గడువు లోగా నాడు-నేడు పనుల్ని పూర్తి చేయాలి

 ఏపీ వైద్య ఆరోగ్య శాఖ



*గడువు లోగా నాడు-నేడు పనుల్ని పూర్తి చేయాలి


*


*పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నాం*


*విస్సన్నపేట సిహెచ్ సి నాడు-నేడు నిర్మాణ పనుల్ని తనిఖీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు*


అమరావతి (ప్రజా అమరావతి);

నిర్ణీత గడువు లోగా నాడు-నేడు పనుల్ని పూర్తి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ఆదేశించారు. నిరంతరం ఈ పనుల పురోగతిని సమీక్షిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నాడు-నేడు కింద చేపడుతున్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట సామాజిక ఆరోగ్య కేంద్రం(సిహెచ్ సి) రెండంతస్తుల నిర్మాణ పనుల్ని కృష్ణ బాబు మంగళవారం నాడు స్వయంగా పరిశీలించారు. పనులు ఏమేరకు జరుగుతున్నాయని

డిసిహెచ్ ఎస్ డాక్టర్ లక్ష్మీ కుమారిని అడిగి తెలుసుకున్నారు. 

వచ్చే ఏడాది మార్చికల్లా నిర్మాణ పనుల్ని పూర్తి చేస్తామని ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఇప్పటి వరకూ70 శాతం మేర పనులు పూర్తయ్యాయని ఆమె తెలిపారు. రెండు ఫ్లోర్లూ పూర్తయ్యాయని, పోస్ట్ మార్టం గది బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయ్యిందని ఆమె వివరించారు. ఫినిషింగ్ , ఇంటీరియర్ పనులు పూర్తి కావాల్సి వుందన్నారు. 

 అనంతరం పక్కనే వున్న  విస్సన్నపేట పాత పిహెచ్ సీని కృష్ణ బాబు సందర్శించారు. గత ఎనిమిది నెలలుగా అప్కోస్ నుంచి తమకు జీతాలు రావడం లేదని అక్కడ పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేయగా వెంటనే జీతాలు చెల్లించేలా ఆదేశాలిస్తామని కృష్ణ బాబు స్పష్టం చేశారు. ఖాళీ గా వున్న నలుగురు స్టాఫ్ నర్సుల పోస్టుల్ని , ఒక జనరల్ మెడిసిన్ డాక్టర్ పోస్టునూ ఉద్యోగుల రీస్ట్రక్చరింగ్ లో భాగంగా నింపుతామన్నారు. నిర్మాణ పు పనుల్ని మరింత వేగవంతం చెయ్యాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ యు.రమేష్ , స్పెషలిస్ట్ డాక్టర్లు హెలీనా , విజయబాబు , డాక్టర్లు పావని , వెంకటేశ్వరరావు, అనిత పాల్గొన్నారు.


Comments