గౌరవ డాక్టరేట్ అందుకున్న కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్



 *గౌరవ డాక్టరేట్  అందుకున్న  కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్* 



 *రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు* : 

 *రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాని గోవర్ధన్ రెడ్డి* 


తిరుపతి, నవంబర్ 16 (ప్రజా అమరావతి): వ్యవసాయ రంగంలో వివిధ పంటలలో సాంకేతికంగా నూతన వంగడాలను రూపొందించడం దేశ ఆహార భద్రతను సాదించడంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషించిందని కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు.  బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియ౦ నందు ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయ ఆద్వర్యంలో పాల్గొని ముఖ్య అతిథిగా విచ్చేసిన  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్   రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి  కాకాని గోవర్దన రెడ్డి, ఆం.ప్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి అధ్యాపకులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమo లో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్  మాట్లాడుతూ..  ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి ఆద్వర్యంలో గౌరవ డాక్టరేట్ అందుకోవడం నా జీవితంలో మరిచిపోని రోజుగా మిగిలిపోతుంది అని అన్నారు. డాక్టరేట్ ఇచ్చిన ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయ సిబ్బంధికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్దికి వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, సిబ్బంది ఎంతో కృషి చేశారని, దేశంలో 74  వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో ఆచార్య ఎన్.జి రంగ విశ్వ విద్యాలయం 11 వ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా గర్వంగా ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో వివిధ పంటలలో సాంకేతికంగా నూతన వంగడాలను రూపొందించడం దేశ ఆహార భద్రతను సాదించడంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషించిందని,   దేశంలో వ్యవసాయ విశ్వ విద్యాలయాల శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా మన దేశం ఆహార దాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్దిని సాదించడమే కాక ఆహార ధాన్యాలు వివిధ పంటల ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో మనం సాధించిన ప్రగతి ప్రపంచ దేశాల్లో ఆహార ఉత్పతుల కొరకు మన దేశం వైపు చూసేలా చేయడం గర్వించదగ్గ విషయమని, అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించేలా వ్యవసాయ రంగ పాత్ర కీలకమైందని తెలిపారు.    

 అనంతరం  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్దిలో ఆచార్య ఎన్.జి.రంగ విశ్వ విద్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు. బి.పి.టి- 5204(సాంబా మహసూరి), ఎం.టి.యు 7029(స్వర్ణ), ఎం.టి.యు 1001(విజేత) వంటి రకాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయనీ, దేశంలోనే మొదటి సారిగా వ్యవసాయ రంగంలో డ్రోన్ ల వినియోగం వంటి నూతన విధానాలను ప్రవేశ పెట్టి అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాదాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలో రైతులకు సేవలను అందించేలా తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం లో మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలకు వ్యవసాయ విశ్వ విద్యాలయం సాంకేతిక సహకారం అందించడంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలవుతున్న వ్యవసాయ కార్యక్రమాలు అన్నదాతకు తోడ్పతున్నాయని తెలిపారు.


ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, రెడ్డెప్ప, మిథున్ రెడ్డి,  శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల వైస్ చాన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ పద్మనాభ రెడ్డి, ఆచార్య ఎన్.జి రంగ విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్స్ పి.వి.ఆర్ రెడ్డి,టి.వి మురళీ నాథ్ రెడ్డి, ఆచార్య ఎన్.జి రంగ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ జి.రామారావు   అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 


Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
Shiv Nadar University Chennai inaugurated its flagship Quiz Competition - QUBIZ
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image