రాష్ట్రంలో మార్పు మొదలైంది. మైనారిటీ సమావేశం ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

 *పార్టీ కేంద్ర కార్యాలయంలో ముస్లిం మైనారిటీ సెల్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు*


*సభలో అధ్యక్షుల వారి ప్రసంగం:-*


రాష్ట్రంలో మార్పు మొదలైంది. మైనారిటీ సమావేశం ద్వారా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.


జగన్ ఎన్నికల తరువాత జైలుకు వెళ్లడం ఖాయం.  ఆ పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయం.

మత సామరస్యం కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ

జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మైనారిటీలకు ఒక్క పని చేశారా?

దేశంలో మొదటి సారి మైనారిటీలకు కార్పొరేషన్ పెట్టింది టిడిపి

ఉర్థూను రెండో అధికారిక భాష చేసింది టిడిపి

దీనిపై జగన్ కు, వైసిపి నేతలకు డౌట్ ఉంటే గూగుల్ ను అడిగితే చెపుతుంది.

హైదరాబాద్ లో ఉర్థూ యూనివర్సిటీ పెట్టించిన ఘనత తెలుగు దేశం పార్టీది

హజ్ హౌస్ కట్టి, హైదరాబాద్ నుంచి నేరుగా ఫ్లైట్స్ పెట్టిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం

అసెంబ్లీ ఎదురుగానే నాడు హైదరాబాద్ లో హజ్ హౌస్ కట్టాం. 

మైనారిటీలపై టిడిపికి ఎప్పుడూ ప్రత్యేకమైన ప్రేమ ఉంది.

రాష్ట్ర విభజన తరువాత కర్నూలులో మళ్లీ ఉర్థూ యూనివర్సిటీ పెట్టాం

విజయవాడలో, కడపలో హజ్ హౌస్ లు కట్టాం

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇచ్చాం.

దుల్హన్ పథకం మనమే తెచ్చాం.....ఇప్పుడు ఇస్తున్నాడా ఈ ముఖ్యమంత్రి

•దోచుకోవడం...దాచుకోవడం తప్ప ఈ సిఎంకు మరేమీ చెయ్యరు

దుల్హన్ పథకానికి ఆంక్షలు పెట్టాడు...10తరగతి చదవాలి, కారు ఉండకూడదు, 300 యూనిట్ల కరెంటు వాడకూడదు అని ఆంక్షలు పెట్టారు. పథకం ఇవ్వను అంటున్నాడు.

పక్క జిల్లా వారిని పెళ్లి చేసుకున్నా పథకం వర్తించదు అని ఆంక్షలు పెట్ట్టింది ఈ ప్రభుత్వం

నాడు రూ.163 కోట్లతో 32,722 మంది మైనార్టీ వధువులకు దుల్హన్ సాయం.

జగన్ రెడ్డి మైనార్టీ వివాహాలకు రూ.లక్ష ఇస్తానని ఉత్తుత్తి హామీ ఇచ్చాడు.

విదేశీ విద్యోన్నతి పథకంలో 527 మైనార్టీ విద్యార్థులను విదేశాలకు పంపాము.

ముస్లిం యువతకు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మూడు లక్షల రుణం ఇచ్చాం.అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి యూనిట్లు ఏర్పాటుకు అవకాశం ఇచ్చాము. 

ఏటా 10 వేల మంది ముస్లింలు రుణాలు పొంది వ్యాపారాలు పెట్టుకున్నారు.

•నాడు 316 దర్గాలు, 1,365 మసీదులు, 43 ఖబరస్థాన్లు, 66 ఈద్గాలు, 164 ముస్లిం ప్రార్థనా మందిరాలకు మరమ్మతులు, నిధులు ఖర్చు చేశాం.

భారత దేశ చరిత్రలో ముస్లిం పెద్దలకు ఆర్థిక సాయం చేసిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం.

ఇమామ్ లకు, మౌజన్ లకు అండగా నిలిచిన ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం

టిడిపి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ కల్పించాం. 

