మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన...
మంగళగిరి (ప్రజా అమరావతి);
తాడేపల్లి పట్టణం ప్రకాష్ నగర్ లో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్.
ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్న లోకేష్.
ఇటీవల మరణించిన టిడిపి కార్యకర్తల ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించిన లోకేష్.
అనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన లోకేష్
కార్పొరేషన్ వాటర్ అర్థరాత్రి పూట ఇస్తున్నారు.. ఆ సమయంలో నీళ్లు పట్టుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు.
గెలిచిన వెంటనే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చి మోసం చేసారని తమ బాధను వ్యక్తం చేసిన ప్రజలు.
త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు సమస్యల గురించి ఎన్ని సార్లు వేడుకున్నా అధికారులు స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు.
అర్థరాత్రి నీళ్లు ఇవ్వడం వలన మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా కలుషితమైన నీరు వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను.
గెలిచిన వెంటనే కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఇళ్ళ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆర్కే ప్రజల్ని మోసం చేశారు.
మేము గెలిచిన ఏడాదిలోనే ఇళ్ళ పట్టాలు అందిస్తాం. త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్య పరిష్కరిస్తాం.
చెత్త పన్ను పేరుతో ప్రజల్ని వేధించడం దుర్మార్గం. చెత్త పన్ను కట్టకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాం, నీటి కనెక్షన్ కట్ చేస్తాం అని బ్లాక్ మెయిల్ చెయ్యడం అన్యాయం.
చెత్త పన్ను వేసిన చెత్త బ్యాచ్ ఇది.
పన్నుల భారం తో సామాన్యులు బ్రతకలేని పరిస్థితి తెచ్చారు.
కుడి చేత్తో పది రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో వంద రూపాయిలు కొట్టేస్తుంది వైసిపి ప్రభుత్వం.
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంటి పన్ను, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు విపరీతంగా పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారు.
అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదం అన్న జగన్ రెడ్డి ఇప్పుడు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు.
జే బ్రాండ్స్ తో మహిళల మెడలో పుస్తెలు తెంపుతున్నారు జగన్ రెడ్డి.
మంగళగిరి నియోజకవర్గంలో సమస్యలు గాలికోదిలి ఎమ్మెల్యే ఇళ్లు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు.
addComments
Post a Comment