నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా (ప్రజా అమరావతి);
*వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం*
*ఈ సమావేశంలో మాట్లాడిన మంత్రి ఏమన్నారంటే...ఆయన మాటల్లోనే*
*ధర్మాన ప్రసాదరావు, రెవెన్యూ శాఖ మంత్రి*
అందరికీ నమస్కారం, భూమికి సంబంధించినటువంటి ముఖ్యమైన కార్యక్రమం ఇది. సీఎంగారు తన పాదయాత్రలో చూసిన విషయాలు, విన్న బాధలు దృష్టిలో ఉంచుకుని మాట ఇచ్చారు. భూములకు సంబంధించి అనేక వివాదాలు ఉన్నాయి, బ్రిటీషు వారి హయాంలో జరిగిన సర్వే మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. రైతాంగానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే రీసర్వే చేస్తున్నప్పుడు మీరు సహకరించండి, డ్రోన్ సర్వే తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ జరిగే సమయంలో రైతు ఉండాలి
, ఒకసారి మీకు రీసర్వే చేసి రక్షణ కల్పించిన తర్వాత మీ భూమి రికార్డులు మార్చడానికి వీల్లేదు. సర్వే జరిగే సమయంలో అందుబాటులో ఉండండి. సీఎంగారు ప్రతి నెలా రివ్యూలు చేస్తున్నారు. దీనికి చాలా ఖర్చు పెడుతున్నాం, ఉన్నతాధికారులు కూడా నిరంతరం పనిచేస్తుంటారు. 2 వేల గ్రామాలు మరో 15 రోజుల్లో మీ ఊరిలోని సచివాలయంలోనే మీ రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు, మ్యుటేషన్ కూడా వెంటనే అయిపోతుంది, పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాం, ఇందుకు అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు. 2023 డిసెంబర్ కల్లా పూర్తిచేయాలన్న సీఎంగారి లక్ష్యం మేరకు అందరం పనిచేస్తున్నాం. ఈ జిల్లాకు టీడీపీ హయాంలో ఒక్కటైనా ప్రయోజనకరమైన పనిచేశారా, రాష్ట్రం విడిపోయినప్పుడు 23 సంస్ధలు కేంద్రం ఇచ్చింది, మనకు కనీసం నాలుగైనా రావాలి కానీ చంద్రబాబు ఒక్క సంస్ధ అయినా పెట్టారా, మరి నాడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు ఏం చేశారు, ఎక్కడున్నారు, కేంద్రం ఇచ్చిన సంస్ధలు కూడా పెట్టించలేని దిక్కుమాలిన పరిస్ధితి మీది. అభివృద్ది లేదంటున్నారు, ఇచ్ఛాపురంలో మీరు ఏం చేశారు, జగన్ గారు సీఎం అయిన తర్వాత హీరమండలం రిజర్వాయర్ నుంచి రూ. 700 కోట్లతో ఉద్దానం ప్రాంతంలో ప్రతి ఇంటికి నీటిని ఇచ్చి శాశ్వతంగా కిడ్నీ రోగాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కిడ్నీ బాధితులకు రూ. 10 వేలు నెలనెలా ఇచ్చి వారిని ఆదుకుంటున్నారు. పలాసలో రూ. 100 కోట్లతో రీసెర్చ్ ఇన్సి›్టట్యూట్ ప్రారంభమవుతోంది. త్వరలో ప్రారంభోత్సవం జరగబోతుంది. మీరు ఈ పనిచేశామని ఒక్కటైనా చెప్పగలరా, నాడు వైఎస్‌ఆర్ గారు వంశధారకు శాంక్షన్ ఇస్తే మళ్ళీ శ్రీ జగన్ గారు స్వయంగా ఒడిశా వెళ్ళి అక్కడి సీఎంతో చర్చలు జరిపారు. చిత్తశుద్ది ఎవరిది చెప్పండి, సీఎంగారు రూ. 180 కోట్లతో గొట్టా లిఫ్ట్ ఇరిగేషన్‌ను కూడా మరో ఆరు నెలల్లో పూర్తిచేసేలా టెండర్లు కూడా త్వరలో పిలుస్తున్నారు. దాని వల్ల జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో ప్రతి గ్రామానికి నీటిని అందించే కార్యక్రమం జరుగుతుంది. నాడు వైఎస్‌ఆర్ హయాంలో యూనివర్శిటీ, మెడికల్ కాలేజ్, ప్రాజెక్ట్‌లు ఇచ్చారు, చంద్రబాబుకు అనుకూలమైన కొన్ని పత్రికలలో తప్పుడు కథనాలు రాస్తున్నారు, ఎక్కడో ఒక చోట పాడైన రోడ్డు చూపి ఇది పరిస్ధితి అంటారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు సరైన రోడ్లు వేసి ఉంటే ఇలా ఉండేవా, అభివృద్ది లేదంటారు, గత మూడున్నర ఏళ్ళలో రూ. 1,73,000 కోట్లు మీ అకౌంట్లలో వేశారు, ఒక్క నయాపైసా లంచం అడిగారని ఎవరైనా చెప్పగలరా, ఇది కదా మార్పు అంటే. సీఎంగారి నిర్ణయం వల్ల విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో నివాసం ఉంటూ జూమ్ కెమెరాకు దగ్గరగా, రాష్ట్రానికి దూరంగా ఉంటారు. విశాఖలో క్యాపిటల్ ఉంటే మీకేంటి ఇబ్బంది, మా తాతలు, తండ్రులు చెన్నై వెళ్ళేవారు, తర్వాత కర్నూలు వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ వెళ్ళాం, కానీ ఈ సీఎంగారు మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు. మాకు ఇస్తామన్న క్యాపిటల్ వద్దని చెప్పడానికి అమరావతి నుంచి కొందరిని తీసుకొచ్చి పాదయాత్ర చేయించారు. మీ పాదయాత్ర ఇక్కడికి వచ్చి ఉంటే ఈ నాలుగు జిల్లాలలో ఒక్క ఓటరు కూడా టీడీపీకి ఓటు వేసేవారు కాదు. ఈ ప్రాంత ప్రజలు విశాఖ రాజధాని వద్దంటున్నారని అచ్చెన్నాయడు, రామ్మోహన్‌నాయుడు అంటున్నారు, మీరు సాయం చేస్తే చేయండి కానీ ఇలా అడ్డుకోవడం పాపం. శ్రీకాకుళం జిల్లా వెనకబడి ఉందని తాజా గణాంకాలు కూడా చెబుతున్నాయి, ఇంత తాపత్రయంతో ఈ ప్రాంత అభివృద్ది కోసం సీఎంగారు కృషిచేస్తుంటే మీరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేయనని సీఎంగారికి కూడా చెప్పాను, పార్టీ పనులు చూసుకుంటానన్నాను, కానీ సీఎంగారు నో అన్నారు, పోటీ చేయాల్సిందే, మిగిలిన నియోజకవర్గాలు కూడా తిరగాల్సిందే అన్నారు. నేను సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నాను, దొంగ మాటలు చెప్పేవారిని నమ్మకండి, విశాఖ రాజధాని వద్దన్నందుకు, మనపై చిన్నచూపు చూస్తున్నందుకు టీడీపీని వెలివేయాల్సిన అవసరం ఈ జిల్లాలో ఉందని ఊరూరా అందరూ చెప్పాలి. ధన్యవాదాలు.
addComments
Post a Comment