రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ చేపట్టడం జరిగింది

 రాజమహేంద్రవరం రూరల్  (ప్రజా అమరావతి): 


రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ చేపట్టడం జరిగింద


ని, క్షేత్ర స్థాయి లో కొనుగోలు పనితీరు ను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.


శనివారం మధ్యాహ్నం రాజవోలు ఆర్భికే లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ,. రైతులు వారు పండించిన పంట దిగుబడి, కోత కోసే వారి వివరాలు ముందస్తుగా అర్భికే వద్ద నమోదు చేసుకుని, వాటిని కొనుగోలు కేంద్రానికి తరలించాలని తెలిపారు. రైతు స్వయంగా హమాలిలూ, గన్ని బ్యాగులు, రవాణా ఏర్పాటు చేసుకోగలిగితే ఆ మేరకు ప్రభుత్వం ప్రకటించిన ధరలు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు ట్రాక్టర్ గానీ, ఇతర వాహనం గానీ సమకూర్చుకోవడం ద్వారా ప్రయోజనం కలుగుతుందని, ఆ దిశలో ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారా అని అడిగారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ తో మాట్లాడుతూ, వాతావరణం అనుకూలంగా ఉండి సరుకు రవాణా కు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం రైతులకు మరింత భరోసా ఇచ్చే విధంగా ఉందని తెలిపారు. గ్రామ వ్యవసాయ సహయకులు ను ఈ సందర్భంగా కలెక్టర్ ధాన్యం కొనుగోలు, తదుపరి ప్రక్రియ పై అడుగుతూ, రైతు స్వయంగా గన్ని బ్యాగులు, హమాలీ లు, రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటే నేరుగా వాటిని చెందిన చెల్లింపులు రైతు ఖాతాకు జమ చేయాలని స్పష్టం చేశారు. చెల్లింపులు విషయం లో కొనుగోలు చేసిన 21 రోజుల్లో చెల్లింపులు జరపడం జరుగుతుందని రైతులకు భరోసా ఇచ్చారు.

రాజవోలు కొనుగోలు కేంద్రానికి ఈరోజు మూడు వాహనాలు ద్వారా సుమారు 35 మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం జరిగిందన్నారు. ట్రాక్టర్ ద్వారా 4.4 మెట్రిక్ టన్నులు, లారీల ద్వారా 11 మెట్రిక్ టన్నులు, 19.8 మెట్రిక్ టన్నుల ధాన్యం రావడం జరిగిందని అర్భికే సిబ్బంది వివరించారు. రైతులకు ప్రభుత్వ నూతన మార్గదర్శకాలు పై అవగాహన పెంచాలని కలెక్టర్ తెలిపారు. 



కలెక్టర్ వెంట రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ మండల స్థాయి అధికారులు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Comments