*- చంద్రబాబు సమక్షంలో క్యాడర్ వెల్ఫేర్ పై ప్రసంగించనున్న శిష్ట్లా లోహిత్
*
*- 18న కర్నూల్ లోని ది మౌర్య ఇన్ లో సమావేశం*
*- ఆదోనిలో చంద్రబాబు రోడ్ షోకు పోటెత్తిన జనం*
*- కొనసాగుతున్న చంద్రబాబు కర్నూల్ జిల్లా పర్యటన*
కర్నూల్, నవంబర్ 17 (ప్రజా అమరావతి): కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా మూడవ రోజు శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ ప్రసగించనున్నారు. కర్నూల్ లోని ది మౌర్య ఇన్ లో ఐటీ ప్రెజెంటేషన్ కార్యక్రమాలు జరగనున్నాయి. చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10గంటల నుండి 11.30గంటల వరకు ఐటీ ప్రెజెంటేషన్ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు వారికి కేటాయించిన అంశాలపై ప్రసంగించనున్నారు. 11గంటల 15 నిమిషాలకు క్యాడర్ వెల్ఫేర్ లో భాగంగా స్యూట్రిఫుల్ యాప్ తదితరాలపై టీడీపీ నేతలు, కార్యకర్తలనుద్ధేశించి శిష్ట్లా లోహిత్ మాట్లాడనున్నారు. అనంతరం కర్నూల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలను చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇదిలా ఉండగా గురువారం కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ పాల్గొన్నారు. ముందుగా రోడ్ షోకు బయలుదేరుతున్న చంద్రబాబుకు శిష్ట్లా లోహిత్ అభివాదం చేశారు. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలపై శిష్ట్లా లోహిత్ చర్చించారు. క్యాడర్ వెల్ఫేర్ కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ చంద్రబాబు కర్నూల్ జిల్లా పర్యటన విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. కొడుమూరు నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఆదోని రోడ్ షో జనసంద్రాన్ని తలపించిందన్నారు. చంద్రబాబు రోడ్ షోలకు అడుగడుగునా ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరిందన్నారు. చంద్రబాబు హయాంలో యువతకు ఐటీ ఉద్యోగాల కల్పన జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వంలో మటన్ షాపులు, షాపింగ్ మాల్స్ లో ఉద్యోగాలిస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం లేదన్నారు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. దీంతో రాష్ట్రంలో గత మూడేళ్ళుగా నిరుద్యోగ సమస్య తీవ్రమవుతూ వస్తోందన్నారు. సంపద సృష్టించడం చంద్రబాబుకు మాత్రమే తెలుసని అన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్ లో సంపద సృష్టించడం వల్లే దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కల్గిన రాష్ట్రంగా తెలంగాణా నిలిచిందన్నారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలను చూస్తుంటే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తోందని అర్ధమవుతోందన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీకి గౌరవంగా పంపుతామని శిష్ట్లా లోహిత్ చెప్పారు.
addComments
Post a Comment