మల్బరీ సాగు మరిన్ని ఎకరాల్లో విస్తరించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి
విజయనగరం, నవంబరు 09 (ప్రజా అమరావతి):
జిల్లాలో మల్బరీ సాగు మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి పట్టు పరిశ్రమ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మల్బరీ సాగుకు అందుబాటులో వున్న వసతులను వినియోగించుకొని ఈ పరిశ్రమను విస్తరించాలని చెప్పారు. రూరల్ మండలం వేణుగోపాలపురంలోని పట్టుపరిశ్రమ శాఖ ఏ.డి. కార్యాలయం వద్ద వున్న సిల్క్ రీలింగ్ యూనిట్‌ను, విత్తనాల ఉత్పత్తి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సూర్యకుమారి బుధవారం సందర్శించారు. పట్టు నాణ్యత, ఉత్పత్తి తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. జిల్లాలో పట్టుపరిశ్రమ అభివృద్ధి అవకాశాలపై ఏ.డి. ఏ.వి.సాల్మన్ రాజుతో చర్చించారు. జిల్లాలో ప్రస్తుతం 392 మంది రైతులు 700 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారని ఏ.డి. వివరించారు. మల్బరీ సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం వచ్చే అవకాశం వున్నందున దీనిపై రైతులకు అవగాహన కల్పించి ఈ సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని పట్టుపరిశ్రమ అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఇతర పట్టు వెరైటీలకు సంబంధించి టస్సర్ ప్లాంటేషన్‌ను కూడా మరింతగా పెంచేలా కృషిచేయాలని కలెక్టర్ సూచించారు.
addComments
Post a Comment