హైకోర్టు పేరుతో కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ల పై పోలీసులకు ఫిర్యాదు



విజయవాడ (ప్రజా అమరావతి);



*హైకోర్టు పేరుతో కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ల పై పోలీసులకు ఫిర్యాదు*  

- *హైకోర్టు రిజిస్ట్రార్ శ్రీ ఆలపర్తి గిరిధర్*

*డబ్బులిస్తే ఉద్యోగాలిస్తామని మోసగించే మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు సూచన*

 

హైకోర్టు పేరుతో ఒక కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ పై అప్పటి రిజిస్ట్రార్ (పరిపాలన) సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించామని, వాస్తవానికి అలాంటి సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ ని హైకోర్టు జారీ చేయలేదని హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన) శ్రీ ఆలపర్తి గిరిధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు మోసగాళ్లను న్యాయస్థానం ముందు హాజరుపర్చడానికి హైకోర్టు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.  

డబ్బులిస్తే ఉద్యోగాలిప్పిస్తామని, రిక్రూట్ మెంట్ ప్రక్రియను ప్రభావితం చేస్తామని మోసగాళ్లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మి అభ్యర్థులు ఎవరూ మోసపోవద్దని హైకోర్టు సూచించిందన్నారు. అభ్యర్థులను ప్రభావితం చేసేలా  రిక్రూట్ మెంట్ ప్రక్రియపై కామెంట్లు చేయడం, పేర్లను ప్రస్తావించి డబ్బులు చెల్లించడానికి ప్రొత్సహించడం వంటివి చేయడానికి ప్రయత్నించే మోసగాళ్లపై విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఏదైనా తప్పుడు వార్తలు, సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా స్ప్రెడ్ చేసే వారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

అభ్యర్థులు రిక్రూట్‌మెంట్, నోటిఫికేషన్, పరీక్ష తేదీ-స్థలం, మార్కుల జాబితా, ప్రొవిజనల్ తదితర వివరాలకై హైకోర్టు అధికారిక వెబ్ సైట్ https://hc.ap.nic.in ను సందర్శించాలని హైకోర్టు సూచించిందన్నారు. ఏదైనా కల్పిత, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా నకిలీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్, ఫలితాలు లేదా పోస్టింగ్ లెటర్‌లు తదితర వాటిని అభ్యర్థులు, ఇతరులు ఎవరైనా గమనించినట్లైతే హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని కోరారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సదరు మోసగాళ్లను చట్ట ప్రకారం త్వరితగతిన విచారించడానికి హైకోర్టు అనుమతించిందని రిజిస్ట్రార్ శ్రీ ఆలపర్తి గిరిధర్ తెలియజేశారు.  



Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image