స్వర్ణకారుల సంక్షేమానికీ నారా లోకేష్ భరోసా
మంగళగిరి (ప్రజా అమరావతి);
మంగళగిరి స్వర్ణకారుల సంక్షేమానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భరోసా నిచ్చారు.
శనివారం తాడేపల్లి తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో, 150 మంది నిరుపేద స్వర్ణకారుల సంక్షేమం కోసం, ప్రమాద భీమా సౌకర్యంకల్పించి, సంభందిత పత్రాలను వారికి అందచేశారు.
అకాల మరణం చెందిన బీద స్వర్ణకారుల పిల్లల ఉన్నత విద్యకు అవసరమైన ఖర్చులను భరించటానికి సంసిద్ధతను వ్యక్తంచేశారు.
నిరుపేద స్వర్ణకారులకు అవసరమైన అధునాతన కొలిమి, ఇతర తయారీ సామగ్రి మరియు వృత్తిపరమైన పనిముట్లను పూర్తి ఉచితంగా అందచేస్తానని హామీయిచ్చారు.
స్వర్ణకారుల సమస్యల పట్ల అవగాహన మరియు స్వర్ణకారులపై కల అభిమానానికి, లోకేష్ కు లక్ష్మి నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షులు గుంటి నాగరాజు, కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు మరియు సభ్యులు కృతజ్ణతలు తెలియచేసారు.
ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకీదేవి, వింజమూరి ఆశాబాల, సంఘ కోశాధికారి పడవల మహేష్, సభ్యులు కందుల నాగార్జున, కారంపూడి చిరంజీవి, నారాయణం కోటేశ్వర రావు, నరేశ్, నవీన్, బద్దే శ్రీనివాసరావు, తిరువీదుల సతీశ్, ఆళ్ళ సాంబశివ రావు, దామర్ల మోహన్, మండ్రు బాల, సాంబశివ రావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment