చంద్రబాబును నమ్మితే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్టే

 *- చంద్రబాబును నమ్మితే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్టే* 


 *- జగన్ ను నమ్ముకుంటే జైలుకు పోతారన్న చంద్రబాబు* 

 *- చంద్రబాబు కర్నూలు పర్యటనకు ప్రజల అపూర్వ స్వాగతం* 

 *- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 


కర్నూల్, నవంబర్ 16 (ప్రజా అమరావతి): చంద్రబాబును నమ్మితే భవిష్యత్తుకు బంగారు బాట వేసుకున్నట్టేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను నమ్ముకుంటే జైలుకు పోతారని చంద్రబాబు మరోమారు స్పష్టం చేసినట్టు అయన తెలిపారు.

బుధవారం కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబుతో కలిసి శిష్ట్లా లోహిత్ పలు కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసిన అధికారులందరినీ బోనెక్కిస్తామని చంద్రబాబు హెచ్చరించారని తెలిపారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఎమ్మెల్సీ అనంత బాబు ఘటనను చంద్రబాబు ఉదహరించినట్టు తెలిపారు. రౌడీ మూకలను పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులను ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండని చంద్రబాబు హెచ్చరించారన్నారు. ముఠాలను రూపుమాపి, మత విద్వేషాలను తెలుగుదేశం పార్టీ కట్టడి చేసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారన్నారు. ప్రభుత్వం కేసులు పెడుతుందని ఎవరూ భయపడవద్దని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు హత్యా రాజకీయాలకు దూరమని చంద్రబాబు వివరించారన్నారు. అన్యాయం జరిగితే చెప్పడానికి పిరికితనం ఎందుకని చంద్రబాబు ధైర్యం చెప్పారన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. కొట్టిన నిందితుడిని కాపాడుతున్న వారు ఎక్కడున్నా బయటికి తీసుకు వస్తానని చంద్రబాబు హెచ్చరించినట్టు చెప్పారు. డోన్ లో ఒక అప్పుల మంత్రి  తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు చెందిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేశాడని, మేం తలుచుకుంటే మిమ్మల్ని కూల్చడం పెద్ద పనేమీ కాదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారన్నారు. న్యాయం, ధర్మం ప్రకారం వ్యవహరించాలని, లేకుంటే మీ గుండెల్లో నిద్ర పోతామంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను చంద్రబాబు హెచ్చరించారన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోందని, అది ప్రభంజనంగా మారుతోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీ గాలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందంటూ చంద్రబాబు జోస్యం చెప్పారన్నారు. కర్నూలు జిల్లాలో 18 లక్షల కార్డులు తీసివేశారని, పేదల బాధలు వైసీపీ ప్రభుత్వానికి ఉరి తాళ్లుగా మారుతాయని,18 లక్షల కుటుంబాలను అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంగోపాల్ రెడ్డిని ఆశీర్వదించాలని చంద్రబాబు కోరారన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఉద్యోగులకు గౌరవం ఇవ్వని పరిస్థితులను ప్రజలకు చంద్రబాబు వివరించారని తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భూస్థాపితం చేయండని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి మెట్టు వేయాలని చంద్రబాబు సూచించారన్నారు. ఇదిలా ఉండగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం మార్కాపురం గ్రామంలో పత్తి పంటలను చంద్రబాబు పరిశీలించారని తెలిపారు. నకిలీ విత్తనాల కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు చంద్రబాబుకు రైతులు వివరించారన్నారు.

నకిలీ విత్తనాలపై జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదని రైతులు చంద్రబాబు ఎదుట వాపోయారని తెలిపారు. ప్రజా ప్రతినిదులు కూడా కంపెనీలతో కుమ్మక్కు అయ్యారని రైతులు అవేదన వ్యక్తం చేశారని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image