అభివృద్ది, సంక్షేమమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తారక మంత్రం !



 కొంకేపూడి ( పెడన ): 09 నవంబర్ (ప్రజా అమరావతి);


*అభివృద్ది, సంక్షేమమే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తారక మంత్రం !


!* 

                                  

*--- మంత్రి జోగి రమేష్*


ఆంధ్రప్రదేశ్ లో అట్టడుగున ఉన్న పేద ప్రజల జీవితాలలో మార్పు తెచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ది, సంక్షేమమే తారక మంత్రంగా పఠిస్తూ అద్భుతమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్  కొనియాడారు.


     బుధవారం ఉదయం ఆయన పెడన నియోజవర్గంలోని కొంకేపూడి గ్రామ సచివాలయం పరిధిలో  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత ఆయన గ్రామీణ ప్రాంతంలో సురక్షితమైన తాగునీరు సరఫరా చేయడానికి కొంకేపూడి పంచాయతీ పరిధిలోని కొంకేపూడి, ఈదుమూడి, కట్లపల్లి గ్రామాలకు 1 కోటి 14 లక్షల రూపాయల వ్యయంతో జలజీవన్ మిషన్ ప్రాజెక్టు పధకం కింద చేపట్టనున్న పనులకు మంత్రి లాంఛనంగా శంకుస్థాపన చేశారు. తర్వాత, పెడన మున్సిపాలిటీ పరిధిలోని 5 వ వార్డుకి చెందిన సుల్తానా బేగం ఉదర సంబంధ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్నారు.

శస్త్రచికిత్స (మెష్ ప్లాష్టి) చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం తెలంగాణ రాష్ట్రం

 హైదరాబాద్ లోని యశోదా హాస్పిటల్ లో మాత్రమే ఆమెకు ఆపరేషన్ చేసే అవకాశం ఉంది  రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం నేపథ్యంలో ఆమెకు 

ఆపరేషన్ నిమిత్తం 2 లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలిపారు. ఇటీవల పెడన పట్టణ ప్రజాప్రతినిధులు మంత్రి  జోగి రమేష్ కు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలిపారు. మంత్రి మానవత్వంతో ఆమె ఆరోగ్య విషయంలో చక్కగా స్పందించారు. సరిగ్గా వారం రోజుల వ్యవధి లోపు సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ ఓ సి ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందుకున్న ఎల్ ఓ సి ని  మంత్రి జోగి రమేష్  సమక్షంలో, మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఖాజా, సుల్తానా బేగంకు అందించారు


     అనంతరం మంత్రి జోగి రమేష్  కొంకేపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  పాల్గొన్నారు.  పోలగాని రామలీల, చలపాటి వీరమ్మ, మాడెం లక్ష్మణ, అనగాని పావని, నాశన నాగమణి, కోడూరు వెంకటేశ్వరరావు, ఈడే జోత్స్న ప్రియాంక, యార్లగడ్డ నాగేశ్వరరావు, వీరంకి సీతమ్మ, శెలపాటి అంకమ్మ, గోనగుండ్ల కృష్ణకుమారి, పామర్తి రంగారావు, వేమన ఆంజనేయులు,మాడెం ఏసురజిని, పడమటి మహాలక్ష్మి, కేశన నాగలక్ష్మి తదితరుల ఇంటింటికి వెళ్లి , వారి కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాలు కనుక్కొని ప్రభుత్వ పరంగా పొందుతున్న సంక్షేమ పథకాలను కరపత్రం ద్వారా చదివి వినిపించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాగిత సోమయ్య మంత్రి జోగి రమేష్ తో తన ఇబ్బందిని చెప్పుకున్నారు, తాను నడవలేని స్థితిలో ఉన్నానని మూడు చక్రాల సైకిల్ దయచేసి ఇప్పించాలని అభ్యర్థించారు. అలాగే, శెలపాటి నరసింహారావు మంత్రితో తన ఆరోగ్య పరిస్థితిని వివరించారు. తనకు గుండె జబ్బు ఉందని, తాను చికిత్స కోసం విజయవాడలోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే, మీకు ఆరోగ్యశ్రీ వర్తించదని  డబ్బులు చెల్లించి మాత్రమే వైద్యం చేయించుకోవాలని వైద్యుడు తెలిపారని చెప్పారు. తన వద్ద అంత సొమ్ము లేకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చానని కన్నీళ్లు పెట్టుకొని తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ," నీవు ధైర్యంగా ఉండన్నా.. నేను నీకు అండగా ఉంటా  " అని చెప్పి స్థానిక ఏఎన్ఎంను పిలిచి తక్షణమే వారి వివరాలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యశ్రీ రాష్ట్ర కోఆర్డినేటర్ తో ఫోన్లో మాట్లాడి, గుండె చికిత్సకు వైద్యం ఆరోగ్యశ్రీలో లేదని చెప్పిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని చెప్పారు అలాగే, తాను సిఫార్సు చేసి ఏఎన్ఎం తో పంపుతున్న  శెలపాటి నరసింహారావుకు తక్షణమే చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే  పలు సమస్యలు అక్కడే ఉన్న అధికారులకు చెప్పి పరిష్కరించాలని మంత్రి జోగి రమేష్ ఆదేశించారు. వారి వ్యక్తిగత సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారానికి తగు సూచనలు ఇచ్చారు. 


      గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న పెడన మార్కెట్ కమిటీ చైర్మన్  గరికిపాటి చారుమతి రామానాయుడు, ఎంపీపీ రాజులపాటి వాణి అచ్యుతరావు, సర్పంచ్ దావు భైరవ లింగం, మండల పార్టీ అధ్యక్షుడు కొండవీటి నాగబాబు, కార్యదర్శి పామర్తి సాంబశివరావు, బీసీ సెల్ అధ్యక్షుడు బెజవాడ నాగబాబు, పెడన 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, గూడూరు జడ్పిటిసి వేముల సురేష్, నడపూరు సర్పంచ్ సింగంశెట్టి రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ లోయ ఆంజనేయులు,శొంఠి  ప్రభుస్వామి, తమ్ము శ్రీనివాస్, పరస రాజేష్ స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.


Comments