ఎవరైనా వక్ఫ్ బోర్డు ఆస్తులు వైపు చూస్తే తాట తీస్తాం అని నాడు హెచ్చరించాం

అయితే ఇప్పుడు వేల కోట్ల వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి

మనం ఏమారితే...సొంత ఆస్తులు కూడా ఇలాగే కొట్టేస్తారు

నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబాన్ని వేధించి ప్రాణాలు తీశారు.

రైల్వే ట్రాక్ పై భార్యా బిడ్డలను కట్టేసి కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకుంది.

ఈ ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేదు, ఆస్తులకు రక్షణ లేదు.

బలహీన వర్గాల నాయకుడు అయ్యన్నను తప్పుడు కేసులో అరెస్టు చేశారు.

వివేకా హత్య కేసు పరిణామాలను పక్కదారి పట్టించేందుకే అయ్యన్నను అరెస్టు చేశారు.

రంజాన్ తోఫా, దుకాన్ మకాన్, విదేశీ విద్యాధరణ పథకం, దుల్హన్ పథకం, మైనార్టీ కార్పొరేషన్ నిధులు రద్దు చేశారు.

సాక్షి పత్రికకు ఏడాదికి 500 కోట్లు ఇస్తారు...దుల్హన్ పథకానికి మాత్రం నిధులు లేవు అంటారు.

సాక్షి గుమస్తాలకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తారు...ముస్లింలకు మాత్రం సాయం చెయ్యరు.

షరీఫ్ మండలి చైర్మన్ గా ఉండి నిజాయితీగా పని చేశారు. ప్రాణం పోయినా తప్పు చెయ్యను అని చెప్పారు.

ఎంతో నిజాయితీ పరుడు అయిన షరీఫ్ ను ముస్లింలకే పుట్టావా అని మండలిలో అడుగుతారా ?

మాజీ మంత్రి ఫరూక్ కాలిగోటికి సరిపోని వాళ్లు సైతం అయనను విమర్శిస్తున్నారు.

ముస్లిం సంక్షేమం, అభివృద్దిపై చర్చ జరగాలి. ముస్లిం వర్గానికి పెద్దగా ఆస్తులు ఉండవు. కష్టపడి పనిచేసి జీవితాలు సాగిస్తారు.

పేదరికంలో ఉండే ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పనిచెయ్యాలి

జగన్ ప్రజలకు నొక్కేది ఉత్తుత్తి బటన్....బట్ ఇన్ ద్వారా మద్యం, ఇసుక డబ్బు జగన్ కు చేరుతుంది.

మద్యం డబ్బు ఎటుపోతుంది.....జగన్ బ్రాండ్ల ద్వారా దోచేస్తున్నారు.

రాష్ట్రంలో కబ్జాలు, కుంభకోణాలు, బెదిరింపులు, అవినీతి బాగా పెరిగింది

నా పోరాటం నాకోసం కాదు....మీ కోసం.

రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ దెబ్బతిన్నాయి. అనంతపురంలో కరెంట్ ప్రమాదంలో నలుగురు చనిపోయారు.

మహిళ తన ఇంటిని అమ్ముకోకుండా అడ్డుపడిన వారు మంత్రులా...నర హంతకులా?

రాష్ట్రాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. అంతా కంకణం కట్టుకుని రాష్ట్రం కోసం పోరాడాలి.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసిపికి అవే చివరి ఎన్నికలు.

వైసిపి కుప్పంలో గెలవడం కాదు...ముందు పులివెందుల లో గెలువు

బాబాయిని చంపింది నేనే అని చెప్పి పులివెందులలో ఓటు అడుగుతారా?

కోడి కత్తి డ్రామా ఏమయ్యింది?

పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉంటే ఆయన ఇంటి వద్ద రెక్కీ చేస్తారా?

అందరినీ చంపేస్తావా...బాధపెట్టి పైశాచిక ఆనందం పొందాలని చూస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image