17,005 లేఔట్స్ లో ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు.ఇళ్ళ నిర్మాణం కోసం ఈ  7 నెలల్లో రూ. 5 వేల కోట్లు   అంటే సుమారు ప్రతి రోజు రూ.23  కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు.  ప్రతి ఒక్క ఇంటి నిర్మాణానికి 2.15 లక్షలు ఇస్తునామన్నారు, వీటిలో 1.80లక్షలు పూర్తిగా సబ్సిడీ, మిగిలిన 35 వేల రూపాయలు బ్యాంకుల ద్వారా 25 పైసలు వడ్డీకి లబ్ధిదారునికి మంజూరు  చేయడం జరుగుతోందన్నారు. బ్యాంకుల నుండి మంజూరైన మొత్తాన్ని తిరిగి చెల్లించే సమయంలో కేవలం 3శాతం వడ్డీ మాత్రమే లబ్ధిదారుడు చెల్లించాలని, మిగిలిన వడ్డీ అంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీంతోపాటు లబ్ధిదారునికి ఖర్చు తగ్గించడానికి  20 టన్నుల ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. పెద్ద లేఔట్లకు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, చిన్నచిన్న లేఔట్లకు సచివాలయం ద్వారా కూపన్లు తీసుకొని లబ్ధిదారులు ఇసుక తెచ్చుకోవడం జరుగుతోందన్నారు. సిమెంట్ కూడా బహిరంగ మార్కెట్లో 400 రూపాయలు ఉంటే ప్రభుత్వం తరఫున కేవలం 270 రూపాయలకే సబ్సిడీ ధరతో లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. అలాగే స్టీల్ కూడా  తక్కువ ధరకే అందజేస్తున్నామని, వీటితోపాటు  కిటికీలు, ద్వార బంధాలు,ఎలక్ట్రికల్ వస్తువులు తదితర

 14 ఐటమ్స్ కూడా  ప్రభుత్వం నుంచి తీసుకునే వెసులుబాటు ఉందన్నారు.. లబ్ధిదారుడు కేవలం ఇటుకలు మరియు మెటల్ అందుబాటులో ఉంచుకొని  నిర్మించుకోవలసి ఉంటుందన్నారు... ఇల్లు కట్టుకోలేని వారు ఆప్షన్ త్రీ ద్వారా ఇప్పటివరకు 3లక్షల 27 వేల మంది   ముందుకు వచ్చారన్నారు. ఇటువంటి నిర్మాణాల కోసం లేబర్ కాంట్రాక్టర్స్ ఇప్పటి వరకు 300 మందిని గుర్తించామని, వారి ద్వారా ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేస్తున్నామన్నారు. ఇటువంటి నిర్మాణాలు చేయడానికి ఎవరైనా లేబర్ కాంట్రాక్టర్లు సిద్దంగా ఉంటే హౌసింగ్ పీడీ ద్వారా జిల్లా కలెక్టర్ ను సంప్రదిస్తే  వారికి ఇళ్లను నిర్మించేందుకు అవకాశం ఇస్తామన్నారు.. 


*కర్నూలు జిల్లాకు 47,529 ఇళ్లు, అలాగే PMAY గ్రామీణ లో 8వేల కున్పైగ  ఇళ్లు మంజూరు చేయగా మొత్తం 56 వేల 500 ఇళ్లు మంజూరు చేశామన్నారు. వీటిల్లో 3800 ఇళ్లు పూర్తి అయ్యాయని, 3843 రూఫ్ కాస్ట్ అయ్యాయని, 2531 రూఫ్ లెవెల్ అయ్యాయని, 6800 బేస్మెంట్ లెవెల్ లో ఉన్నాయన్నారు. ఈ నిర్మాణాలకు సంబంధించి మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు స్టేజ్ కన్వర్షన్ చేసేలా దిశానిర్దేశం చేశామని, అలాగే ఆదోని, పత్తికొండ, ఆలూరు, చిప్పగిరి తదితర మండలాల్లో  ఎక్కువగా ఆప్షన్ 3కి మొగ్గు చూపారని ఈ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు., కర్నూలు డివిజన్ లో  కోడుమూరు, సి.బెలగల్, కల్లూరు, ఓర్వకల్లు మండలాల్లో మంచి పురోగతి చూపారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ విలేఖరుల సమావేశంలో వివరించారు. 


దీంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా  పనుల నిర్వహణకు  ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు మంజూరు చేస్తూ, 15 వేల సచివాలయాలు ఉంటే 3వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.  రాష్ట్రంలో 15 వేల సచివాలయాలు ఉంటే వాటిల్లో 3647 సచివాలయాలను ప్రజా ప్రతినిధుల ద్వారా విజిట్ చేశారని, 3344 పనులకు కలెక్టర్ల ద్వారా పనులు మంజూరు కాగా, వీటిల్లో 2317 సచివాలయాల్లో పనులు కూడా మొదలు కావడం జరిగిందన్నారు. ఈ పనులను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు త్వరిగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో సిమెంట్ కూడా మార్కెట్ ధరకంటే తక్కువ ధరకే ఇవ్వడం వల్ల ఎక్కువ పనులు త్వరగా పూర్తి చేస్తారన్నారు. అలాగే  విద్యుత్ పనులకు సంబంధించి ఎటువంటి డిపాజిట్ లేకుండా పనులు చేస్తున్నామని, పని పూర్తి అయిన తరువాత సంబంధిత బిల్లులు అప్లోడ్ చేసిన తర్వాత వాటిని  క్లియర్ చేయడం జరుగుతుందన్నారు. జగనన్న ఇళ్ళ కాలనీల్లో  మౌలిక సదుపాయాల కొసం 34 వేల కోట్ల రూపాయలతో డిపిఆర్ ఆమోదించడం జరిగిందన్నారు. వీటిల్లో విద్యుత్ కు సంబంధించి 7వేల కోట్ల రూపాయలకు అనమతులు మంజూరుతో పాటు పనులు కూడా జరుగుతున్నాయన్నారు. అలాగే నీటి వనరుల కోసం  జల్ జీవన్ మిషన్ లో భాగంగా 7వేల కోట్ల మంజూరు కాగా, డ్రైనేజ్ కోసం 4కోట్లు మంజూరు అయ్యాయన్నారు. ఇళ్లు  పూర్తి అయిన మూడు నెలల లోపల మంచి నీళ్లు, విద్యుత్, డ్రైనేజ్ పూర్తి చేయాలన్న ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 1.60 లక్షల ఇళ్లకు అందజేయడంలో భాగంగా 85,338 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం, 86,433 ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కర్నూలు జిల్లాలో  2500 ఇళ్లకు నీటి సౌకర్యం కల్పించారన్నారు. అలాగే 3500 ఇళ్లు రూఫ్ కాస్ట్ స్థాయిలో ఉన్నాయని, 6800 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ స్థాయికి వచ్చాయన్నారు.*


హౌసింగ్ సిబ్బంది ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన బిల్లుల మంజూరు కు లబ్దిదారులను కమిషన్లు తీసుకుంటున్నారని పాత్రికేయులు స్పెషల్ సి ఎస్ దృష్టికి తీసుకు రాగా  పేదల కోసం ముఖ్యమంత్రి ఇళ్లు నిర్మిస్తుంటే, లబ్ది దారులను డబ్బు అడగడం  చాలా తప్పు అని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ సి ఎస్ హెచ్చరించారు..



అనంతరం విలేఖరుల అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ వివరణ ఇస్తూ ఆప్షన్ 3 ద్వారా ఇళ్లు కట్టించడానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు ఇస్తోందని, ప్రజలు ముందుకు వచ్చేలా వారికి అవగాహన కల్పించాలని మీడియా వారికి సూచించారు.


ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, హౌసింగ్ పిడి వెంకట నారాయణ, హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



Comments