నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదివాను..జగన్ ఎక్కడ చదువుకున్నాడు?: చంద్రబాబు

 *నేను ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ చదివాను..జగన్ ఎక్కడ చదువుకున్నాడు?: చంద్రబాబు


*


*కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన*


*ఆదోనిలో రోడ్ షో*


*భారీగా తరలివచ్చిన జనం*


*ఉద్వేగంతో ప్రసంగించిన టీడీపీ అధినేత*


*తప్పు జరిగిపోయిందని జనం బాధపడుతున్నారు*


*కర్నూలు జిల్లా (ప్రజా అమరావతి) : కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన కొనసాగింది. గురువారం ఆదోనిలో ఆయన రోడ్ షో నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "నేనేమీ సినిమా యాక్టర్ కాదు... నా సినిమా సూపర్ హిట్ కాలేదు. కానీ కట్టలు తెంచుకుని జనం ఇక్కడికి వచ్చారు. మళ్లీ టీడీపీ రావాలి అని సంఘీభావం తెలిపేందుకు వీరంతా వచ్చారు" అంటూ ఉద్వేగం ప్రదర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక శని గ్రహంలా మారాడని, అన్నీ ఆపేశాడని, అభివృద్ది నిలిపివేశాడని విమర్శించారు. ఒక పెళ్లి చేయాలంటే ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం, కానీ నాడు ముద్దులకు మోసపోయి ఓట్లు వేసి నష్టపోయాం అని పేర్కొన్నారు. తప్పు జరిగిపోయిందని ఇప్పుడు జనం బాధపడుతున్నారని చంద్రబాబు వెల్లడించారు.* 


"మూడున్నరేళ్లలో అభివృద్ది ఆగిపోయింది... రౌడీయిజం పెరిగిపోయింది... దోపిడీ, నేరాలు పెరిగిపోయాయి. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ కుటుంబ వివాదాన్ని కానిస్టేబుల్ బెదిరించారు. దీంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చనిపోయారు. రౌతుకొద్దీ గుర్రం అంటారు... అందుకే పోలీసులు ఇలా అయ్యారు. పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. పోలీసులకు జీతాలు రావడం లేదు....మీ పిల్లలూ నష్టపోయారు. నా కర్నూలు పర్యటనలో వైసీపీ చోటానేతలు వేషాలు వేస్తే... పోలీసులు చూస్తూ కూర్చున్నారు. ప్రజలు తిరగబడి మీ అంతు చూస్తే నాకు బాధ్యత లేదు... ఆపై మీ ఇష్టం!" అని చంద్రబాబు స్పష్టం చేశారు. 


"చెత్తమీద పన్ను వేసే చెత్త ముఖ్యమంత్రిని ఏమనాలి? మనం మరుగుదొడ్లు కట్టిస్తే వాటిపైనా పన్ను వేస్తోంది ఈ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇసుక దొరుకుతోందా?. ఈ ఊళ్లో ఇసుక కర్నాటక, హైదరాబాద్లో దొరుకుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారా. ఉంటే ఏం చేస్తున్నారు? సాయంత్రానికి డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. మద్యం మాఫియాతో జగన్ దోపిడీ చేస్తున్నారు. తయారీ ఆయనే... అమ్మకం ఆయనే.  ప్రకాశం జిల్లాలో హవాలా మంత్రి. కర్నూలులో బెంజి మంత్రి. ఇదీ జగన్ క్యాబినెట్!


ఇసుక సొమ్ము, మద్యం సొమ్ము చాలడం లేదు... నకిలీ విత్తనాలతో పత్తిరైతులను ముంచారు. నాడు తప్పు చేస్తే తాట తీస్తాను అని భయం ఉంది కాబట్టి అక్రమాలకు అంతా భయపడ్డారు. కానీ నేడు ఎమ్మెల్యేలు అవినీతిలో భాగస్వాములు అవుతున్నారు. వైసీపీ నేతలు ఖనిజ సంపద దోచేస్తున్నారు.. భూకబ్జాలు చేస్తున్నారు. చుక్కల భూమి పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలా చేసి ప్రజల ఆస్తులు కొట్టేస్తున్నారు. ప్రతి రోజు ప్రజలు తమ భూములు ఉన్నాయో పోయాయో చూసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. 


"పవన్ కళ్యాన్ విశాఖపట్నం పోతే అక్కడా ఇబ్బంది పెట్టారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో 120 అడుగుల రోడ్డు వేస్తారా? బస్సు రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తారట! రేపు మేము కూడా వైసీపీ నేతల ఇళ్లపై రోడ్లు వెయ్యలేమా...ఫ్లైవోవర్ లు కట్టలేమా? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే టీవీ చానల్స్ ను ఉన్మాది జగన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. నేను ఆరోజు ఇలా చేసి ఉంటే సాక్షి టివి, సాక్షి పేపర్ వచ్చేదా? 


తెలుగుదేశం బీసీల పార్టీ. వారికి నేను అండగా ఉంటా. వాల్మీకి, కురబ, వడ్డెర, కమ్మరి, కుమ్మరి సహా అన్ని కులాలను ప్రభుత్వంలోకి వచ్చాక ఆదుకుంటాను. యవతకు జగన్ ఇచ్చిన ఉద్యోగాలు మటన్ కొట్లో ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం...! కానీ నేను రైతుల పిల్లలు, కూలీల పిల్లలు కూడా ఐటీ ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాను. యువత ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారు. సమాజాన్ని జగన్ రెడ్డి చెడగొడుతున్నాడు. సంక్షేమం నిలిపివేస్తాను అని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తాను. బుద్ది ఉన్న సిఎం ఎవరైనా కలెక్టరేట్ లు, ప్రభుత్వ భవనాలు తాకట్టు పెడతారా? నా అనుభవం ఉన్నంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు! నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎ చేశాను. మరి జగన్ ఎక్కడ చదువుకున్నాడు?" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image