ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి,విజయవాడ (ప్రజా అమరావతి);
*హజ్ యాత్రికుల రాకపోకలు విజయవాడ నుంచి అనుమతించండి : అంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటి
*
ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న ప్రయాణికులకోసం విజయవాడ అంతర్జాయీయ విమానశ్రేయాన్ని తిరిగి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ కేంద్ర వ్యవహారాల శాఖా మంత్రి స్మృతి ఇరానీని కోరారు . ఈరొజు ఢిల్లీ లోజరిగిన మైనారిటి వ్యవహారాల మంత్రిత్వ శాఖా సమవేశంలో అన్నీ రాష్ట్రాల హజ్ కమిటీల చైర్మన్లు , అదికారులు పాల్గొన్నారు . రెండు గంటలపాటు ఈ సమవేశం లో వివిద అంశాలపై విసృత చర్చజరిగింది . ఆంద్రప్రదేశ్ నుంచి హజ్ కమిటి చైర్మన్ గౌసల్ ఆజామ్ , హజ్ కమిటి సభ్యులు ఇంజనీర్ ఇషాక్ బాషా , రాష్ట్ర హజ్ కమిటి ప్రత్యెక అధికారి అబ్దుల్ ఖాదీర్ పాల్గోన్నారు . ఈ సందర్బంగా హజ్ కమిటి చైర్మన్ గౌసల్ ఆజామ్ మాట్లడుతూ విజయువాడ నుంచి అనేక అంతర్జాతీయ విమానాలు రాకపోకలు తిరిగి ప్రారంభించాయని , రానున్న హజ్ 2023 కు అంధ్రప్రదేశ్ లోని ప్రయాణికులను విజయవాడ అంతర్జాతీయ విమనశ్రయం నుంచి వెళ్ళి వచ్చేందుకు పాయింటును ప్రకటించాలన్నారు . అంధ్రప్రదేశ్ హజ్ యాత్రీకులు పవిత్ర మక్కా ,మదీనా నగరాల్లో బస చెయ్యడానికి ఇప్పటివరకు ఇస్తున్న యాత్రికుల వసతి గృహల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు . పవిత్ర యాత్రకు వెళ్తున్న హాజిలు ఎమైనా ఇబ్బందులు ఎదురైనా సహనంతో భరిస్తూ వెళ్తున్న అంశాల తమ దృష్టికి వచ్చాయన్నారు . ఈ ఇబ్బందిని అధికమించేందుకు హజ్ యాత్రకు ఒక నెల ముందు హజ్ కమిటి నుంచి ఒక అధికారిక బృందం ఆయా నగరాలకు ముందువెళ్ళి వసతిగృహాలను ముందుగానే చూసుకునే అనుమతిని సౌదీ ప్రభుత్వంతో ఇప్పించాలని కోరారు . హజ్ యాత్రికులకు యాత్ర సమయంలొ ఉచిత సేవలు అందించేందుకు ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులకు మత్రమే అధికారిక అనుమతి ఉందని , ఇక నుంచి హజ్ కమిటిలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను కుడా అనుమతించాలని కేంద్ర మంత్రి ఇరానీని కోరారు . ఈమేరకు కేంద్ర మంత్రి అంధ్రప్రదేశ్ అభ్యర్ధనలు పట్ల సానుకూలం స్పందించారని గౌసల్ ఆజామ్ వెళ్లడించారు .
addComments
Post a Comment