ఉత్సాహపూరితవాతావరణంలో మంగళగిరి - తాడేపల్లి బాలోత్సవం కార్యాలయం ప్రారంభం

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*ఉత్సాహపూరితవాతావరణంలో మంగళగిరి - తాడేపల్లి బాలోత్సవం కార్యాలయం ప్రారంభం*



*విద్యావిధానంలో మార్పుకోసం కృషి* 


 *పిల్లల్లోదాగిఉన్నసృజనాత్మకతను వెలికితీయడమే ధ్యేయం*


*పిల్లల ఆలోచనలతో వారిని ఎదగనిద్దాం*


వివిధ రంగాల్లో నిష్ణాతులు..సమాజ అభ్యుదయాన్ని కాంక్షించేవారు.... మార్పుకోసం పరితపించేవారు...

ఈ సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలనుకునేవారు అనేకమంది ప్రముఖులు మధ్య అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో మంగళగిరి - తాడేపల్లి బాలోత్సవం(మొదటి పిల్లల పండుగ) కార్యాలయం మంగళవారం తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ప్రారంభమైంది. కార్యాలయాన్ని మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షులు పి.సతీష్ ప్రారంభించారు. ఆ

కార్యాలయం చిరునామా తెలిపే బోర్డును ఫ్యూజన్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పి. శ్రీలక్ష్మి ప్రారంభించగా ఆంధ్ర నాటక కళాపరిషత్ ఛైర్మన్ నన్నపనేని నాగేశ్వరరావు ల్యాప్టాపు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ పిల్లల్లో ఆలోచనలను వారి అభిప్రాయాలను పెద్దలు

గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రశ్నించేతత్వంతోపాటు వారిని స్వతంత్రంగా ఎదిగే విధంగా కృషిచేయాలని ఆకాంక్షించారు. అందుకు తల్లిదండ్రులు,

ఉపాధ్యాయులు ప్రధాన భూమిక వహించాలని ఆకాంక్షించారు. సమాజంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో పిల్లలను ప్రోత్సహించడానికి ఆటలు, పాటలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలు వారిలో

వెల్లివిరిసేవిధంగా బాలోత్సవం లాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని చెప్పారు. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలో మున్సిపల్ కార్పోరేషన్ పరిధితోపాటు దుగ్గిరాల మండలం, రాజధాని తుళ్ళూరు మండలంలోని సుమారు 210 పాఠశాలలకు బాలోత్సవానికి సంబంధించి బ్రోచర్లు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 175 పాఠశాలలకు బాలోత్సవానికి సంబంధించిన సమాచారం వెళ్లిందని తెలిపారు.

డిసెంబరు 6,7 తేదీల్లో కెఎల్. యూనివర్సిటీలో జరిగే మంగళగిరి - తాడేపల్లి బాలోత్సవం పిల్లల పండుగకు మొత్తం 4వేలమంది చిన్నారులు వస్తారని అంచనా

వేస్తున్నట్లు చెప్పారు. ఇంటా బయట ఆనందం వెలివిరిసేది, ఆహ్లాదం వెల్లువెత్తేది చిన్నారులతోనే అని చెప్పారు. ఈ కాలంలో పిల్లల ప్రతిభాపాఠవాలు, శక్తియుక

లు పెరుగుతుండటాన్ని స్వాగతించారు. కొత్తరకమైన ఆటలు, సినిమాలు, సాంస్కృతిక రూపాలు సైతం సెల్ఫోన్లు, ఇంటర్నెట్, టివిల ద్వారా పిల్లలకు అందుతున్నాయని వివరించారు. మరోవైపు వ్యాయామం, శారీరక శ్రమ, పల్లె వాతావరణం ఆటలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పుస్తకాల కుస్తీ, బట్టీపట్టే చదువులు, హెూంవర్క్ యుద్ధం లాంటి బడిపిల్ల జీవితంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉరుకుల పరుగుల జీవితంలో మానవ సంబంధాలు బలహీనపడ్డాయని చెప్పారు. కుటుంబ బంధాలు, స్నేహభావాలు కుచించుకుపోతున్నాయని తెలిపారు. సాటివానికి సాయపడదాం... పెద్దలకు, పక్కనున్నవారికి సేవ

చేయాలన్న భావం కొరవడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం కుటుంబంలో పిల్లలు ఎన్ని నేర్చుకున్నా వాటిని ప్రదర్శించేందుకు వేదికలు, వేడుకలు పెద్దగా అవకాశాలు కల్పించబడటంలేదు. ఇళ్ళల్లో పెద్దవారు ఉన్నా పిల్లలకు కేటాయించే సమయం చాలక వారికి నీతికథలు, ధైర్యం, శౌర్యం, సేవాగుణం వంటి వా

టి గురించి వినిపించే అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పారు. జీవితంలో చదువు చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. పిల్లలు ఒత్తిడితో కాక ఇష్టపడి చదివే వాతా

వరణం కల్పించాలని డిమాండ్చేశారు.వారిలో ఉన్న అభిరుచులను, ఆసక్తులను, సృజనను, జ్ఞానతృష్ణను ప్రోత్సహించాలని కోరారు. మనకు ఎంతో ఇస్తున్న ఈ

సమాజానికి కొంతైనా తిరిగి ఇవ్వాలనే సామాజిక చైతన్యం పిల్లల్లో పెరగాలని ఆకాంక్షించారు. కులమత తారతమ్యాలు సమసిపోవాలని మనమంతా ఒక్కటే అనే భావన విద్యార్థినీ విద్యార్థుల్లో కలిగించాలని, అందుకు సమాజాభ్యుదయాన్ని కాంక్షించేవారంతా కృషిచేయాలని కోరారు. మొత్తం అకడమిక్ సాంస్కృతిక ఈవెం

ట్లలో 40 రకాల పోటీలు జరుగుతాయని చెప్పారు. బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి బాలోత్సవం తోడ్పడుతుందని చెప్పారు. ముందుగా వక్త

లను మంగళగిరి- తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి వేదికపైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నిర్మల జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ వివి.పసాద్, కెఎల్. యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.శ్రీపతిరాయ్, బాలోత్సవాల రాష్ట్ర సమన్వయకర్త పిన్నమనేని మురళికృష్ణ,

ఆంధ్ర నాటక కళాసమితి అధ్యక్షు

లు (విజయవాడ) నన్నపనేని నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు టి.సతీష్, విశ్రాంత సైనికోద్యోగి గోపాలం సాంబశివరావు, విశ్రాంత తాడే

పల్లి పంచాయతీ కార్యదర్శి వై. మల్లారెడ్డి, ఫ్యూజన్ ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (తాడేపల్లి) పి. లక్ష్మి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనీల్ కుమార్ , రాష్ట్ర బాధ్యులు గాదె సుబ్బారెడ్డి, అమరావతి బాల్సోతవం నిర్వాహకులు ఐజాక్ న్యూటన్, ఎం. భాగ్యరాజు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Comments