*_కార్పొరేట్ ఆసుపత్రుల కంటే ధీటుగా సర్కారీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం_*
*_రూ.80 లక్షలతో ఇబ్రహీంపట్నంలో డాక్టర్ వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ (డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రం) ప్రారంభోత్సవం_*
*_హెల్త్ క్లినిక్ ప్రారంభించిన మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు_*
ఇబ్రహీంపట్నం, నవంబర్ 12 (ప్రజా అమరావతి);
_కార్పొరేట్ ఆసుపత్రుల్లో కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు లభిస్తున్నాయని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు పేర్కొన్నారు._
_ఇబ్రహీంపట్నంలోని సడక్ రోడ్డులో రూ.80 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణాన్ని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారు శనివారం ప్రారంభించారు._
_ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పడకేసిన ప్రభుత్వ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ విప్లవాత్మక సంస్కరణలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు._
_ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడం కోసం ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’లకు స్వంత భవనాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. పట్టణాల్లో 30 వేల జనాభాకు ఒకటి చొప్పున వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ నిర్మించినట్లు వెల్లడించారు._
_ఇబ్రహీంపట్నంలో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. రోగులు వేచి ఉండే గది, అవుట్ పేషెంట్, ప్రసూతి, డ్రెస్సింగ్, లేబోరేటరి, ఫార్మసీ గదులు, ఆపరేషన్ థియేటర్, కౌన్సెలింగ్ హాల్, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా జనరల్ వార్డులు ఉండేలా నిర్మించినట్లు పేర్కొన్నారు._
_గతంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవన్నారు. ప్రస్తుతం పది పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చిందన్నారు. డెలివరీలు సైతం ఇక్కడే నిర్వహించనున్నారని వెల్లడించారు. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 64 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారన్నారు. మన జగనన్న ప్రభుత్వంలో మార్పుకు ఇదే నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైసీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు._
addComments
Post a Comment