జైలు నుండి బయటకు వచ్చాక నేరాల జోలికి పోనిరీతిలో ఖైదీలను తీర్చిదిద్దాలి

 జైళ్ళ శాఖపై హోంమంత్రి తానేటి వనిత సమీక్ష

జైలు నుండి బయటకు వచ్చాక నేరాల జోలికి పోనిరీతిలో ఖైదీలను తీర్చిదిద్దాలి


శిక్షా కాలంలోనే ఖైదీలకు తగిన స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వాలి

ఖైదీలలో సత్ప్రవర్తన కలిగించేందుకు జైలు అధికారులు పూర్తిగా కృషి చేయాలి

అమరావతి,1నవంబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని వివిధ జైళ్ళలోని పరిస్థితులపై అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో మంగళవారం రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత జైళ్ళశాఖ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా రాష్ట్రంలోని వివిధ సెంట్రల్ జైళ్ళు,సబ్ జైళ్ళు సహా ఇతర జైళ్ళలోని స్థితిగతులను జైళ్ళ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా జైళ్ళలో ఉండే ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు,ఖైదీల సత్ప్రవర్తనకు జైళ్ళ అధికారులు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.అదే విధంగా వివిధ జైళ్ళలో సిసి కెమెరాలు అందుబాటులో ఉన్నాయా అని జైళ్ళ సూపరింటెండెంట్లను అడగ్గా చాలా వరకు అందుబాటులో ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు.అదే విధంగా జైళ్ళలో సిబ్బంది పరిస్థితులు ఇతర  అంశాలపై హోంమంత్రి తానేటి వనిత సమీక్షించారు.ఖైదీలకు సంబంధించి ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆమె అడిగి తెల్సుకున్నారు.ఖైదీలకు నైపుణ్య శిక్షణ ఏవిధంగా ఇస్తున్నది తదితర అంశాలను జైళ్ళ శాఖ అధికారులతో హోం మంత్రి తానేటి వనిత సమీక్షించారు.శిక్షా కాలం పూర్తయ్యాక జైలు నుండి బయటకి వచ్చిన వారు మరలా నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలిగే విధంగా వారి నడవడికలో పూర్తి మార్పులు తీసుకువచ్చేందుకు జైలు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని హోంమత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.అంతేగాక జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే ఏదొక ఉపాధి అవకాశం పొందే రీతిలో జైలులోనే ఖదీలకు తగిన ఉపాధి శిక్షణ అందించాలని హోంమంత్రి తానేటి వనిత జైళ్ళ అధికారులను ఆదేశించారు.

ఈసమావేశంలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర కారాగారాలు,జిల్లా జైళ్ళు,సబ్ జైళ్ళలో గల ఖాళీల భర్తీ తోపాటు తగిన వాహనాలు సమకూర్చాల్సిన అవసరం ఉందని హోంమంత్రి దృష్టికి తెచ్చారు.

జైళ్ళ శాఖ డిజిపి హసన్ రాజా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్ళలో గల పరిస్థితులను హోంమంత్రికి వివరించారు.ముఖ్యంగా వివిధ జైళ్ళలోని ఖైదీలకు నిబంధనల ప్రకారం అందిస్తున్న ఆహారం,కల్పిస్తున్న వసతుల గురించి వివరించారు.అలాగే ఖైదీలకు కల్పిస్తున్న వివిధ ఉపాధి శిక్షణా కార్యక్రమాలు,ప్రాధమిక విద్య,వయోజన విద్యా కార్యక్రమాలు గురించి తెలియజేశారు.రాష్ట్రంలోని నాలుగు కేంద్ర కారాగారాల్లో 8 నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఉన్నాయని వాటి ద్వారా ఖైదీలకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తున్నట్టు తెలిపారు.బిఆర్ ఆంబేద్కర ఓపెన్ విశ్వవిద్యాలయం నుండి ఇద్దరు ఖైదీలు బంగారు పతకాలు సాధించారని వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్,జైళ్ళ శాఖ డిఐజిలు డా.వరప్రసాద్,కిరణ్ లతో పాటు వివిధ కేంద్ర కారాగారాల సూపరింటెండెంట్లు తదితరుల పాల్గొన్నారు.

     

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image