ఫ్యామిలీ ఫిజీషియ‌న్ వైద్య విధానం అద్భుతం

 ఎపి వైద్య ఆరోగ్య శాఖ

మంగ‌ళ‌గిరి: ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌, వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం (ప్రజా అమరావతి);



*ట్రయ‌ల్ ర‌న్ విజ‌య‌వంతం*

*ఫ్యామిలీ ఫిజీషియ‌న్ వైద్య విధానం అద్భుతం*


*జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌కు క్షేత్ర‌స్థాయిలో అనూహ్య‌ స్పంద‌న‌*

*మూడు వారాల్లోనే 4733 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌ల రెండు విడ‌త‌ల‌ సంద‌ర్శ‌న‌*

*4267 హెల్త్ క్లినిక్‌లు ఒక‌సారి సంద‌ర్శ‌న‌*

*ఇప్ప‌టివ‌ర‌కు 97,011 బీపీ, 66,046 షుగ‌ర్ రోగులకు ప‌రీక్ష‌లు*

*ఫ్యామిలీ ఫిజిషియ‌న్ విధానంలో 67 ర‌కాల మందులు, 14 ర‌కాల వైద్య‌ప‌రీక్ష‌లు*

*ఖాళీ పోస్టుల భ‌ర్తీ విష‌యంలో చొర‌వ‌ చూపాలి*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

*ఫ్యామిలీ ఫిజిషియ‌న్ ట్ర‌య‌ల్ ర‌న్‌పై స‌మీక్షా స‌మావేశం*


ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానానికి సంబంధించిన‌ ట్ర‌య‌ల్ ర‌న్‌ విజ‌య‌వంతంగా సాగుతోంద‌ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి విడ‌ద‌ల ర‌జిని అన్నారు. మంగ‌ళ‌గిరి, ఏపీఐఐసీ ట‌వ‌ర్స్ లోని వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యం, కాన్ఫ‌రెన్స్ హాలులో వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో ఫ్యామిలీ ఫిజిషియ‌న్ ట్ర‌య‌ల్ ర‌న్ పై బుధవారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, డిఎంఇ డాక్టర్ వినోద్ కుమార్, ఆరోగ్య శ్రీ  సిఓవో హరేందిర ప్రసాద్, డిహెచ్ డాక్టర్ వేమిరెడ్డి రామిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 

 ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆలోచ‌న‌ల్లోంచి వ‌చ్చిన గొప్ప కార్య‌క్ర‌మాల్లో ఫ్యామిలీ ఫిజీషియ‌న్ వైద్య విధానం కూడా ఒక‌ట‌ని తెలిపారు. గ‌త నెల 21వ తేదీ నుంచి ఈ కార్య‌క్ర‌మం ట్ర‌య‌ల్ ర‌న్ ప్రారంభ‌మైంద‌న్నారు. ఈ వైద్య విధానం సాగుతున్న తీరు, క్షేత్ర‌స్థాయిలో ఎద‌రవుతున్న ఇబ్బందులు, ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న, వైద్యుల నుంచి వ‌స్తున్న సూచ‌న‌లు తదిత‌ర వివ‌రాలను అధికారుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేవ‌లం మూడు వారాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 4733 వైఎస్సార్ హెల్త్‌క్లినిక్‌ల‌కు రెండుసార్లు 104 ఎంఎంయూ వాహ‌నాలు వెళ్లాయ‌ని, సిబ్బంది రెండు విడ‌త‌లుగా ఆయా గ్రామాల‌కే వెళ్లి వైద్య ప‌రీక్ష‌లు అందించార‌ని తెలిపారు. మ‌రో 4267 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల‌కు 104 ఎంఎంయూ వాహ‌నాలు ఒక‌సారి వెళ్లాయ‌ని వివ‌రించారు. ఆయా వాహ‌నాల ద్వారా వైద్య సిబ్బంది ప్ర‌జ‌ల‌కు సంతృప్తి క‌ర‌మైన వైద్య సేవ‌లు అందించాయ‌ని చెప్పారు.

