గుంటూరు నగరంలో ఈట్ స్ట్రీట్స్(ఫుడ్ కోర్ట్స్)ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలి

 గుంటూరు. (ప్రజా అమరావతి); నగరంలో కలెక్టరేట్ లోని కాన్ఫరన్స్ హాల్ నందు గుంటూరు నగరాభివృద్ధికి సంబంధించి ట్రాఫిక్,పొల్యూషన్ కంట్రోల్ బోర్డు,ఎలక్ట్రిసిటీ,నేషనల్ హైవే,R&B మరియు నగర పాలక సంస్థ అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి విభాగాల వారీగా సమస్యల పై చర్చించి,తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్ M.వేణుగోపాలరెడ్డి,  గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, MLAలు మహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్ , నగర పాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

గుంటూరు నగరంలో ఈట్ స్ట్రీట్స్(ఫుడ్ కోర్ట్స్)ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాల


న్నారు.

నగర పాలక సంస్థ రోడ్ల పైన మరియు రోడ్డు మార్జిన్ల యందు ఆక్రమణ తొలగించే సమయంలో నగర పాలక సంస్థ అధికారులకు సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలన్నారు.

గుంటూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ ఫ్యూయల్ (ప్లాస్టిక్ వ్యర్ధాల నుండి పెట్రోల్ మరియు డీజిల్ తీయు)ప్లాంట్ నకు అవసరమైన ప్లాస్టిక్ ను అందించాలాన్నారు.

గుంటూరు నగరంలో రోడ్ల విస్తరణ చేస్తున్న ప్రాంతాలలో కరెంటు స్తంభాలను వెంటనే షిఫ్ట్ చేయాలన్నారు.

ప్రత్తిపాదించిన ప్రాంతాలలో నూతన కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయుటకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.

నగరంలో నుండి ఔట్ఫాల్ డ్రైన్ నేషనల్ హైవే ను క్రాస్ చేసే ప్రాంతాలలో కల్వర్టులను ఏర్పాటు చేయాలన్నారు.

నగర పరిధిలోని నేషనల్ హైవే ల యందలి సర్వీసు రోడ్లలో ప్యాచ్ వర్క్ పూర్తి చేసి,గ్రీనరీని అభివృద్ధి చేయాలన్నారు.

గుంటూరు నగరంలో ఉన్నటువంటి R&B రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలన్నారు.

రోడ్ల విస్తరణ చేస్తున్న పలకలూరు రోడ్డు మరియు నందివెలుగు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


Comments