- శాశ్వత భూసర్వే కోసం పెద్ద ఎత్తున సర్వేరాళ్ళ తయారీ
- రాష్ట్ర వ్యాప్తంగా 2వేల గ్రానైట్ పరిశ్రమలకు ఆర్డర్లు
- భారీ సంఖ్యలో సిద్దమవుతున్న సర్వేరాళ్ళు
- గ్రానైట్ పరిశ్రమదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు
- బిల్లుల చెల్లింపులు జరగడం లేదనే వార్తలు నిరాధారం
- సర్వేరాళ్ల తయారీ, విక్రయాలు, రవాణాపై ప్రత్యేకంగా యాప్
- తయారైన సర్వేరాళ్ళు గమ్యానికి చేరుకున్న వెంటనే బిల్లుల చెల్లింపు
- అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ
- గతంలో మూతపడిన అనేక గ్రానైట్ పరిశ్రమలకు వరంగా సర్వే రాళ్ళ తయారీ
- ఉత్సాహంగా ముందుకు వస్తున్న గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకులు
- వేలాధి మందికి ఉపాధి కల్పిస్తున్న సర్వేరాళ్ళ తయారీ
- సర్వేరాళ్ళ తయారీ రేటును రూ.300కి పెంచిన ప్రభుత్వం
- గ్రానైట్ పరిశ్రమలు వెనుకంజ వేస్తున్నాయనే వార్తలు పూర్తి అసత్యం
: శ్రీ విజి వెంకటరెడ్డి, ఎపిఎండిసి వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్
అమరావతి (ప్రజా అమరావతి):
1) రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా శాస్త్రీయ పద్దతుల్లో జరగుతున్న జగనన్న భూహక్కు-భూరక్ష పథకం కోసం పెద్ద ఎత్తున సర్వే రాళ్ళను గనులశాఖ సమకూరుస్తోందని ఎపిఎండిసి వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ విజి వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని రెండువేల గ్రానైట్ పరిశ్రమల్లో ఇందుకు అవసరమైన రాళ్ళను తయారు చేస్తున్నారని వెల్లడించారు. గతంలో ఆర్డర్లు లేక, ఆర్థికంగా చితికిపోయి మూతపడిన వేలాది గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం సర్వేరాళ్ళ తయారీ ఆర్డర్ లను ఇవ్వడంతో ఆ పరిశ్రమలకు తిరిగి జీవం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రానైట్ పరిశ్రమకు మంచి రోజులు రావాలని అనేక రాయితీలను ప్రభుత్వపరంగా ప్రకటించారని, స్లాబ్ విధానంను కూడా అమలులోకి తీసుకువచ్చాని గుర్తు చేశారు. దానికి అదనంగా సర్వేరాళ్ల తయారీని కూడా పరిశ్రమ నిర్వాహకులకు అప్పగించడం ద్వారా వారికి మరింత పని కల్పించారని తెలిపారు.
2) ముడిసరుకును గ్రానైట్ పరిశ్రమలకు అందించి, వారి నుంచి నిర్ధేశిత నమూనాలో సర్వే రాళ్ళను తయారు చేయిస్తున్నామని అన్నారు. సిద్దమైన సర్వేరాళ్ళకు నాణ్యతాప్రమాణాలను పరీక్షించి, వాటిని సూచించిన గమ్యస్థానంకు చేర్చిన వెంటనే గ్రానైట్ పరిశ్రమలకు బిల్లులు చెల్లిస్తున్నామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్క పరిశ్రమకు కూడా ఎక్కడా బిల్లుల బకాయిలు లేవని స్పష్టం చేశారు. బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, గ్రానైట్ పరిశ్రమ యజమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోందంటూ పత్రికల్లో ప్రచురించిన వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని ఖండించారు.
3) గతంలో సిద్దం చేసిన ఒక్కో సర్వేరాయికి రూ.270 ప్రభుత్వం చెల్లించేదని, దానిని ఇప్పుడు రూ.300లకు పెంచడం జరిగిందని తెలిపారు. దీనితో మరింత ఎక్కువమంది ఆర్డర్లు కావాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని అన్నారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకుల్లో ఆందోళన అంటూ 'పత్రికల్లో వచ్చిన వార్త పూర్తిగా అసత్యమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
4) సర్వేరాళ్ళ తయారీ, విక్రయాలు, రవాణా అంశాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా యాప్ ను రూపొందించామని తెలిపారు. ఈ యాప్ లో ఇందుకు సంబంధించిన అన్ని దశలు ఉంటాయని, గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులు కూడా దీనిలో లాగిన్ అయి తము విక్రయించిన సర్వేరాళ్ళకు సంబంధించి బిల్లుల చెల్లింపులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు చూసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.
5) సర్వేరాళ్ళ తయారీలో గ్రానైట్ యజమానులపై ఆర్థికంగా భారం పడకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సర్వేరాళ్ళకు అవసరమైన బ్లాక్ లను స్వయంగా గ్రానైట్ పరిశ్రమ యజమానులకు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. కేవలం ఆ రాయిని సర్వేరాళ్ళుగా తీర్చిదిద్దడం వరకే గ్రానైట్ పరిశ్రమ నిర్వాహకుల బాధ్యత అని తెలిపారు. ఇది పూర్తి చేసిన వెంటనే వారికి బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు.
addComments
Post a Comment