*పేద‌ల్లో ఆనందం*

ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానానికి సంబంధించి తాను స్వ‌యంగా ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నాన‌ని, వారి నుంచి అద్భుత‌మైన స్పంద‌న క‌నిపిస్తోంద‌ని తెలిపారు. ఎంబీబీఎస్ డాక్ట‌ర్ స‌హా ఆరుగురు సిబ్బంది నేరుగా ఆయా గ్రామాల‌కే వెళ్లి వైద్య సేవ‌లు అందించ‌డం చాలా గొప్ప విష‌య‌మ‌ని చెప్పారు. జ‌గ‌న‌న్న ఆలోచ‌న‌ల వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌న్నారు. ఈ వైద్య విధానం ద్వారా ప్ర‌జ‌ల‌కు 67 ర‌కాల మందులు ఉచితంగా అందుతున్నాయ‌ని తెలిపారు. 14 ర‌కాల వైద్య ప‌రీక్ష‌లు చేస్తున్నార‌ని చెప్పారు. ఈ వైద్య విధానం ద్వారా రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 97,011 మంది బీపీ రోగులు, 66,046 మంది షుగ‌ర్ రోగుల‌కు ప‌రీక్ష‌లు చేసి, ఉచితంగా మందులు అంద‌జేశార‌ని తెలిపారు. వీరి ఆరోగ్యంపై ఇక నుంచి ఫ్యామిలీ వైద్య విధానం ద్వారా నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటుంద‌ని తెలిపారు. ఈ వైద్య విధానానికి ప్రారంభించే నాటికి మెడిక‌ల్ ఆఫీస‌ర్లు 86 శాతం మంది అందుబాటులో ఉండ‌గా.. ప్ర‌స్తుతం 96.5 శాతం మంది అందుబాటులో ఉన్నార‌ని, నిరంత‌రం నియామ‌కాలు చేప‌డుతూనే ఉన్నామ‌ని, దీనివ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని వివ‌రించారు.

*అతి త్వ‌ర‌లో కొత్త ఎంఎంయూలు*

నెల‌లో రెండుసార్లు ప్ర‌తి వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సంద‌ర్శించేలా చేయ‌డంలో భాగంగా మ‌రికొన్ని కొత్త ఎంఎంయూ వాహ‌నాల‌ను అతి త్వ‌ర‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేసేందుకు ఎఫ్‌పీసీ యాప్‌ను ప్ర‌భుత్వం అభివృద్ధి చేసింద‌ని తెలిపారు. రాష్ట్ర‌, జిల్లా స్థాయి కార్యాల‌యాల కోసం డ్యాష్ బోర్డును కూడా అభివృద్ధి చేశామ‌న్నారు. మెడిక‌ల్ ఆఫీస‌ర్లంద‌రికీ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు అంద‌జేశామ‌న్నారు. ఫ్యామిలీ ఫిజీషియ‌న్ ట్ర‌య‌ల్ ర‌న్‌లో భాగంగా కొన్ని అంశాలు త‌న దృష్టికి వ‌చ్చాయ‌న్నారు. ఈ విధానం ద్వారా వైద్య సేవ‌లందిస్తున్న సీహెచ్‌సీల్లోని వైద్యుల‌కు రూర‌ల్ స‌ర్వీసు వెసులుబాటువ‌చ్చేలా చూడాల‌ని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. హెల్త్ క్లినిక్ ప‌రిధిలోని అన్ని గ్రామాల‌కూ 104 ఎంఎంయూ వాహ‌నం వెళ్లేలా, వైద్య‌సిబ్బంది సేవ‌లు అందించేలా చూడాల‌న్నారు. ఈ వైద్య‌విధానంలో ప్ర‌తిభ చూపుతున్న వైద్యుల‌కు ప్రోత్సాహ‌కాలు అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. 

*నియామ‌కాల విష‌యంలో చొర‌వ చూపండి*

నియామ‌కాలు నిరంత‌రం జ‌రిగేలా చూడాల‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశించారు. ఇప్ప‌టికే ఈ మేర‌కు ప్ర‌త్యేక జీవో కూడా జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అన‌స్తీషియా వైద్యులు ఎక్క‌డ లేరో చూసి, వెంట‌నే నియామ‌కాలు చేప‌ట్టాల‌న్నారు. ప్ర‌తి ఆస్ప‌త్రిలో ఆన‌స్తీషియా వైద్యులు ఉండేలా స‌ర్దుబాటుచేయాల‌ని ఆదేశించారు. వ్యవ‌ధి ఆధారిత సేవ‌ల‌కు గాను వైద్యులను నియ‌మించుకునే విష‌య‌మై జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు విధివిధానాలను పంపాల‌ని చెప్పారు. ఆ వైద్యులకు వెనువెంట‌నే పారితోషికం అందేలా చూడాల‌న్నారు. డిప్యూటీ సివిల్ స‌ర్జ‌న్ల‌ను సివిల్ స‌ర్జ‌న్లుగా, సీఏఎస్‌ల‌ను డీసీఏఎస్‌లుగా వెంట‌నే ప్ర‌మోష‌న్లు చేప‌ట్టాల‌ని చెప్పారు. 2020 విధుల్లో చేరిన సీఏఎస్ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌కు పేస్కేల్ అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న 572 స్టాఫ్ న‌ర్సు పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాలన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
बर्खास्त होंगे उत्तराखंड विधानसभा सचिवालय के 228 कर्मी, हाईकोर्ट ने फैसला सही कहा।
Image