కె. గంగవరం (ప్రజా అమరావతి);
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో భాగంగా ప్రతి గడపకు కనీసం యభై వేల రూపాయల నుండి గరిష్టంగా పది లక్షల వరకు లభ్ది దారులకు లబ్ది చేకూరుతుంద
ని రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.
గురువారం రామచంద్రపురం నియోజకవర్గంలో ని కె. గంగవరం మండల అమూజురు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రివర్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరాలని లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన అన్నారు. ఇంట్లో వయోవృద్దులు వుండే పెన్షన్లు, అనారోగ్యం గా ఉంటే ఆరోగ్య శ్రీ, పుట్టిన పిల్లలకు అంగన్వాడీ ల ద్వారా చక్కటి పోషకాలు తో కూడిన గోరుముద్ద,పాఠశాలలో చదువుల కోసం అమ్మఒడి, నాడు-నేడు ద్వారా అన్నీ మౌళిక సదుపాయాలు తో నాణ్యమైన ఇంగ్లీష్ భాష తో కూడిన విద్య, విద్యాదివేన, వసతి దీవెన, స్కూల్ డ్రెస్, షూస్, బెల్ట్, బాగ్, పుస్తకాలు అందించడం,45 సంవత్సరాలు నిండిన వారికి జగనన్న తోడు, ఆసరా, సున్న ఒడ్డి లతో మహిళ మహిళ శక్తిని ఆర్థికంగా బలోపేతం చేయడం, ఇండ్లు లేనివారికి స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించుకునే విధంగా సహకరించడం , రైతు భరోసా తోపాటు ఇన్పుట్ , పంట నష్టం సహాయం తో రైతులను ఆదుకోవడం లాంటి పథకాలు అమలు పర్చడం ద్వారా గత మూడు సంవత్సరాల్లో లభ్ది దారులకు యాభై వేల నుండి పది లక్షల రూపాయల అందాయని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి గడపగడపకు తిరుగుతూ ప్రభుత్వపరంగా అందుతున్న లబ్ధి వారు వినియోగిస్తున్న తీరు తో పాటు సమస్యలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు .
ఈ సందర్భంగా గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతానికి గురై మంచానికి పరిమితమైన యువకుడిని పరామర్శించి పెన్షన్ అందేవిధంగా ఏర్పాటు చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడుతూ వారికి అందుతున్న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ, అమ్మ ఒడి, ఆసరా, పెన్షన్, కాపు నేస్తం తదితర సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న తీరును అడిగి తెలుసుకుని, సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అమూజురు గ్రామ సర్పంచి నానాపురపు కళ్యాణి, ఎంపీపీ పంపన నాగమణి, జడ్పీటీసీ ఓ.రాజకుమారి, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు పండు గోవిందు, ఎంపీడీఓ శ్రీనివాస్ ,కె.గంగవరం తహసీల్దార్ వైద్యనాధ శాస్త్రీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంట్రీలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment