పెండింగ్ అర్జీలు పరిష్కరించాలి
ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్
*: పుట్టపర్తి కలెక్టరేట్లో స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్*
పుట్టపర్తి, నవంబర్ 14 (ప్రజా అమరావతి):
స్పందన అర్జీల పరిష్కారంలో జాప్యం తగదని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 152 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు డిఆర్ఓ కొండయ్య,పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖవివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ . స్పందన గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, రీ ఓపెన్ క్యాటగిరిలో మళ్లీ అర్జీలు మళ్లీ రాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని, సకాలంలో అర్జీలను పరిష్కరించాలన్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్
జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన లైన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల, విలేజ్ హెల్త్ క్లినిక్ రానున్న నవంబర్ మాసానికి పూర్తిచేయాలని అందుకు సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు, నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్న కేసులకు కౌంటర్ ఫైల్ వేయాలని తాసిల్దారులను హెచ్చరించారు నిర్లక్ష్యం వహించిన తాహిల్దార్లపై సిసిఎల్ రూల్స్ కింద క్రమశిక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నందు గ్రామీణ ప్రాంతాల లోని నిరుపేదలకు 82లక్షల పని దినాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను పెంపొందించాలని అదేశించిగా, ఇప్పటి వరకు మనం 59.21 లక్షల పని దినాలను కల్పించాము, మిగిలిన 22.70 లక్షల పని దినాలను నవంబర్ 30వ తేది లోగా గ్రామీణ ప్రాంతాలలోని వేతన దారులకు పనులు కల్పించాలని , ఎపిడిలకు, ఎంపీడీఓ లకు ఆదేశించారు.
గృహ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
పేదల సొంతింటి కల నెరవేర్చినప్పు డు వారి కళ్లల్లో ఆనందం మనం చూపించిన ప్రేమ ఎంతో సంతృప్తి స్థాయి ని ఇస్తా అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాలలో అలసత్వం ప్రదర్శించారు రాదని తెలిపారు. ఇప్పటికైనా గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అన్నారు గృహ నిర్మాణాలలో మన జిల్లా అగ్రగామిగా నిలపటం లో భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించారు అనేక మున్సిపాలిటీలలో బి లో బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని బేస్మెంట్ స్థాయిలో ఉన్న వాటిని రూప్ లెవెల్ స్థాయి కి రూప్ లెవెల్ స్థాయిలో ఉన్న వాటిని ఫినిషింగ్ స్థాయికి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. పలు సంక్షేమ అభివృద్ధి పనులపై నిర్దేశించిన లక్ష్యాలను మండలాల వారీగా సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సమీక్షించారు. గ్రామ సచివాలయాలు ఏపీ సేవ పోర్టల్ ద్వారా విస్తృతంగా ప్రజలకుసేవలు అందించాలని తెలిపారు, సేవలో వెనుకబడిన మండలాల్లో ర్రోళ్ళ, పెనుగొండ, హిందూపురం అర్బన్, రూరల్, పుట్టపర్తి రూరల్, కదిరి అర్బన్, మడకశిర, ఆమడగురు మొదలైన మండలాల్లో ఉన్నాయని తెలిపారు,
ఈరోజు నిర్వహించిన ప్రజాస్పందనలో వచ్చిన వినతుల వివరాలు ఇలా ఉన్నాయి
1. కదిరి పట్టణంలోని నివసించు శ్రీమతి బి అరుణ నా భర్త B.రామకృష్ణ డీఎస్ సి 1998 నందు ఉపాధ్యాయ పోస్టు నందు అర్హుడుగా నమోదయినారు. నా భర్త మరణించినందున నాకు ఉద్యోగం కల్పించవలసిందిగా వినతుల అందజేశారు.
2. తుమకూరు జిల్లా కర్ణాటక రాష్ట్రంలోని కంచమన అల్లి గ్రామ కాపురస్తులైన శ్రీమతి లక్ష్మమ్మ ని నేను శ్రీ సత్య సాయి జిల్లాలో అమరాపురం మండలంలో బసనపల్లి గ్రామ పొలం సర్వేనెంబర్ 420.4 ఎక్స్టెన్షన్ ఒక ఎకరా భూమి ఉన్నది చంద్రప్ప అను వారి నుండి దాన సెటిల్మెంట్ పత్రం ద్వారా పొందినాను. పై తెలిపిన భూమికి నాకు పట్టాదార్ పాస్ పుస్తకం మంజూరు చేయగలరని ప్రార్థించుచున్నాను.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనుపమ, డిఆర్డిపీడి నరసయ్య, dwma పిడి రామాంజనేయులు, సిపిఓ విజయ్ కుమార్, వ్యవసాయ అధికారి సుబ్బారావు, జిల్లాలోని వివిధ ఉన్నత శాఖ అధికారులు తదితరులుపాల్గొన్నారు.
addComments
Post a Comment