ఎల్ ఐ సి ఏజంట్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాను - ఎం పి బాలశౌరి
విజయవాడ (ప్రజా అమరావతి);
ఈ రోజు విజయవాడలో ఎం పి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ఎల్ ఐ సి ఏజెంట్ల ప్రతినిధులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని కలిసి పాలసీ దారుల మరియు ఎజేంట్ల సమస్యలను వివరించి, సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు
ఏజెంట్లు ప్రతినిధుల ముందే బందర్ ఎం పి బాలశౌరి గారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మంగళం రామ సుబ్రహ్మణ్య కుమార్ గారితో ఫోన్ లో మాట్లాడి వారి సమస్యలు గురించి చైర్మన్ దృష్టికి తేవడం జరిగింది. అలాగే ఈసారి ఢిల్లీ లో వ్యక్తిగతంగా కలిసి ఏజేంట్ల సమస్యల పరిష్కారం గురించి చర్చించు దామని చెప్పగా చైర్మన్ గారు అంగీకరించడం జరిగింది
తమ సమస్యలను శ్రద్ధగా వినడమే కాకుండా తమ ఎదురుగానే ఎల్ ఐ సి చైర్మన్ కుమార్ గారి దృష్టికి తేవడం , సమస్యల పరిష్కారానికి చిత్త శుద్ధి తో కృషి చేయడం పట్ల రాష్ట్ర స్థాయి ఎల్ ఐ సి ఎజెంట్ల ప్రతినిధులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తం చేశారు
addComments
Post a Comment